Sania Mirza: విద్యార్థి దశ నుంచే సమానత్వ మనస్తత్వాన్ని పెంపొందించాలి- క్లీన్ ఈక్వల్ మిషన్‌ను పరిచయ కార్యక్రమంలో సానియా మీర్జా

sania mirza

భారతదేశంలో విశ్వసనీయ గృహ పరిశుభ్రత బ్రాండ్, వేపతో తయారైన ఐటీసీ నిమైల్ తన క్లీన్ ఈక్వల్ మిషన్ ద్వారా మరింత బాధ్యతాయుతమైన భవిష్యత్తు వైపు ఒక స్పృహతో ముందడుగు వేసింది. చాలా ఇళ్లలో ఇంటి పనులను, ముఖ్యంగా శుభ్రపరిచే ప్రాథమిక బాధ్యతను మహిళలు తీసుకుంటారు. ఆ పని వారే చేయాలని ఎక్కువ మంది భావిస్తూ ఉంటారు.

ఈ విషయంలో స్త్రీపురుష బేధం లేదని చెప్పి అందరికీ బాధ్యత ఉందని భావి తరాలకు అవగాహన పెంచడం ముఖ్యం. దీన్ని ప్రేరేపించడం ద్వారా శుభ్రపరచడంలో సమానత్వాన్ని పెంపొందించేందుకు అనువుగా క్లీన్ ఈక్వల్ మిషన్ తీర్చిదిద్దింది. శుభ్రపరచడాన్ని ప్రోత్సహించేందుకు, పిల్లల కోసం వినూత్నమైన విద్యా మాడ్యూల్‌ను రూపొందించింది.

ఇది సమాజంలో మార్పు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా చేపట్టింది. దీని ద్వారా నేటి తరం బాలలకు శుభ్రతపై అవగాహన కల్పించడం, పరిశుభ్రతకు సంబంధించిన ప్రాథమిక అంశాలు తెలియజేస్తారు. అంతే కాకుండా సమానత్వపు భావనతో ఎదిగేందుకు వీలు కలుగుతుంది.

పిల్లలు సాధారణంగా ఇంటిలో చేసే మొదటి పని శుభ్రపరచడం. చిన్న వయస్సు నుంచే పనులు చేయడం భవిష్యత్తులో విజయవంతమైన జీవితానికి పునాది వేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పనులు చేయడం ద్వారా వారు ఆత్మవిస్వాసాన్ని, జట్టుగా పని చేసే నైపుణ్యాలను పెంపొందించుకుంటారు. విలువలతో కూడిన దృఢమైన భావాన్ని అభివృద్ధి చేసుకోవడంలో సహాయపడుతుంది.

హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సానియా మీర్జాతో పాటు ఐటిసి లిమిటెడ్ మార్కెటింగ్, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ శ్రీనివాస్, గీతాంజలి దేవ్‌శాల ప్రిన్స్‌పల్, గీతాంజలి గ్రూపు విద్యా సంస్థల డైరెక్టర్ మాధవి చంద్ర, గ్లెన్ డొమన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన నిష్ణాతులైన విద్యావేత్త, పేరెంటింగ్ మెంటార్ కిరణ్మయి చౌదరితో కలిసి క్రియాశీలకమైన చర్చాగోష్ఠిని నిర్వహించారు. ది ఇన్‌స్టిట్యూట్స్ ఫర్ అచీవ్‌మెంట్ ఆఫ్ హ్యూమన్ పొటెన్షియల్, ఫిలడెల్ఫియా, యూఎస్ఏకు చెందిన కిరణ్మయి చౌదరి క్లీన్ ఈక్వల్‌పై ఇంటరాక్టివ్ వర్క్‌షాప్‌లో పాల్గొన్న తల్లిదండ్రులను మరింత మార్గదర్శనం చేశారు.

