ఇప్పుడిప్పుడే కెరీర్‌లో సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న యువ నటి ప్రగ్యా నగ్రాకు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. సోషల్ మీడియా రాక్షసులకు చిక్కి విలవిల్లాడుతోంది. గత కొన్ని రోజులుగా ప్రగ్యా, ఆమె బాయ్ ఫ్రెండ్‌తో ఏకాంతంగా గడిపిన వీడియోలు ఇవేనంటూ సోషల్ మీడియాలో అశ్లీల దృశ్యాలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిని చాలామంది షేర్ చేసుకుంటున్నారు కూడా. ఈ నేపథ్యంలో ప్రగ్యా ఆ వీడియోలపై స్పందించక తప్పలేదు. అవన్నీ ఫేక్ వీడియోలన్నీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో తన ఫేస్‌ను మార్ఫింగ్ చేశారని ఆమె పేర్కొంది.
ఆ వీడియోల వెనుక ఎవరున్నారు?
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోల వెనుక గుర్తుతెలియని వ్యక్తుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ట్విట్టర్ (ప్రస్తుతం X) వంటి సోషల్ మీడియాల్లో తమ ఫాలోవర్లను పెంచుకోడానికి ఆమె ఫొటోలను, మార్ఫింగ్ వీడియోలను ఎరగా చేసుకున్నారు. ప్రగ్యా ప్రైవేట్ వీడియోల లింక్ తమ దగ్గర ఉందని.. అది కావాలంటే తమ అకౌంట్‌ను ఫాలో అవ్వడమే కాకుండా ట్వీట్‌ను రిట్వీట్ చెయ్యాలని మెసేజ్‌లు పెడుతున్నారు. కొందరైతే ఏకంగా టెలిగ్రామ్‌లో వీడియోలున్నాయంటూ అమ్మకానికి పెడుతున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే సైబర్ నేరగాలే ఈ పనికి పాల్పడి ఉండవచ్చని తెలుస్తోంది. పైగా ఆ వీడియోల్లో ఉన్నది ప్రగ్యానే కాదని చెబుతున్నారు. ఆమె ఫొటోలను మిస్ యూజ్ చేసి ఇలాంటి దారుణానికి పాల్పడ్డారని అంటున్నారు. ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ ఎదురుకాకూడదని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఇలాంటి విషయాలను సీరియస్‌గా తీసుకోవాలని చెబుతున్నారు.
ఎవరు ఈ ప్రగ్యా నగ్రా?
ప్రగ్యా నగ్రా.. హర్యానాలోని అంబాలాలో పంజాబీ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. ఆమె చదువంతా ఢిల్లీలోనే సాగింది. తండ్రికి చెన్నై ట్రాన్సఫర్ కావడంతో తమిళనాడులోనే సెటిలయ్యారు. మొదట్లో ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్న ప్రగ్యా.. ఇంజినీరింగ్ డిగ్రీ చేసింది. అదే టైమ్‌లో మోడలింగ్ కూడా చేసింది. అప్పుడే ఆమె సినిమా ప్రయత్నాలు చేసింది.
2022లో జీవా నటించిన ‘వరలారు ముక్కియం’ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ఆ మూవీలో మలయాళీ కుట్టిగా ఆకట్టుకుంది. హీరోయిన్ చెల్లిగా కనిపించింది. అయితే, ఆ మూవీలో ఆమె హీరోయిన్‌నే డామినేట్ చేసింది. మూవీ స్టోరీ కూడా ఆమె చుట్టూనే తిరుగుతుంది. తన నవ్వు, అందంతో కుర్రాళ్ల మనసు దోచేసింది. అప్పటి నుంచి ఆమెకు ఎక్కడా లేని క్రేజ్ మొదలైంది. తాజా ఆమె తెలుగులో ‘లగ్గం’ మూవీలో నటించింది.
తాజాగా ఘటనపై స్పందించిన ప్రగ్యా.. అది ఒక బ్యాడ్ డ్రీమ్ అని పేర్కొంది. సాంకేతిక ఎలా దుర్వినియోగం అవుతుందో ప్రతి ఒక్కరూ తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలని ప్రగ్యా తెలిపింది. ప్రగ్యా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. హాట్ హాట్ ఫొటోలు, వీడియోలతో కుర్రాళ్లలో మంచి పాపులారిటీ సంపాదించుకుంటోంది. ఆమెకు సినిమా అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. అయితే, ఆచీతూచి ఎంచుకుంటుంది. ఇలాంటి టైమ్‌లో ఆమెపై ఇలాంటి వార్తలు రావడంతో ప్రగ్యా తీవ్రంగా అప్‌సెట్ అయినట్లు తెలుస్తోంది.