Andhra BJP: బీజేపీ దేశంలో అన్ని చోట్లా జెండా పాతుతోంది. చివరికి తెలంగాణలో కూడా బలమైన ఫోర్స్ గా ముందుకు వచ్చింది. కానీ ఒకే ఒక్క ఏపీలో మాత్రం ఎదగడం లేదు. అలా చెప్పడం కన్నా ఎదిగే ప్రయత్నం చేయడం లేదు.. ఆ చాన్స్ ఆ పెద్దలు ఇవ్వడం లేదు అనుకోవచ్చు. ఎందుకంటే జాతీయ రాజకీయ అవసరాల కోసం పార్టీని ఎప్పటికప్పుడు పణంగా పెడుతున్నారు కానీ బలోపేతం చేసే వారికి చాన్సులు ఇవ్వడంలేదు. దీంతో నేతలు కూడా తమకు ఎంతో సామర్థ్యం ఉన్నప్పటికీ ఎదగలేకపోతున్నారు. వారికి సరైన అవకాశాలు రావడం లేదు.
యువనేతల్ని హైకమాండ్ ఎప్పుడు వాడుకుంటుంది ?
బీజేపీలో కింది స్థాయి నుంచి వచ్చిన నేతలకు కొదవ లేదు. ఏబీవీపీ నుంచి పార్టీ కోసం పని చేస్తున్న వారు ఉన్నారు. జాతీయ స్థాయిలో వెంకయ్యనాయుడు తర్వాత సరైన తెలుగు లీడర్ దక్షిణాది నుంచి లేరు. ఏపీ నుంచి ఎంతో మంది ఎదగడానికి అవకాశం ఉన్నా.. ఉమ్మడి రాష్ట్రంలో అయినా.. విభజిత రాష్ట్రంలో అయినా పెద్దగా అవకాశాలు కల్పించడం లేదు. జాతీయరాజకీయాలే దీనికి కారణం. పొత్తుల కోసం ఎప్పటికప్పుడు పార్టీ .. ఆయా పార్టీల అవసరాలకు అనుగుణంగా మార్చేస్తున్నారు. ఫలితంగా అసలైన సామర్థ్యం ఉన్న నేతలకు అవకాశం ఇవ్వడం లేదు.
అవకాశాల కోసం చూస్తున్న విష్ణువర్థన్ రెడ్డి, మాధవ్ వంటి నేతలు
ఉమ్మడి రాష్ట్రంలో ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో కన్నా ఏపీలోనేబీజేపీ బలంగా ఉండేది. కానీ ఇపపుడు తెలంగాణలో బీజేపీ బలోపేతం అయింది. ఎనిమిది పార్లమెంట్ స్థానాలు గెల్చుకున్నారు. కానీ ఏపీలో మాత్రం ఇతర పార్టీలతో పొత్తుల కోసం ప్రయత్నించాల్సి పచ్చింది. తెలంగాణలో బీజేపీ అలా ఎదగడానికి కారణం.. ఏబీవీపీ నుంచి ఎదిగిన బండి సంజయ్ లాంటి వారికి ప్రాధాన్యం, ఆవకాశాలు కల్పించడమే. కానీ ఏపీలో అలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఎప్పటికప్పుడు ఇతర పార్టీలతో సర్దుకుపోయే నేతలకే అవకాశాలు కల్పించారు . తమకు చాన్స్ వస్తే సత్తా చూపారని విష్ణువర్ధన్ రెడ్డి, మాధవ్ వంటి ఉపాధ్యక్షులు పట్టుదలగా ఉన్నారు.
రెడ్డి నేతలకు ఈ సారి అవకాశం కల్పించే అవకాశం
వచ్చే ఏడాది బీజేపీ జాతీయ అధ్యక్ష పదవితో పాటు చాలా రాష్ట్రాలకు బీజేపీ కొత్త అధ్యక్షులను నియమించబోతున్నారు. అందులో ఏపీ కూడా ఉండబోతోందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ అంశంపై చర్చలు జరుపుతున్నారు. రాయలసీమ రెడ్డి నేతలకు చాలా కాలంగా అన్యాయం జరుగుతోంది. ఎప్పుడూ కోస్తా నేతలకే అవకాశం ఇస్తున్నారు. అందుకే ఈ సారి రాయలసీమ రెడ్డి నేతలు., పార్టీని అంటి పెట్టుకుని ఉన్న వారికే అవకాశం కల్పించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. దీనిపై పార్టీ హైకమాండ్ కూడా సముఖంగా ఉందని చెబుతున్నారు. ఈ సారి ఏ పార్టీ ప్రభావం పడకుండా.. సొంతంగా పార్టీ అభివృద్ధి జరగాలంటే… రాయలసీమ యువ రెడ్డి నేతకు చాన్స్ ఇవ్వాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అలా అయితేనే ఏపీలో బీజేపీ ఉనికి కాపాడుకుంటుందని అంటున్నారు.