శీతాకాలం అంటేనే రోగాల కాలం. కేవలం వైరస్లు, బ్యాక్టీరియాల వల్లే కాదు. అతిగా చలికి ఎక్స్పోజ్ కావడం వల్ల కూడా వ్యాధులకు గురవ్వుతామనే సంగతి మీకు తెలుసా? అందుకే మీరు ఈ సీతాకాలంలో తప్పకుండా ఉన్ని దుస్తులు కూడా వేసుకోవాలి. అయితే, చలితీవ్రత నార్మల్‌గా ఉండే ప్రాంతాల్లో నిత్యం ఉన్ని దుస్తులు వేసుకుని ఉండలేం. కాబట్టి, ఈకింది పేర్కొన్న కొన్ని రకాల వింటర్ డ్రెస్‌లను ప్రయత్నించండి.
టర్టిల్ నెక్ డ్రెస్‌లు
కాటన్ టైప్ వింటర్ డ్రెస్‌లు చూసేవారికి ఇది మంచి సెలక్షన్. ఎందుకంటే టర్టిల్ నెక్లో చాలావరకు దుస్తులు ఊలు, కాటన్ మిశ్రమంతో వస్తాయి. టర్టిల్ (తాబేలు) నెక్ చలి గాలిని శరీరం లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటుంది. మంచి టైట్స్, లెగ్గింగ్స్ కాంబినేషన్లో వేసుకుంటే… స్టైలిష్‌గా ఉంటుంది.
మాక్సీ డ్రెస్‌లు
శీతాకాలంలో మాక్సీ డ్రెస్‌లు వేసుకున్నా మంచిదే. ఇవి కూడా వెచ్చదనాన్ని ఇస్తాయి. ఇవి కాటన్, వెల్వెట్ లేదా ఊలుతో తయారవుతాయి. మందంగా కూడా ఉంటాయి. ఇవి పూర్తిగా శరీరాన్ని కవర్ చేస్తాయి. కోట్లు, కార్డిగాన్లు, బ్లేజర్ కాంబినేషన్లో వీటిని ధరించవచ్చు. మాక్సీ డ్రెస్‌లను ఆంకిల్-లెంగ్త్ బూట్స్ లేదా స్కార్ఫ్‌లతో ధరించవచ్చు.
స్వెటర్ డ్రెస్‌లు
స్వెట్టర్స్ అంటే మనం ఊలుతోనే చేస్తారని అనుకుంటాం. కానీ, మందపాటి ఫ్యాబ్రిక్స్‌తో చేసినవి కూడా ఉంటాయి. ఊలుతోపాటు కాశ్మిర్, అక్వ్రిలిక్ ఫైబర్లలో కూడా ఇవి లభిస్తాయి. ఈ డ్రెస్‌లు చాలా వెచ్చదనాన్ని అందిస్తాయి. ఇవి ఓవర్‌సైజ్ లేదా ఫార్మ్-ఫిట్టింగ్ స్టైల్స్‌లో కూడా లభిస్తాయి. వీటిని స్కార్ఫ్‌లు, జాకెట్ల కాంబినేషన్లో ధరించవచ్చు.
ఉలెన్ దుస్తులు
ఉలెన్ దుస్తులు.. అదేనండి ఊలు దుస్తులు శీతాకాలంలో తరచుగా ధరించే దుస్తులు. మీ ప్రాంతంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటే వీటిని వేసుకోండి. ఊలుతో చేసిన డ్రెస్‌లు, స్వెట్టర్లు, ఎ-లైన్ లేదా బాడీకాన్ స్టైల్స్ డ్రెస్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి స్టైలిష్‌గా ఉండటమే కాకుండా మీ శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి. అమ్మాయిలైతే వీటికి అదనంగా అదనంగా, టైట్స్ లేదా లెగ్గింగ్స్‌తో వేసుకుని వేడి మరింత పెంచుకోవచ్చు.
ఫ్లీస్ లైన్డ్ డ్రెస్‌లు
క్యాజువల్ డ్రెస్‌లను ఇష్టపడేవారికి ఈ ప్లీస్ లైన్డ్ దుస్తులు బాగుంటాయి. వీటిలో కూడా మందపాటి క్లాతింగ్ మొడల్స్ ఉంటాయి. వీటిని స్కార్ఫ్‌లు, శాల్స్ కాంబినేషన్లో ధరించవచ్చు
హుడీలు..
అలాగే.. మీకు మరింత వెచ్చదనం కావాలంటే వింటర్ ఇన్నర్స్ కూడా ఉంటాయి. వాటిని లోపల ధరించి క్యాజువల్ దుస్తులు పైన వేసుకోవచ్చు. దాని వల్ల లోపల శరీరం వెచ్చగా ఉంటుంది. బయట కూల్ వెదర్లో మీరు కూడా చాలా సింపుల్‌గా క్యాజువల్‌గా కూల్‌గా కనిపిస్తారు. అయితే, ఒక్క విషయం గుర్తుంచుకోండి. మీరు ఎలాంటి డ్రెస్ వేసుకున్నా.. మీ చెవులు కవర్, కాళ్లు, అరచేతులు కవర్ కావాలి. వీలైతే.. హుడీ టైపు షర్టులు లేదా టీస్ ట్రై చెయ్యండి. సేఫ్‌గా ఉండండి.