WPL 2025: నేడే ఉమెన్ ప్రీమియర్ లీగ్‌ వేల ప్రక్రియ- 120 మంది కోసం ఫ్రాంచైజీలు పోటీ

WPL 2025

WPL 2025: ఉమెన్ ప్రీమియర్ లీగ్‌ 2025 వేలం ప్రక్రియ ఇవాళ బెంగళూరులో జరగనుంది. 120 మంది ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి. మూడో సీజన్ ఆటకు ముందు ఈ వేల ప్రక్రియను ఇవాళ పూర్తి చేయనున్నారు. ఈ వేలం ప్రక్రియలో 91 మంది భారతీయలు 29 మంది విదేశీ మహిళా క్రికెటర్లు పాల్గొంటారు. ఐదు ఫ్రాంచైజీలు వేలం వేయనున్నాయి.

వేలం ఎక్కడ జరుగుతుంది?
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 కోసం వేలం ప్రక్రియ బెంగళూరులో జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమయ్యే ప్రక్రియలో మొత్తం 120 మంది క్రీడాకారులు పాల్గొంటారు కానీ ఐదు జట్లకు కేవలం 19 స్లాట్‌లు మాత్రమే ఖాళీ ఉన్నాయి. ఇందులో విదేశీ ఆటగాళ్లకు 5 స్లాట్‌లు ఉన్నాయి. అందుకే ఈ వేలంపై అందరి కళ్లు ఉన్నాయి. ఏ ప్లేయర్‌కు అదృష్టం వరిస్తుందో అన్న ఆసక్తి నెలకొంది.

మహిళల ప్రీమియర్ లీగ్ 2025 వేలం ప్రక్రియను స్పోర్ట్స్ 18 ఛానెల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. జియోసినిమాలో కూడా ఈ ప్రక్రియను చూడొచ్చు. ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 వేలంలో 14 సంవత్సరాల వయస్సు గల ఇరా జాదవ్, అన్షు నగర్‌ అత్యంత చిన్న వయసు ఉన్న ఆటగాళ్లు. లారా హారిస్, హీటన్ 34 ఏళ్లతో అత్యంత పెద్ద వయసు ఉన్న ఆటగాళ్లు. వేలంలోకి వచ్చే వారిలో 120 మంది ఆటగాళ్లలో గరిష్టంగా 82 అన్‌క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్‌లు ఉన్నారు. 22 క్యాప్డ్ విదేశీ ఆటగాళ్లను చేర్చారు. మిగిలిన 9 మంది భారత ఆటగాళ్లు, 8 మంది అన్‌క్యాప్డ్ విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.

ఎవరి పర్స్‌లో ఎంత ఉందంటే…
ఢిల్లీ క్యాపిటల్స్ పర్స్‌లో ఉన్న నిల్వ రూ. 2.5 కోట్లు
గుజరాత్ జెయింట్స్ పర్స్‌లో ఉన్న నిల్వ రూ. 4.4 కోట్లు
ముంబై ఇండియన్స్ పర్స్‌లో ఉన్న నిల్వ రూ. 2.65 కోట్లు
యూపీ వారియర్స్ పర్స్‌లో ఉన్న నిల్వ రూ. 3.9 కోట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పర్స్‌లో ఉన్న నిల్వ రూ. 3.25 కోట్లు.

తరవాత కథనం