Allu Arjun Vs Police: తెలియక చేస్తున్నాడో.. తెలిసి చేస్తున్నాడో.. లీగల్ టీం మొత్తానికే చిన్న మంటను వైల్డ్ ఫైర్ గా మారిందో కానీ అల్లు అర్జున్ నిండా మునిగిపోతున్నారు. నిన్నటిదాకా ఆయన రాజకీయ నాయకులకు టార్గెట్ ఎమో కానీ ఇవాళ సీన్ పూర్తిగా మారిపోయింది. పోలీసు వ్యవస్థకు వ్యతిరేకంగా మారారు. ఆయనకు వ్యతిరేకంగా ఒక్క సారిగా పోలీసు వ్యవస్థ దండెత్తింది. ఈ పరిణామం అల్లు అర్జున్ క్యాంప్ ను ఒక్క సారిగా ఆందోళనకు గురి చేసేలా ఉంది.
కోర్టులో పోలీసులపై నిందలేసి బెయిల్ తెచ్చుకోవడం మైనస్
సంధ్యా ధియేటర్ తొక్కిసలాట వివాదంలో మొత్తం నింద డిపార్టుమెంట్ వేసేందుకు అల్లు అర్జున్ లీగల్ టీం చేసిన ప్రయత్నాలు వికటించాయి. హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై వాదనలు వినిపించేటప్పుడు అర్జున్ తరపు లాయర్ నిరంజన్ రెడ్డి .. పోలీసులపై ఆరోపణలు చేశారు. పోలీసులు తొక్కిసలాట జరుగుతున్నప్పుడు అక్కడ లేరని. హీరో చుట్టూ ఉన్నారని ఆరోపించారు. శనివారం అల్లుఅర్జున్ ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు అనుమతి ఇచ్చారని.. తనను వెళ్లిపోవాలనిఏ పోలీసు అధికారి చెప్పలేదని పైగా.. తాను వస్తూంటే వాళ్లే రూట్ క్లియర్ చేశారని కూడా చెప్పుకొచ్చారు. ఆ ఆరోపణలో పోలీస్ డిపార్టుమెంట్ ఒక్క సారిగా ఫైర్ అయింది.
ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టిన సీపీ – ఇంకా చాలా చూస్తారని హెచ్చరికలు
అర్జున్ చేసిన వ్యాఖ్యలు ఎంత మిస్ ఫైర్ అయ్యాయంటే.. ఏకంగా పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రెస్ మీట్ పెట్టారు. అర్జున్ చేసిన వ్యాఖ్యన్నీ తప్పు అని చెప్పి ఆధారాలు బయట పెట్టారు. దియేటర్ కు అల్లు అర్జున్ ఎలా వచ్చాడు… ఎలా వెళ్లాడు అనేది వివరించారు. పోలీసుల ప్రయత్నాలు.. అల్లు అర్జున్ తీరును కూడా వివరించారు. నిజానిక అర్జున్ తన తప్పేం లేదని చెప్పుకోవడానికి కొన్ని ప్రివిలేజెస్ తీసుకున్నారు. తనకు అనుకూలంగా వాదనలు వినిపించుకున్నారు. తన ఇమేజ్ కు దెబ్బపడుతోందని బాధపడ్డారు. కానీ నీ ఇమేజ్ సంగతి సరే..డిపార్టుమెంట్ ఇమేజ్ సంగతేమిటని.. పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పుడీ ఇష్యూలో.. అర్జున్ రాజకీయ నేతలతో పెట్టుకున్నది కాక.. పోలీసులతోనూ పెట్టుకున్నారు.
పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు- ప్రభుత్వానిదీ అదే దారి
అంతకు ముందే సస్పెన్షన్ లో ఉన్న ఏసీపీ కృష్ణమూర్తి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మేం తల్చుకుంటే ఇక్కడ ఉండలేరని హెచ్చరించారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ పోలీసు పెద్దలు ఆయనకు ప్రెస్ మీట్ పెట్టమని సూచించి ఉంటారు. ఆ మేరకు పెట్టారు. ఎవరూ ఊహించని విధంగా హెచ్చరికలు జారీ చేశారు. తాత్కలిక బెయిల్ తప్పించిన నిరంజన్ రెడ్డి పోలీసులపై నిందను తోసేసి చిన్న నిప్పు రాజేశారు. ఇప్పుడు అది వైల్డ్ ఫైర్ గామారింది. ఎంతగా అంటే.. అల్లు అర్జున్ కెరీర్ ఇందులో దహనం అయిపోతోందా అన్నంత అనుమానం వస్తోంది.
చాలా రాంగ్ వేలో డీల్ చేసిన పుష్ప టీం
ఈ విషయాన్ని డీల్ చేయడంలో అల్లు అర్జున్ టీం పూర్తిగా తడబడింది. తమను టార్గెట్ చేసి తనపై నిందలేసి తప్పించుకోవాలని అనుకున్న అర్జున్ పై వారు దాదాపుగా పగబట్టేశారు. సినిమాలలో పట్టుకుంటే షెకావతూ.. వదిలేస్తా సిండికేటు అని పాటలో .. డైలాగులో చెబితే పని కాదు .. కాళ్లు పట్టుకున్నా చేయిదాటిపోయే పరిస్థితి వస్తోంది.