Allu Arjun Arrest: పుష్పరాజ్‌ను టచ్ చేసిన రేవంత్ సర్కారు- జైలుకు వెళ్లిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

allu arjun arrest

Hyderabad News: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. పుష్ప 2 బెనిఫిట్‌షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందారు. ఈ దుర్ఘటనకు అల్లు అర్జున్ కారణమంటూ కేసులు నమోదు అయ్యాయి. బీఎన్‌ఎస్ఎస్‌ 118, 105 సెక్షన్‌ల ప్రకారం అల్లు అర్జున్‌ను హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు.

మార్నింగ్ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన పోలీసులు అరెస్టు విషయం చెప్పారు. తనకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా అరెస్టు ఏంటని ఐకాన్ స్టార్ వారిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ప్రొసీజర్ ప్రకారం తాను వస్తానంటూ చెప్పినా కొంచెం కూడా సమయం ఇవ్వలేదని టాక్. కనీసం బట్టలు మార్చుకునేంత సమయం కూడా ఇవ్వలేదని ప్రచారం జరుగుతోంది.

పోలీసుల రావడంతో ఇంట్లో వాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అల్లు అర్జున్ మాత్రం తన మొహంలో చిరునవ్వు పోనివ్వకుండా అందరికీ ధైర్యం చెప్పి పోలీసు జీపు ఎక్కారు. ముఖ్యంగా భార్య స్నేహా రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడారు. తలపై చేయి వేసి ముద్దుపెట్టి ధైర్యంగా ఉండాలంటూ చెప్పి పోలీసులతో వచ్చేశారు.

అల్లు అర్జున్‌తో పోలీస్ జీపులోనే స్టేషన్‌కు వచ్చేందుకు తండ్రి అల్లు అరవింద్ ప్రయత్నిస్తే వద్దని చెప్పాడు అల్లు అర్జున్. తాను ఒక్కడే పోలీస్ జీపులో చిక్కడపల్లి స్టేషన్‌కు వచ్చారు. అక్కడ విచారణ చేసిన పోలీసులు అనంతరం వైద్య పరీక్ష కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత నాంపల్లి కోర్టులో హజరుపరిచారు.

కేసు పూర్వాపరాలు తెలుసుకున్న నాంపల్లి కోర్టు న్యాయమూర్తి అల్లు అర్జున్‌కు పద్నాలు రోజుల రిమాండ్ విధించారు. అనంతరం ఆయన్ని చంచల్‌గూడ జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. అదేే టైంలో ఈ కేసును క్వాష్ చేయాలంటూ అల్లు అర్జున్ పెట్టుకున్న పిటిషన్‌లను కూడా హైకోర్టు కొట్టేసింది. దీంతో కనీసం బెయిల్ అయినా ఇవ్వాలని కోర్టును అల్లు అర్జన్ తరపున న్యాయవాది కోరారు.

ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ప్రొసీడింగ్స్ పూర్తి చేస్తున్న ఆయన టీం కాసేపట్లో ఆయనను బయటకు తీసుకురానున్నారు.

డిసెంబర్‌ 4వ తేదీన రాత్రి పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన భాస్కర్  ప్యామిలీ ఇరుక్కుంది. భాస్కర్ భార్య చనిపోగా కుమారుడు కోమాలో చికిత్స పొందుతున్నాడు. ఇది రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై భాస్కర్‌తోపాటు పలువురు స్వచ్ఛంద సంస్థలు కేసులు పెట్టాయి. కేసు నమోదు చేసిన పోలీసులు ఏ 1గా సంధ్య థియేటర్‌ యాజమాన్యాన్ని చేస్తే… A11గా అల్లు అర్జున్‌ పేరు ఉంచారు.

చాలా మంది హీరోలు సినిమా థియేటర్‌కు ప్రీమియర్ షోలు చూసేందుకు వెళ్తారని అలానే తాను వెళ్లానంటూ.. ఈ కేసులు కొట్టేయాలని అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా బాధిత కుటుంబానికి 25 లక్షల సాయం ప్రకటించారు. కేసు పూర్తిగా సద్దుమణిగిందని అనుకుంటున్న టైంలో ఒక్కసారిగా అల్లు అర్జున్ అరెస్టు కావడంతో దేశం దృష్టిని ఆకర్షించింది.

తరవాత కథనం