2024 టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే!

Image Credit: Pixabay

2024 Year End: 2024 లో అయిపోతోంది..2025లో అడుగుపెడుతున్నాం.

కొత్త ఏడాదిలోకి ఎవరెవరు ఉత్సాహంగా అడుగుపెడుతున్నారు?

వారి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యేలా 2024 లో ఏ సాధించారు?

2024లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమాలేంటి?

భారీ బడ్జెట్ సినిమాలు, మీడియం మూవీస్, చిన్న సినిమాలు..మొత్తంగా 2024లో దాదాపు 240 సినిమాలొచ్చాయ్. ఈ ఏడాది చివరికి మరో 9 సినిమాలు రాబోతున్నాయ్..అంటే 2024లో మొత్తం రిలీజైన సినిమాలు 250 అవుతాయ్. నంబర్ కౌంట్ బాగానే ఉంది కానీ ఇందులో ఆడియన్స్ ని మెప్పించిన సినిమాలు చాలా తక్కువ అనే చెప్పాలి.మరి వీటిలో అత్యధిక వసూళ్లు సాధించిన టాలీవుడ్ మూవీస్ లిస్ట్ ఇక్కడుంది..

పుష్ప ది రూల్

అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప 2 బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల జాతర క్రియేట్ చేసింది. మూడు రోజుల్లో 621 కోట్లు వసూలు చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. అత్యంత వేగంగా వెయ్యికోట్లు కలెక్ట్ చేసిన మూవీగా పుష్ప 2 నిలవబోతోంది. దీంతో పాటూ.. ఈ ఏడాది హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన కల్కి రికార్డును బ్రేక్ చేసే అవకాశాలున్నాయ్.

కల్కి 2898AD

ప్రభాస్- నాగ్ అశ్వన్ కాంబినేష్లో వచ్చిన కల్కి 2898 AD ఇయర్ మధ్యలో రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1200 కోట్లు వసూలు చేసి అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా టాప్ లో నిలిచింది.

దేవర

దేవర పై డివైడ్ టాక్ వచ్చింది కానీ కలెక్షన్లు మాత్రం కుమ్మేశాయ్. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన..దేవర పార్ట్ 1 500 కోట్ల క్లబ్ లో చేరినట్టు మేకర్స్ ప్రకటించారు. ఆ వసూళ్లు కేవలం తారక్ పవర్ తోనే సాధ్యమయ్యాయ్.

హనుమాన్

చిన్న సినిమాగా వచ్చి ఘన విజయం అందుకుంది హనుమాన్. సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ ఎవ్వరూ ఊహించనంత స్థాయిలో సక్సెస్ అయింది. కేవలం 40 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా.. ప్రపంచ వ్యాప్తంగా 301 నుంచి 350 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది.

గుంటూరు కారం

సంక్రాంతి బరిలో భారీ అంచనాల మధ్య దిగిన గుంటూరుకారం టాక్ బాలేకపోయినా డబ్బులు బాగానే వచ్చాయ్. మొదటి పది రోజుల్లోనే 231 కోట్ల గ్రాస్ వచ్చినట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

టిల్లు స్కేర్

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ఇది డీజే టిల్లు కి సీక్వెల్ గా వచ్చింది’టిల్లు స్క్వేర్’. ఈ రొమాంటిక్ క్రైమ్ కామెడీ బాక్సాఫీస్ దగ్గర 135 కోట్లు వసూలు చేసింది.

లక్కీ భాస్కర్

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్ ప్లే చేసిన ‘లక్కీ భాస్కర్’ కూడా కమర్షియల్ గా సక్సెస్ అయింది. 100 కోట్ల మార్క్ క్రాస్ చేసింది

సరిపోదా శనివారం

నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం కూడా వందకోట్ల క్లబ్ లో చేరింది

ఇంకా కిరణ్ అబ్బవరం స్వీయ నిర్మాణంలో రూపొందించిన క 53 కోట్లు, నాగార్జున నా సామిరంగా 50 కోట్లు, వసూలు చేశాయ్. వీటితో పాటూ ఇక శ్రీ సింహా ‘మత్తు వదలరా 2’, విశ్వక్ సేన్ ‘గామి’, సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’, శ్రీ విష్ణు ‘ఓం భీమ్ బుష్’ మూవీస్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుకున్నాయ్. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, ‘కమిటీ కుర్రాళ్ళు’, ‘ఆయ్’, ‘అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్’, ‘జీబ్రా’ హిట్ టాక్ సొంతం చేసుకున్నాయ్.

తరవాత కథనం