ప్రపంచంలోనే ధనిక క్రికెటర్ ఎవరో తెలుసా? ఈ పేరు మీరు ఊహించి ఉండరు!

Images Source IPL

రిచెస్ట్ క్రికెటర్ ఎవరు అంటే ఠక్కున కోహ్లీ అనో, ధోనీ అనో, సచిన్ అనో చెప్పేస్తారు. కానీ వీళ్ల కంటే ఆస్తులు ఎక్కువ ఉన్న క్రికెటర్ ఉన్నాడంటే నమ్ముతారా.. అవును ఇది నిజమే. మొన్న అక్టోబర్‌లో బీసీసీఐ రిలీజ్ చేసిన లిస్ట్‌లో వీళ్ల పేర్లు టాప్‌లో ఉన్నప్పటికీ దసరా తర్వాత లెక్కలు మారిపోయాయి. వీళ్లందరి కంటే కోటీశ్వరుడిగా ఓ మాజీ క్రికెటర్‌ వచ్చారు.

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ ఆడే దేశాల్లో బీసీసీఐ తోపు అన్నమాట. అంటే డబ్బుల్లో మన బోర్డుకు మించిన వాళ్లు లేరు. అందుకే ఐసీసీలో మనోళ్ల మాటకే ఎక్కువ ప్రాధాన్యత.అంతటి డబ్బులు ఉన్న బోర్డులో ఆడే ఆటగాళ్ల సంగతి వేరే లెక్క ఉంటది. అందుకే  ప్రపంచంలో క్రికెట్ ఆడే ఆటగాళ్లలో మన క్రికెటర్లే ధనవంతులు అన్నమాట. ప్రపంచం మొత్తం ఊగిపోయే ఫుట్‌బాల్‌ ప్లేయర్లకు పోటీగా నిలిచేది మన క్రికెటర్లు
ఇలా సంపదలో టాప్‌ ఎవరు అంటే మొదట గుర్తుకు వచ్చే పేరు కోహ్లీ, తర్వాత ఎవరు అంటే ధోనీ అంటారు… ఇంకా అని అడిగితే మరికొందరు సచిన్ అంటారు. వాళ్లు ఆస్తుల కంటే మించిన ఆస్తులు ఓ మాజీ క్రికెటర్‌కు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగమానదు. ఆయన అజేయ్‌ జడేజా.

అజేయ్‌ జడేజాను దసరా సందర్భంగా గుజరాత్‌లోని జామ్‌నగర్ రాయల్ సింహాసనానికి వారసుడిగా ప్రకటించారు. దీంతో ఆయన రిచెస్ట్ క్రికెటర్‌గా మారిపోయారు. జడేజాకు ఇప్పటికి ఉన్న ఆస్తులకు అదనంగా మరో 1,450 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు వచ్చి చేరాయి. అందుకే ఇప్పుడు ఆయనే రిచెస్ట్ క్రికెటర్ అన్నమాట. జడేజా కుటుంబానికి ఎప్పటి నుంచో క్రికెట్‌తో మంచి అనుబంధం ఉంది. రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీలకు జడేజా బంధువులైన KS రంజిత్‌సిన్హాజీ, KS దులీప్‌సిన్హాజీ పేర్లు పెట్టారు.

అయితే తాజాగా బీసీసీఐ ప్రకటించిన క్రికెటర్ల ఆస్తుల వివరాల ప్రకారం చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సెప్టెంబర్ 2023లో క్రిక్‌బజ్ వెల్లడించిన వివరాల ప్రకారం 2023వ ఆర్థిక సంవత్సంలో BCCI రూ.6,558.80 కోట్లు సంపాదించింది. ఇది అంతకు ముందు ఏడాది చూసుకుంటే రూ. 4,360.57 కోట్లుగా ఉంది.

క్రికెటర్ల వ్యక్తిగత వివరాలు విషయానికి వస్తే మాత్రమే… అప్పటి లెక్కల ప్రకారం రోహిత్ శర్మ ఆస్తుల విలువ రూ. 214 కోట్లు. ఎంఎస్‌ ధోనీ పేరిట దాదాపు రూ.1,000 కోట్లు ఆస్తులు ఉన్నాయి. విరాట్ కోహ్లీ నెట్‌వర్త్‌ రూ.1,050 కోట్లుగా తెలుస్తోంది.

ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం చెప్పాలి. ఇప్పటి వరకు బ్రాండ్ వాల్యూ ఎక్కువ ఉన్న కోహ్లీ అందరి కంటే ధనవంతుడు అనుకున్నారు అంతా. కానీ అందరి కంటే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆస్తుల విలువే ఎక్కువ. ఆయనకు దాదాపు 1250 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం ఆయన ఆస్తుల విలువ 1500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ ఇప్పుడు ఆయన కంటే జడేజా ఎక్కువ ఆస్తులతో టాప్‌లోకి వెళ్లిపోయారు.

తరవాత కథనం