Indian Cricketers Retired In 2024: 2024 సంవత్సరం భారత్ క్రికెట్ అభిమానులకు కొన్ని సంతోషాలను ఇచ్చినప్పటికీ అంతకంటే బాధాకరమైన జ్ఞాపకాలను కూడా మిగిల్చింది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకొని అభిమానులకు ఆనందాన్ని పంచితే… అదే టైంలో దాదాపు ఒకజట్టుకు సరిపోయే క్రికెటర్లు వీడ్కోలు చెప్పారు. అందులో చాలా మంది టాప్ ప్లేయర్స్ ఉండటం బాధను కలిగించింది.
విరాట్ కోహ్లితో మొదలు పెడితే నిన్నమొన్నటి టాలెంటెడ్ స్పిన్నర అశ్విన్ వరకు అభిమానులకు షాక్‌ల మీద షాక్‌లు ఇచ్చారు. ఈ జాబితాలో రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, శిఖర్ ధావన్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. భారత అభిమానులను నిరాశ పరిచారు. కోహ్లీ, రోహిత్, జడేజా టీ20 ఇంటర్నేషనల్‌కు మాత్రమే వీడ్కోలు పలకడం కాస్త ఊరట కలిగించే అంశం.
ఒకేసారి కోహ్లీ రోహిత్ జడేజా రిటైర్
జూన్‌లో టీ20 ప్రపంచకప్‌ను భారత జట్టు గెలుచుకుంది. జూన్ 29న జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించి టీ20 ప్రపంచకప్‌ను రెండోసారి కైవశం చేసుకుంది. బార్బడోస్‌లో జరిగిన ఈ ఫైనల్లో గెలిచిన తర్వాత భారత అభిమానులు సంబరాలు చేసుకుంటున్న టైంలో ఒకరి తర్వాత ఒకరు షాక్‌లు ఇచ్చారు. ముందు కోహ్లి తన రిటైర్మెంట్ను ప్రకటిస్తే తర్వాత రోహిత్ శర్మ వీడ్కోలు చెప్పేశాడు. కొన్ని గంటల వ్యవధిలోనే జడేజా కూడా టీ 20 ఆటకు వీడ్కోలు చెబుతున్నట్టు ప్రకటించాడు. ఈ విధంగా వరల్డ్ కప్ గెలిచిన ఆనందంతోపాటు ముగ్గురు స్టార్ ప్లేయర్ల రిటైర్మెంట్ బాధ అభిమానులకు ఎప్పటికీ ఉండిపోనుంది. టీ 20 ప్రపంచకప్ వచ్చిన ప్రతిసారీ ఈ విషయం గుర్తు చేస్తూనే ఉంటుంది.
ఏడాది చివరిలో అశ్విన్ దెబ్బ
ఏడాది ముగిసే సమయానికి స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పెద్ద దెబ్బే ఇచ్చాడు. ఈ స్టార్ స్పిన్ ఆల్ రౌండర్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మధ్యలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన గబ్బా టెస్టు డ్రా అయిన వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించాడు అశ్విన్. గురువారం (డిసెంబర్ 18) తాను వీడ్కోలు చెబుతున్నట్టు వెల్లడించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది 2024లో మొత్తం 12 మంది భారత క్రికెటర్లు రిటైరయ్యారు.
2024లో రిటైన్ వాళ్లు
కోహ్లీ, రోహిత్, జడేజా టీ20 ఇంటర్నేషనల్ నుంచి రిటైర్మెంట్ తీసుకోగా…. అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. దినేష్ కార్తీక్, శిఖర్ ధావన్, కేదార్ జాదవ్, వృద్ధిమాన్ సాహా, వరుణ్ ఆరోన్, బరీందర్ స్రాన్, సిద్ధార్థ్ కౌల్, సౌరభ్ తివారీ కూడా మూడు ఫార్మాట్లకు బైబై చెప్పేశారు.
ఇప్పుడు కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టుల్లో సరిగా ఆడలేకపోతున్నారు. దీంతో వచ్చే ఏడాది జరిగే టెస్టు ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్‌కు భారత్ అర్హత సాధించకుంటే ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వీళ్లకు ఆఖరి టెస్టు సిరీస్ కానుంది. ఒకవేళ అర్హత సాధించినట్టైతే వాళ్లు ఇంకో టెస్టు ఆడే అవకాశం ఉంది. ఇప్పటికే రిజ్వర్ బెంచ్ భారత్‌కు గట్టిగానే ఉంది యువ క్రికెటర్లు భారత్ టీంలో స్థానం కోసం ఎదురు చూస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే వచ్చే ఏడాది కూడా రిటైర్మెంట్లు గట్టిగానే ఉండే అవకాశం ఉందని క్రికెట్ పండితులు చెబుతున్నారు. కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి వాళ్లు వన్డేలకు లేకా ఐపీఎల్‌కు పరిమితం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.