Anil Ravipudi: టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ లిస్ట్ లో రాజమౌళి తర్వాత వినిపించే పేరు అనిల్ రావిపూడి. తీసిన ప్రతి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడిగా జక్కన్న ఫస్ట్ ప్లేస్ లో ఉంటే..ఆ తర్వాత అనిల్ రావిపూడి ఉంటాడు. రావిపూడి మూవీ అంటే ఎంచక్కా నవ్వుకోవచ్చు అని ఫిక్స్ అయిపోతారు ప్రేక్షకులు. ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడిగా..హీరోకి అనుగుణంగా కథలు ప్రజెంట్ చేస్తుంటాడు అనిల్ రావిపూడి. పటాస్ తో మొదలైన అనిల్ ప్రస్థానం..భగవంత్ కేసరి వరకూ ఓ రేంజ్ లో సాగింది. స్టార్టింగ్ లో పటాస్, సుప్రీమ్ తో యంగ్ హీరోలతో ప్రాజెక్ట్స్ చేసిన అనిల్ ఆ తర్వాత రవితేజతో రాజా ది గ్రేట్ చేశాడు. ఈ మూడు ప్రాజెక్టులు మినహా మిగిలినవన్నీ సీనియర్ హీరోలతోనే కావడం విశేషం.
వెంకీతో హ్యాట్రిక్ పక్కా!
F2, F3 తో వెంకటేశ్ కి వరుస హిట్స్ ఇచ్చాడు. ఇప్పుడు లేటెస్ట్ గా సంక్రాంతికివస్తున్నాం మూవీతో 2025 సంక్రాంతికి సిద్ధమవుతున్నాడు. వెంకటేశ్, ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరి నటిస్తున్న ఈ సినిమాపై మంచి బజ్ ఉంది. సాంగ్స్ తో మూవీ టీమ్ చేస్తున్న ప్రమోషన్ బాగానే కలిసొచ్చింది. లాంగ్ గ్యాప్ తర్వాత రమణాగోగులను తీసుకొచ్చి పాడించిన గోదారి గట్టుమీద సాంగ్ యూట్యూబ్ లో ఓ ఊపు ఊపింది. ఆ తర్వాత వెంకీ తన లవ్ స్టోరీని భార్యకు చెప్పడంలో భాగంగా రీలీజ్ చేసిన మీనూ సాంగ్ మూవీ లవర్స్ ని మురిపించింది. ఈ సినిమాతో వెంకీ-రావిపూడి కాంబోలో హ్యాట్రిక్ పక్కా అని ఫిక్సైపోయారంతా…
వెంకీ, బాలయ్య తర్వాత చిరుతో
వెంకీతో ఈ మూవీస్ మధ్యలో నందమూరి నటసింహం బాలకృష్ణతో భగవంత్ కేసరి తెరకెక్కించాడు. ఇప్పటివరకూ చూడని సరికొత్త బాలయ్యను చూపించి ప్రేక్షకులకు మెస్మరైజ్ చేశారు. భగవంత్ కేసరి సినిమా బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ కలెక్షన్లు వసూలు సాధించింది. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత మెగాస్టార్ తో ప్రాజెక్ట్ ను ఫైనల్ చేసుకున్నాడు రావిపూడి. ప్రస్తుతం విశ్వంభర మూవీతో బిజీగా ఉన్న చిరు.. ఆ తర్వాత రావిపూడితో ప్రాజెక్ట్ కు డేట్స్ కేటాయించనున్నారు. చిరు మాస్ ఎలిమెంట్స్ అండ్ అనిల్ రావిపూడి ఎంటర్టైనింగ్ తో మూవీ అదిపోనుందని ఫ్యాన్స్ ఫిక్సైపోయారు.
మెగాస్టార్ తర్వాత నాగ్ తో ఫిక్స్
మెగాస్టార్ చిరంజీవి తర్వాత అనిల్ రావిపూడి మరో సీనియర్ హీరోని లైన్లో పెట్టుకున్నాడు. ఇప్పటికే వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవితో తర్వాత ఇక సీనియర్ హీరోల్లో నాగార్జున మాత్రమే ఉన్నాడు. చిరుతో మూవీ పూర్తయ్యాక నాగ్ తో ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. అంటే అనిల్ రావిపూడి వరుసగా సీనియర్ హీరోలతోనే మూవీస్ ప్లాన్ చేసుకున్నట్టు క్లారిటీ వచ్చేసింది. వాస్తవానికి చిరంజీవి కన్నా ముందే నాగార్జునతో అనిల్ రావిపూడితో సినిమా చేస్తాడనే టాక్ వచ్చింది కానీ ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ కాలేదు. నా సామిరంగా తర్వాత నాగ్ సోలోగా ఓ సినిమాకి కమిటవ్వలేదు. ప్రస్తుతం రజనీకాంత్ కూలీ, ధనుష్ కుబేరలో నటిస్తున్నారు. ఈ మూవీస్ తర్వాత అనిల్ రావిపూడితో మూవీ స్టార్ట్ అవుతుంది. ఈ లోగా రావిపూడి చిరుతో సినిమా ఫినిష్ చేయనున్నాడు.
Pavitra lokesh: పవిత్ర మాటలను అపవిత్రం చేసేశారు.. మరీ ఇంత అరాచకంగా ఉన్నారేంట్రా బాబూ!