Movies Release in 2025 : ఒకప్పుడు హాలీవుడ్-బాలీవుడ్-టాలీవుడ్- కోలీవుడ్ …ఇలా ఏ ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీ సెపరేట్ గా ఉండేది. ఇప్పుడా లెక్కలు మారిపోయాయ్. అన్నీ పాన్ ఇండియా ప్రాజెక్టులే. 2024లో హనుమాన్ , కల్కి, దేవర, పుష్ప 2 సహా పలు పాన్ ఇండియా ప్రాజెక్టులు దుమ్ములేపాయ్. మరి 2025 లో బరిలో దిగే భారీ ప్రాజెక్టులేంటో తెలుసా!
2025 జనవరి to మార్చి
2025 ఆరంభంలో రాబోతున్న సినిమా… గేమ్ ఛేంజర్. రామ్ చరణ్-శంకర్ కాంబనేషన్లో భారీ అంచనాల మధ్య తెరకెక్కిన గేమ్ ఛేంజర్లో కియారా అద్వాని హీరోయిన్. వాస్తవానికి 2024 చివర్లో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ 2025 జనవరి 10కి పోస్ట్ పోన్ అయింది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న అక్షయ్ కుమార్ ‘స్కై ఫోర్స్’ సినిమా రిలీజ్ అవుతోంది. విక్కీ కౌశల్ ఛావా మూవీ డిసెంబర్లో రిలీజ్ కావాల్సింది కానీ 2025 ఫిబ్రవరికి పోస్ట్ పోన్ అయింది. నాగచైతన్య-సాయిపల్లవి నటించిన తండేల్ మూవీ వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ కానుంది. అక్కినేని నాగ చైతన్య కి ఇది ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇది. అక్కినేని నాగార్జున, ధనుష్ నటిస్తోన్న కుబేర సినిమా కూడా ఫిబ్రవరి మూడోవారంలో థియేటర్లలో సందడి చేయబోతోంది. అంటే ఒకే నెలలో అక్కినేని హీరోలవి రెండు సినిమాలు అన్నమాట. పవన్ కల్యాణ్ ‘హరి హర వీరమల్లు’, విజయ్ దేవరకొండ ‘VD 12’ ఈ రెండు సినిమాలు మార్చి 28న రిలీజ్ అవుతున్నాయ్. అదే టైమ్ లో లూసిఫర్ 2 వస్తోంది. సల్మాన్ ఖాన్ నటిస్తోన్న ‘సికందర్’ మూవీ ఈద్ సందర్భంగా మార్చి ఆఖర్లో రిలీజ్ అవుతోంది.
2025 ఏప్రిల్ to జూన్
సంక్రాంతికి రావాల్సిన విశ్వంభర సమ్మర్ బరిలో దిగుతోంది. తనయుడు చరణ్ కోసం మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి బరినుంచి తప్పుకుని సమ్మర్ కి వస్తున్నారు. ఇక పాన్ ఇండియా హీరో ప్రభాస్ రాజాసాబ్ మూవీకి ఏప్రిల్ 10 రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హనుమాన్ తో పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ సొంతం చేసుకున్న తేజ సజ్జ మిరాయి మూవీ ఎప్రిల్ 18 న వచ్చేస్తోంది. ‘కన్నప్ప’ మూవీ రిలీజ్ డేట్ ఏప్రిల్ 25 ఫిక్స్ చేశాం అని ఇప్పటికే ప్రకటించాడు మంచు విష్ణు. మే నెలలో నాని హిట్ 3 రిలీజ్ అవుతోంద. జూన్ 4న థగ్ లైఫ్ మూవీ వచ్చేస్తోంది…కమల్ హాసన్-శింబు ప్రధాన పాత్రల్లో నటించన థగ్ లైఫ్ పై భారీ అంచనాలున్నాయ్. సేమ్ డే అక్షయ్ కుమార్ ‘హౌస్ ఫుల్ 5’ రిలీజ్ కానుంది.
2025 జూలై to సెప్టెంబర్
ఇక ఎన్టీఆర్ -హృతిక్ రోషన్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న వార్ 2 ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ అవుతోంది. సెప్టెంబర్లో టైగర్ ష్రాఫ్ ‘బాఘీ 4’ విడుదలకానుంది
2025 ఆగష్టు to డిసెంబర్
అఖరి మూడు నెలల్లో బాక్సాఫీస్ ని శాసించే మూవీస్ చాలా ఉన్నాయ్…ముందుగా అక్టోబరు 2 గాంధీ జయంతి సందర్భంగా కాంతారా చాప్టర్ 1 రిలీజ్ కానుందని ఇప్పటికే అనౌన్స్ చేశాడు రిషబ్ శెట్టి. మాడాక్ సూపర్‌నేచురల్ యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న ‘థమా’ దీపావళి కానుకగా రిలీజ్ అవుతుంది. యశ్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్ లో ఆలియా నటిస్తోన్న ‘ఆల్ఫా’ మూవీ క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇఖ పవన్ కళ్యాణ్ OG, సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ, సూర్య 44, అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ, యశ్ టాక్సిక్ మూవీస్ కూడా 2025లో రిలీజ్ అవుతాయి కానీ ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు.
Pavitra lokesh: పవిత్ర మాటలను అపవిత్రం చేసేశారు.. మరీ ఇంత అరాచకంగా ఉన్నారేంట్రా బాబూ!