ఇలా చేస్తే మీరే “లక్కీ భాస్కర్‌”- ఎంత అప్పుల్లో ఉన్న బయటపడొచ్చు

Lucky Bhaskar Life Lessons

Lucky Bhaskar: లక్కీ భాస్కర్ ఈ మధ్య కాలంలో ప్రజలకు బాగా కనెక్ట్ అయిన సినిమా. అందులో కొన్ని సన్నివేశాలు ఓవర్‌ ద లైఫ్ ఉన్నప్పటికీ ప్రేక్షకులను మాత్రం కట్టిపడేశాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరు తమను ఆ సినిమాలో చూసుకున్నారు. జీవితంలో సెటిల్ అయిన వాళ్లు పడిన కష్టనష్టాలు, చీత్కారాలు, చీవాట్లు, విమర్శలు ఇలా అన్నీ వారి మైండ్‌లో ఒక్కసారిగా తెరపై కనిపించి ఉంటాయి. తామే అందులో నటించామా అన్న భావనలో ఉన్నవాళ్లు లేకపోలేదు.

లక్కీ భాస్కర్ చెప్పిన విషయం అర్థమైందా?

ఆర్థిక కష్టాల్లో ఉన్న వాళ్లకు కూడా ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. తాము వృద్ధిలోకి రావడానికి కూడా ఏదో దారి దొరుకుతుంది ప్రయత్నిస్తే అన్న భావన కలుగుతుంది. అందుకే అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది ఈ సినిమా. సినిమా చూసి మర్చిపోవడం కాదు అందులో చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోవాలి.

స్టాక్ మార్కెట్‌ మంచి ఆర్థిక వనరు

లక్కీ భాస్కర్ సినిమాను జాగ్రత్తగా గమనిస్తే మాత్రం మన ఆర్థిక పరిస్థితిని మనం మార్చుకోవచ్చు. బ్యాంకు నుంచి భాస్కర్‌ డబ్బులు తీసుకొని పెట్టుబడిగా పెట్టుకున్నట్టు నీవు కూడా నీ జీతాన్ని బ్యాంకు సొమ్ము కంటే జాగ్రత్తగా ఖర్చుపెట్టాలి. నీ కష్టార్జితం అని చెప్పి విచ్చలవిడిగా ఖర్చు పెడితే మాత్రం బికారి అవుతారు. అతను కొంత సొమ్ము వరకే రిస్క్ చేస్తాడు. కానీ దాన్ని ఏదోలా చేసి సర్ధుకుంటాననే నమ్మకంతో ఆ పని చేస్తాడు. మీరు కూడా మీ శాలరీలో నుంచి కొంత కచ్చితంగా పెట్టుబడిగా పెట్టాలి. రిస్క్‌ పెట్టుబడులు పెట్టొద్దు.

జాగ్రత్తగా లేకుంటే ప్రమాదం 

ఈ మధ్య కాలంలో మార్కెట్‌లో పెట్టే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఇది మంచిదే. కానీ విషయం తెలియకుండా దిగితే మాత్రం కచ్చితంగా దెబ్బతింటారు. ఎక్కడ పెట్టుబడి పెట్టిన కనీసం ఒక ఏడాది టైం ఇవ్వాలి. ఇవాళ పెట్టుబడి పెట్టి రేపు రావాలంటే మాత్రం సాధ్యం కాదు. అయితే మార్కెట్‌లో షేర్లపై పెట్టుబడి పెట్టే వాళ్ల లాంగ్‌టెర్మ్‌ దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయాలి.

ఐపీవోల జాక్‌పాట్

షార్ట్ టెర్మ్‌లో మంచి లాభాలు రావాలంటే మీరు ఐపీవోలు ట్రై చేయవచ్చు. ఇది కూడా నిపుణుల అభిప్రాయాలను తీసుకొని మీరు జాగ్రత్తగా పరిశీలించి పెట్టాల్సి ఉంటుంది. ఇందులో కూడా రిస్క్ ఉంటుంది. భారీగా నష్టాలు కూడా రావచ్చు. అందుకే పెట్టుబడి మరీ భారీగా ఉండకుండా చూసుకోవాలి. మీరు భరించే శక్తి ఉన్నంత వరకు మాత్రమే పెట్టాలి. మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసే వాళ్లు అప్పులు చేసి అసలు పెట్టొద్దు. మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే వాళ్లకు తక్షణం భారీగా లాభాలు రాకపోవచ్చు కానీ ఓపిక పడితే లాంగ్‌ రన్‌లో మీ ఆర్థిక కష్టాలు తీరుతాయి.

