Allu Arjun Effect On AP Govt: హైదరాబాద్‌లో అల్లు అర్జున్ అరెస్టు- తలపట్టుకున్న ఏపీ సర్కారు- చంద్రబాబు, పవన్ షాకింగ్ రియాక్షన్

chandra Babu

Allu Arjun Arrest : అల్లు అర్జున్ అరెస్టు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతా చర్చనీయాంశమైంది. జాతీయ స్థాయిలోనే దీనికి మించిన బ్రేకింగ్ న్యూస్ లేకుండా పోయింది. మెయిన్ మీడియా సోషల్ మీడియా ఎక్కడ చూసిన ఇదే డిస్కషన్. అల్లు అర్జున్ అరెస్టు అంతటి ఇంపాక్ట్ చూపించింది. చివరకు ఓ జాతీయ ఛానల్‌ సదస్సుకు వెళ్లిన రేవంత్ రెడ్డిని కూడా ఇదే అంశంపై ప్రశ్నలు సంధించారు మీడియా ప్రతినిధులు.

అల్లు అర్జున్ అరెస్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చి దిద్దిన స్వర్ణాంధ్ర విజన్‌ 2047 డాక్యుమెంట్‌ను తీసుకొచ్చింది. విజయవాడలో గ్రాండ్‌గా ఏర్పాటు చేసిన వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి ఈ డాక్యుమెంట్‌ విడుదల చేశారు. సరిగా ఆ డాక్యుమెంట్ విడుదల అవుతున్న టైంలోనే అల్లు అర్జున్ అరెస్టు విషయం బయటకు వచ్చింది.

విజన్ డాక్యుమెంట్‌ను పట్టించుకోని మీడియా 

అల్లు అర్జున్ అరెస్టు విషయం తెలుసుకున్న లోక్ మీడియా నుంచి జాతీయ మీడియా వరకు అంతా అటువైపు టర్న్ అయ్యారు. టీడీపీ ఛానల్స్‌గా పేరున్న మీడియా కూడా అల్లు అర్జున్ అరెస్టు వైపే పరుగులు తీశారు. దీంతో ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన డాక్యుమెంట్‌కు ప్రచారం కొరవడింది. దేశవ్యాప్తంగా అప్లాజ్ వస్తుందని అనుకున్న ప్రోగ్రామ్‌కు ఇలా అల్లు అర్జున్ అరెస్టుతో అడ్డుకట్టపడింది. చివరకు సోషల్ మీడియాలో కూడా దీనిపై ఎలాంటి చర్చ లేకపోవడంతో షాక్ అయ్యారు.

వేదికపైనే చంద్రబాబు, పవన్‌కు అల్లు అర్జున్ అరెస్టు గురించి సమాచారం

దీంతో టీడీపీ, జనసేన పార్టీ నేతలు తలలు పట్టుకున్నారు. ఈ అంశం కచ్చితంగా డిబేటబుల్ సబ్జెక్ట్ అవుతుందని అనుకుంటే ఇలా అయిందేంటని నిట్టూరుస్తున్నారు. ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడే సహాయక సిబ్బంది వచ్చి అల్లు అర్జున్ అరెస్టు అయిన విషయాన్ని చంద్రబాబు చేరవేశారు. పక్కనే ఉన్న పవన్ కల్యాణ్‌కు సమాచారం ఇచ్చారు చంద్రబాబు. అది విన్న పవన్ కల్యాణ్ కూడా షాక్ అయ్యారు. అవునా అంటూ రెండోసారి అడిగారు.

‌అల్లు అర్జున్ అరెస్టు విషయం తెలిసి షాక్ అయిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

వెల్దీ, హెల్దీ, హ్యాపీ ఏపీ సాకారమే లక్ష్యంగా ఈ ‘స్వర్ణాంధ్ర @ 2047’ విజన్‌ డాక్యుమెంట్‌ చంద్రబాబు విడుదల చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతోపాటు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రులు కూడా పాల్గొన్నారు. ‘పది సూత్రాలు.. ఒక విజన్‌’ పేరిట డాక్యుమెంట్‌ను జాతికి రాష్ట్ర ప్రజలకు అంకితం అని రాసి సంతకం చేశారు చంద్రబాబు. తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్‌ సహా ఇతర మంత్రులు సంతకాలు చేశారు.

ప్రజల్లో మార్పు తీసుకొస్తుంది: చంద్రబాబు

ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు రాష్ట్ర దశ, దిశను మార్చేదే ఈ స్వర్ణాంధ్ర విజన్ 2047 అన్నారు. ఇది కొత్త చరిత్రకు నాంది పలుకుతుందన్నారు. తెలుగుజాతి ప్రపంచంలోనే నంబర్‌ 1గా నిలవాలనే సంకల్పంతో దీన్ని రూపొందించామన్నారు. 2047 నాటికి 42 వేల డాలర్లకు తలసరి ఆదాయం పెరగాలన్నది లక్ష్యమన్నారు. 17 లక్షల మంది విజన్‌ డాక్యుమెంట్‌ కోసం ఆలోచనలు పంచుకున్నారని ఇది కచ్చితంగా ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

తరవాత కథనం