KTR: కక్కుర్తి వల్లే నిండా ఇరుక్కున్న కేటీఆర్ – E కార్ రేసులో జరిగింది ఇదే !

Image credit:x

Case On KTR: అసలు అవినీతే జరగలేదు.. డబ్బులు ఇచ్చింది నిజమేనని ఒప్పుకుంటున్న కేటీఆర్ పై కేసులు ఎందుకు పెట్టారు.? మనీ ట్రయల్ లేకపోతే అసలు ఏసీబీ ఎందుకొచ్చింది? అని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలకు కొన్ని మౌలికమైన అంశాలపై స్పష్టతలేదు.కానీ రూల్స్ మనీని పంపిన పూర్వాపరాలు చూస్తే అసలేం జరిగిందో అర్థమవుతుంది.

అసలుకేసేమిటంటే ?

ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహించే సంస్థకు 55 కోట్లు అక్రమంగా బదిలీ చేశారనేది అసలు కేసు. అక్రమంగా అని ఎందుకు అంటున్నారంటే.. ఆ డబ్బులు పంపేందుకు కనీస ప్రొసీజర్ ఫాలో కాలేదు. అంటే.. ఓ బ్యాంకులో డబ్బులు వేయాలంటే స్లిప్ రాయాలి. అంతే కాదని డబ్బులు అక్కడ పడేసిపోముగా. ఇక్కడ కూడా ఖజానా నుంచి ఫలానా వాళ్లకు డబ్బులిస్తున్నామని.. ఎందుకు ఇస్తున్నామన్నది ఎక్కడా చెప్పలేదు. బదిలీ చేసేశారు. తాము ఉద్దేశపూర్వకంగా ఆ నిధులు బదిలీ చేయలేదని.. హైదరాబాద్ కోసమే బదిలీ చేశానని అంటున్నారు. అయితే ఎందు కోసం బదిలీ చేశారన్నది రికార్డుల్లో ఉండాలని..కానీ ఆ డబ్బుల్ని విదేశీ కంపెనీ ఖాతాకు.. ఎలాంటి లెక్కాపత్రం లేకుండా పంపేశారని అంటున్నారు. అదీ కూడా ఇండియన్ కరెన్సీలో చెల్లించడంతో ఆర్బీఐ పైన్ కూడా వేసిందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.

గ్రీన్‌కో స్పాన్సర్ షిప్ వైదొలగడంతో అసలు సమస్య

మొదటి సారి రేస్ నిర్వహించినప్పుడు ఏర్పాట్లకు ప్రమోటర్‌ గ్రీన్ కో సంస్థ సబ్సిడరీ ముందుకొచ్చింది. ట్రాక్‌ నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు 5 కోట్ల వరకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం భరించింది. మిగతాది ప్రమోటర్‌ సంస్థనే చూసుకుంది. అయితే రెండో రేస్‌కు స్పాన్సర్ గా ఉండేందుకు గ్రీన్ కో అంగీకరించలేదు. దీంతో ఒప్పందం ప్రకారం ట్రాక్‌, రేసింగ్‌ నిర్వహణ, ఇతర ఏర్పాట్లు, మార్కెటింగ్‌, వివిధ దేశాల రేసర్లకు సౌకర్యాల కల్పన అన్నీ రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకు 200 కోట్లు అవుతుందని అంచనా వేశారు. దీనికోసం హెచ్‌ఎండీఏ గత సర్కారు ఆదేశాలతో రేసింగ్ నిర్వహణ సంస్థకు 55 కోట్ల వరకు చెల్లించింది.

ప్రభుత్వం మారిన తర్వాత వెలుగులోకి కీలక విషయాలు

ఫార్ములా ఈ రేసింగ్ కంపెనీకి 55 కోట్లను నిబంధనల ప్రకారం ఇవ్వలేదు. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ప్రభుత్వ ఖజానా నుంచి ఏజెన్సీకి డబ్బులు విడుదల చేయడం నేరం అవుతుంది. ఈ క్రమంలోనే క్యాబినెట్ ఆమోదం లేకుండా అగ్రిమెంట్లు కుదుర్చుకున్న అధికారులు నేరస్తులయ్యారు. ఇప్పుడు ఫార్ములా ఈ రేసు కేసులో ఈడీ కూడా కేసు నమోదు చేసింది. రూ. 55 కోట్లు అక్రమ నగదు తరలింపు కావడంతో ఏసీబీ కేసు నమోదు చేసిన వెంటనే ఈడీకి సమాచారం వెళ్లింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ప్రాతిపదికన ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. నగదు విదేశాలకు తరలిపోవడంతో PMLAతో పాటు ఫెమా చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.

కేటీఆర్‌కు డబ్బులు రాలేదు కానీ.. కేటీఆర్ తప్పే !

మొత్తంగా ఈ కేసులో డబ్బులు కేటీఆర్ కు రాలేదు. కానీ తరలిపోయిన విషయంలో ఆయన తప్పు స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి ఎలాంటి శిక్ష పడుతుందన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. కేటీఆర్ అరెస్టు కావడానికి రెడీగా ఉన్నారు. చాలా రోజులుగా అదే చెబుతున్నారు. ఇప్పుడు ఏసీబీ అధికారులు ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరం. ఆయనకు నోటీసులు జారీ చేసి ప్రశ్నిస్తారా లేకపోతే.. వెంటనే అరెస్టు చేసి ఆ తర్వాత కస్టడీకి తీసుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది. కేటీఆర్ ఆధ్వర్యంలో మొదటి ఫార్ములా ఈ రేస్ జరిగింది. రెండో రేస్ జరగాల్సిన సమయానికి ప్రభుత్వం మారింది. కేటీఆర్ కేసుల పాలయ్యారు.

తరవాత కథనం