ప్రముఖ ఆభరణాల సంస్థ పీఎంజే జ్యూవెల్స్ మరోసరికొత్త క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. కస్టమర్ల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని వివిధ రకాల డిజైన్లను అందుబాటులోకి తెచ్చింది. పీఎంజే జ్యూవెల్స్ సంస్థకు ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు కుమార్తె సితారా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజా క్యాంపెయిన్‌కు సితారానే ప్రచారకర్తగా వ్యవహరించనుంది. పీఎంజే జ్యూవెల్స్ విశిష్టత, ప్రత్యేతలను ప్రజలకు తెలియజేయనుంది.
ఈ క్యాంపెయిన్‌లోని సరికొత్త కలెక్షన్ ఆభరణాలు, భారతీయ వారసత్వాన్ని, నైపుణ్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తామని పీజేఆర్ యాజమాన్యం వెల్లడించింది. పచ్చలు, వజ్రాలు, కెంపులతో అద్దిన, అత్యాధునికంగా, కళాత్మకంగా తయారైన ఎన్నోరకాలు డిజైన్ల కలెక్షన్లను పీఎంజే జ్యూవెల్స్ తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు.
పెళ్లి నగలతోసహా రకాల వేడుకల్లో ధరించేందుకు అనువుగా ఈ ఆభరణాలు తయారయ్యాయని, ఒక్కసారి పీఎంజే షోరూమ్‌లో అడుగు పెడితే చాలు.. సరికొత్త డిజైన్లను చూస్తూ మిమ్మల్ని మీరు మరిచిపోతారని తెలిపారు. ఈ జ్యుయెలరీ కలెక్షన్‌ను ధరిస్తే రాయల్ లుక్ మీ సొంతం అవుతుందని అంటున్నారు. వేడుక ఏదైనా సరే మీరు మెరిసిపోవడం ఖాయమని పేర్కొన్నారు.
టైమ్స్ స్క్వేర్ వద్ద పీఎంజే.. సితారా కలెక్షన్స్ ప్రకటన
పీఎంజే జ్యువెల్స్ లేటెస్ట్ కలెక్షన్ ఆభరణాలు ధరించిన సితార ఫొటోలను న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ వద్ద ఆవిష్కరించారు. ఈ లేటెస్ట్ క్యాంపెయిన్ ద్వారా భారతీయ నగల విశిష్టత, ప్రత్యేకత ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తెలుసుకోబోతున్నారు. కళాత్మకమైన ఆభరణాల ప్రత్యేకతను చాటిచెప్పడమే కాకుండా భారతీయ వారసత్వాన్ని, నైపుణ్యాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకే ఈ క్యాంపెయిన్ అని పేర్కొన్నారు పీఎంజే జ్యూవెల్స్. ఈ బ్రాండ్స్ ద్వారా తానూ సంపాదించిన మొత్తాన్ని మహేశ్ బాబు ఛారిటబుల్ ట్రస్ట్ కు డొనేట్ చేస్తానని ఘట్టమనేని సితార ఓ ఇంటర్వ్యూలో తెలిపిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం మహేష్ బాబు తన తర్వాతి ప్రాజెక్టుతో బిజీ బిజీగా ఉన్నారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీలో మహేష్ బాబు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా పేరు పెట్టని ఈ మూవీ కోసం మహేష్ గట్టిగానే కసరత్తులు చేస్తున్నారు. ఈ మూవీ కోసం తన గెటప్ కూడా మార్చేసుకున్నాడు. గెడ్డం, మీసాలు, పెరిగిన జుట్టుతో చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. మహేష్ లుక్ చూసి.. ఆయన అభిమానులు తెగ మురిసిపోతున్నారు. రాజమౌళీ మూవీ ఈ సారి హాలీవుడ్ రేంజ్లో ఉండబోతుందని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రి-ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ విదేశాల్లో జరుగుతున్నాయి.
2025లో పూర్తి స్థాయిలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజమౌళి-మహేష్ బాబు సంయుక్తంగా ఈ ప్రాజెక్టు వివరాలను అధికారికంగా వెల్లడించనున్నట్లు సమాచారం. మరి, ఈ మూవీ పూర్తి కావడానికి కనీసం రెండేళ్లైనా పడుతుందనేది టాక్. అంతకంటే ఎక్కువ సమయం పట్టినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే.. అది రాజమౌళి మూవీ. ఏమైనా జరగొచ్చు. ముఖ్యంగా గ్రాఫిక్స్ వర్క్‌కు బోలెడంత సమయం పట్టేస్తుంది. అందుకే, రాజమౌళితో మహేష్ బాబు సినిమా అనగానే ఆయన అభిమానులు ఎగిరి గంతేసినా.. రిలీజ్ ఎప్పుడు అవుతోందో అనే దిగులు మాత్రం వెంటాడుతోందట.