ఆకర్షణీయమైన, వయస్సుకు తగిన ఎడ్యుకేషన్ కంటెంట్‌తో, ఈ కార్యక్రమం సానుకూలమైన, ఆహ్లాదకరమైన బాధ్యతను స్వీకరించేలా పిల్లలను ప్రేరేపిస్తుంది. ఈ చొరవ పాఠశాలలు, తల్లిదండ్రులతో ఒక సహకార కార్యక్రమం. ఇది క్లీన్ ఈక్వల్ ఆలోచనను విశ్లేషించుకోవడంలో పిల్లలకు సహాయపడుతుంది. వారిని సమానత్వానికి విలువనిచ్చే బాధ్యతగల వ్యక్తులుగా ఎదిగేందుకు వీలు కల్పిస్తుంది.

ఈ చొరవను సానియా మీర్జా ప్రశంసిస్తూ, “ఐటిసి నిమైల్ క్లీన్ ఈక్వల్ మిషన్‌లో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నాను. ఇది కేవలం శుభ్రపరచడం కంటే భాగస్వామ్య బాధ్యత భావాన్ని పెంపొందిస్తుంది. చిన్న వయస్సు నుంచే సమానత్వ మనస్తత్వాన్ని పెంపొందించడానికి సంబంధించిన అంశం. మనలాంటి తల్లిదండ్రులు, పాఠశాలలు, పిల్లలు బాధ్యతాయుతమైన రేపటి కోసం సమిష్టిగా కలిసి పని చేసేలా ప్రోత్సహిస్తుంది. ఈ డిస్కషన్ పెట్టినందుకు ఐటీసీ నిమైల్ బృందాన్ని నేను తప్పక అభినందించాలి!’’ అని పేర్కొన్నారు.

ఐటీసీ లిమిటెడ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ బిజినెస్ డివిజనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సమీర్ సత్పతి మాట్లాడుతూ, “ఐటీసీ నిమైల్ క్లీన్ ఈక్వల్ మిషన్ చిన్న వయస్సు నుంచే సమానత్వ విలువలను పెంపొందించి సానుకూల మార్పు తీసుకువచ్చేందుకు మా అంకితభావాన్ని తెలియజేస్తుంది. ఇంటి పనులకు బాధ్యత వహించడం, యాజమాన్య బాధ్యతలు తీసుకోవడం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం అనేది సమాజంలో ఈ మార్పును ప్రేరేపించేందుకు ఒక ప్రాథమిక మార్గం. ఈ కార్యక్రమం పిల్లలు సమిష్టి కృషి, స్వాతంత్ర్యం, సాధికారతల భావాలను పెంపొందించడంలో సహాయపడుతుందు. భవిష్యత్తులో మరింత బాధ్యతాయుతమైన పెద్దలుగా మారడానికి వారిని ప్రోత్సహిస్తుందని విశ్వసిస్తున్నాము’’ అని ధీమా వ్యక్తం చేశారు.

నిమైల్ క్లీన్ ఈక్వల్ మిషన్ అనేది సరళమైన ఇంకా శక్తివంతమైన ఆలోచనతో నిర్మించారు. ఇంటి పనులు, శుభ్రపరచడం అన్ని పనులు కంటే ఎక్కువ. అవి జీవన నైపుణ్యాలను నేర్పడానికి, సొంత విలువను పెంపొందిస్తాయి. పరిశుభ్రత, శుభ్రంగా ఉండడం, సమానత్వాన్ని పెంపొందించే అవకాశాలు కల్పిస్తుంది. ఈ కార్యక్రమం పాఠశాలల ద్వారా పిల్లల జీవితాలలో ఆకర్షణీయమైన, వయస్సుకు తగిన కార్యకలాపాల ద్వారా ఏకీకృతం చేయడంలో సహాయపడుతుంది. నిమైల్ క్లీన్ ఈక్వల్ మిషన్ హైదరాబాద్‌లో దాని మొదటి దశలో 1 లక్ష కన్నా ఎక్కువ మంది విద్యార్థులకు చేరువైంది. రాబోయే కొద్ది నెలల్లో, ఈ చొరవ భారతదేశంలో 8 లక్షల కన్నా ఎక్కువ మంది విద్యార్థులకు చేరువ అవుతూ, దాని విస్తరణను మరింత పెంచుకోనుంది.

తరవాత కథనం