సంపాదనకు ప్రత్యామ్నాయం
మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా… వ్యాపారం చేస్తూన్నా ప్లాన్ బీ కచ్చితంగా ఉండాలి. లక్కీ భాస్కర్‌లో చూపించిన పచ్చళ్ల బిజినెస్ అలాంటిదే. అది స్కామ్‌ కోసం వాడుకున్నప్పటికీ మీరు మాత్రం మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు ఉపయోగపడుతుంది. చిన్నదైనా పెద్దదైనా కచ్చితంగా ప్రత్నామ్నాయ మార్గం ఒకటి ఉంచుకోవడం చాలా ఉత్తమం. లేకుంటే లక్కీ భాస్కర్ మాదిరి బంధువులకు డబ్బులు అడిగి పరువు పోగొట్టుకున్న వాళ్లు అవుతారు.

హెల్త్‌ ఇన్సూరెన్స్ పాలసీ మీ ఖర్చును తగ్గిస్తుంది

లక్కీ భాస్కర్ సినిమాలో సీబీఐ పేరుతో ఎంక్వయిరీకి వస్తారు. అది మీ లైఫ్‌లో అరోగ్య సమస్యల్లాంటివి. అందుకే దీన్ని తట్టుకునేందుకు మంచి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం మంచిది. నెలకు వెయ్యిరూపాయలే కావచ్చు కానీ మంచి కంపెనీ పాలసీ తీసుకోవాలి. ఎలాంటి ఉన్నత స్థితిమంతులైనా అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారంటే చాలు సగం సంపాదన అర్పించుకోవాల్సి ఉంటుంది.

మంచి ఇన్సూరెన్స్‌ ఎంచుకోండి

మీరు సంపాదన ప్రారంభించినప్పటి నుంచే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మరీ మంచిది. దీని వల్ల ప్రీమియం తగ్గుతుంది. ఎన్ని ఏళ్లకైనా అదే ప్రీమియం ఉంటుంది. అంతే కాకుండా సీనియార్టీ పెరిగే కొద్ది కొన్ని కంపెనీలు వ్యాధులను ఇన్సూరెన్స్‌లో ఇన్‌క్లూడ్ చేస్తాయి. ఆపదలు చెప్పి రావు కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకోవడం మర్చిపోవద్దు. మీరు కట్టేది నెలకు వెయ్యిరూపాయలే అయినా ఏదైనా అనారోగ్య సమస్య వస్తే మీ ఆదాయంలో 60శాతం ఖర్చును మిగులుస్తుంది.

టర్మ్‌ పాలసీ ఉండాల్సిందే

లక్కీ భాస్కర్ సినిమాలో తన ఫ్యామిలీ అందరికీ డబ్బులు ఇచ్చి సెటిల్ చేస్తాడు. మీ జీవితంలో కూడా మీరు ఉన్నప్పుడే ఉద్యోగం చేస్తున్నప్పుడే ఈ పని చేయవచ్చు. మీరు చనిపోయిన తర్వాత ఎవరికి ఎంత ఇవ్వాలి… అనేది ముందుగానే సెటిల్ చేయవచ్చు. అదే టర్మ్‌ పాలసీ.

ఒక కుటుంబంలో సంపాదించే వ్యక్తి దూరమైతే ఎదుర్కొనే ఆర్థిక కష్టాలు మామూలుగా ఉండవు. అందుకే అలాంటి సమస్య మీ ఫ్యామిలీకి రాకుండా ఉండాలంటే కచ్చితంగా టర్మ్‌ పాలసీ తీసుకోండి. అందులో మీ కుటుంబంలో ఎవరికి ఎంత వాటా ఉండాలో క్లియర్‌గా రాసి పెట్టుకోవచ్చు. మీ సంపాదన స్థాయిని బట్టి యాభై లక్షల నుంచి కోట్ల విలువైన టర్మ్‌ పాలసీ చేయవచ్చు.

