Manchu Mohanbabu: డ్రిల్లు మాస్టారుగా కెరీర్ ప్రారంభించి సినీ రంగంలో లెడెండ్‌కు పోటీగా మహావృక్షంగా ఎదిగిన మంచు మోహన్ బాబుకు సంతానం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. ఆయన అత్యంత క్రమశిక్షణతో పిల్లల్ని పెంచినా వారెవరూ దారికి రాలేదు. ఐఏఎస్ అవ్వాలనుకున్న విష్ణు మధ్యలో సినిమాల్లోకి వచ్చి సంపద అంతా కరిగించేస్తున్నారు. మంచు మనోజ్ ఇప్పుడు అనేక ఆస్తి వివాదాలకు కారణం అవుతున్నారు. మంచు లక్ష్మి ఏం చేస్తున్నారో చూసి అందరూ మోహన్ బాబు వైపు జాలిగా చూస్తున్నారు. టాలీవుడ్‌లో దిగ్గజంగా ఎదిగిన మోహన్ బాబు పరిస్థితి చూసి అందరూ ఆయన ఏం పాపం చేశారని జాలి పడుతున్నారు.
అహంకారంతో మొత్తం తుడిచి పెట్టేస్తున్న విష్ణు
ఆకాశం నుంచి దిగొచ్చాననుకునే మనస్థతంతో ఉండే మంచు విష్ణు మొత్తంగా ఆస్తిని కరిగించేస్తున్నారన్న ఆగ్రహం తోబుట్టువులలో ఉంది. ఆయన సినిమాలు, ఆయన నిర్మించిన సినిమాల నుంచి ఒక్క రూపాయి కూడా లాభం వచ్చిందే లేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతాయి. సినీ రంగానికి పరిచయం అవడంతోనే రూ. 30 కోట్ల నష్టంతో ప్రారంభించారు. ఇప్పటికీ అదే కొనసాగుతోంది. తాజాగా మరో అరవై కోట్ల వరకూ పెట్టి కన్నప్ప తీస్తున్నారు. ఆ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత.. మంచు విష్ణులాగే అందరూ శివయ్యా… అని అరవాల్సి వస్తోంది. ఆయన గర్వం, అహంకారంతో మొత్తానికే రోడ్డున పడేశాలా ఉన్నాడని మోహన్ బాబు ఫ్యాన్స్ గుబులుపడుతున్నారు.
తండ్రితోనే కొట్లాటకు దిగుతున్న మనోజ్
మంచు మనోజ్ విషయంలో మోహన్ బాబు తప్పు చేశారో.. మంచు మనోజ్ దారి తప్పారో ఎవరికీ తెలియనట్లుగా పరిస్థితులు ఉన్నాయి. సినిమాల పరంగా విష్ణు కన్నా మనోజ్ మంచి తెలివితో ఉంటారని ఆయన చేసిన సినిమాలను చూస్తే అర్థమవుతుంది. అయితే ఆయన కెరీర్ నిలబెట్టేందుకు మోహన్ బాబు చేసిన ప్రయత్నాలేం లేవు. వ్యక్తిగత జీవితంలోనూ మనోజ్ కు ఇష్టమైన వారితో కాకుండా పెద్దరికం చూపించి తాను చూపించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని పెళ్లి చేసి ఆయన జీవితం రోడ్డున పడేలా చేశారు. తర్వాత తనకు నచ్చిన అమ్మాయిని చేసుకున్నారు. ఇప్పుడు ఆస్తుల కోసం ఆయన చేస్తున్న రచ్చతో మోహన్ బాబు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి.
మోహన్ బాబుపై జాలి చూపించేలా చేస్తున్న మంచు లక్ష్మి
ఇక మంచు లక్ష్మి ఇప్పుడు ఏం చేస్తున్నారో.. సోషల్ మీడియాలో ఆమె పెడుతున్న ఫోటో షూట్లను చూసి పాపం మోహన్ బాబు అనుకుంటున్నారు ఫ్యాన్స్. ఈ వయసులో ఆమె అవకాశాల కోసం ప్రయత్నించే యువ హీరోయిన్ల మాదిరిగా గ్లామరస్ ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తున్నారు. హీరోయిన్ చాన్సుల కోసం చేస్తున్నారా లేకపోతే మరో కారణంతో ఇవన్నీ చేస్తున్నారా ఎవరికీ అర్థం కాదు. కానీ ఆమె విన్యాసాలు చూసి మోహన్ బాబు ఏం పాపం చేశారని ఆయన ఫ్యాన్స్ అనుకునేలా చేస్తున్నారు. ఇంత బతుకు బతికిన మోహన్ బాబుకు సంతానం నుంచి ఇలాంటి సమస్యలు రావడం మాత్రం ఆయన ఫ్యాన్స్ ను కలచి వేస్తోంది.
పిల్లలు సరిగ్గా లేకపోతే కుటుంబం నాశనమే
మంచు మోహన్ బాబు అతి క్రమశిక్షణతో పిల్లల్ని పెంచేరేమో కానీ తమకు స్వేచ్చ వచ్చే సరికి వారికి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం ప్రారంభించారు. ఫలితంగా రిటైరయ్యే దశలో ఆయనకు మానసిక వేదన తప్పడం లేదు