అప్పుల నుంచి బయటపడటం ఎలా
లక్షల్లో సంపాదించిన చాలా మంది అప్పుల కూరుకుపోతుంటారు. వీళ్లకు సంపాదనపైకానీ, పెట్టే ఖర్చుపై సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణం. మీకు లక్కీ భాస్కర్ సినిమాలో తండ్రి వార్నింగ్ ఇస్తాడు. చేస్తున్నది మంచిది కాదని అంటాడు. దీంతో భాస్కర్‌లో రియలైజేషన్ వస్తుంది. అప్పటి నుంచి భాస్కర్‌ తన పంథా మార్చుకుంటాడు. ఇక్కడ కూడా మీరు కూడా అలాంటి పొజిషన్‌లో ఉన్నట్టు లెక్క.

ఇక్కడ అప్పుల్లో కూరుకుపోయిన మీరు కూడా ఓ పుస్తకాన్ని పెట్టుకోండి. ఉదయం మీరు లేచి బ్రష్ చేసినప్పటి నుంచి రాత్రి పడుకునే ముందు చూసే ఓటీటీ వరకు అన్ని ఖర్చులను కూడా రాసుకోండి. అదే మీ అప్పులు తీర్చే మార్గాన్ని చెబుతుంది.

ఓ నెల రోజుల పాటు ఖర్చును రాసి పెట్టుకోండి. ఒకసారి రాసిన తర్వాత మళ్లీ చూడకుండా రాసుకంటూ వెళ్లండి. నెల రోజుల తర్వాత మొదటి పేజ్‌ నుంచి ఒక్కొక్క పేజ్‌ను జాగ్రత్తగా గమనించండి. మీకే అర్థమవుతుంది. ఎక్కడ ఎంత వృథా అవుతుందో.

అదే మీకు గైడ్‌

అందులో అనవసరమైన ఖర్చును ఎలా తగ్గించుకోవచ్చో ఆలోచించండి. మీరు సంపాదించేది ఎంత తక్కువ అయినా అందులో 30 శాతం మీ హెల్త్‌కి, పొదుపులకు కేటాయించండి. ఖర్చు పెట్టిన తర్వాత సేవ్ చేస్తామంటే ఈ జన్మకే కాదు ఎన్ని జన్మలు ఎత్తినా సేవింగ్స్ చేయలేరు. ఎంత కష్టంగా ఉన్నప్పటికీ సేవింగ్స్ మాత్రం మర్చిపోవద్దు.

30 రోజుల పాటు మీరు ఖర్చుల పద్దు రాసుకుంటే మాత్రం కచ్చితంగా మీలో మీకే ఓ ఆలోచన వస్తుంది. ఈ ఏరియాలో అనవసరంగా ఖర్చు పెడుతున్నామనే భావన కలుగుతుంది. దాన్ని తగ్గించుకొని వాటిని అప్పులు తీర్చేందుకు ట్రై చేయండి. ఆరు నెలల్లో మీకు తెలియకుండానే చాలా మార్పును గమనిస్తారు.

కసిని పెంచుకోండి

లక్కీ భాస్కర్‌ సినిమాలో ప్రమోషన్ సీన్, మార్కెట్‌లో అప్పులోడు బట్టలు చించే సీన్, పిల్లాడి వద్ద అత్త కేక్‌ గురించి చెప్పే డైలాగ్‌, నగల దుకాణంలో వ్యాపారి ప్రవర్తన, పావ్‌బాజీ తిన్న సీన్ ఇలాంటివి మీ జీవితంలో ఎన్నో చూసి ఉంటారు. వాటిని ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోండి. మీలో కసి కలిగేలా ఉండాలి. ఫలితంగా మీరు రైట్‌ డైరెక్షన్‌లో వెళ్లేలా చేస్తాయి.

తరవాత కథనం