శ్రీనివాస్, శంకర్, సతీష్, సత్యనారాయణ, సుబ్రహ్మణ్యం, సురేష్, స్వాతి, శిరీషా, స్నేహా, సత్య, సుధా, శ్రీదేవి, సూర్య.. ఇలా చెప్పుకుంటూ పోతే S అక్షరంతో మొదలయ్యే పేర్లు చాలానే వస్తాయి. అయితే, ఈ అక్షరాన్ని నక్షత్రాలను, పేరు బలాన్ని చూసే పెడతారనే సంగతి తెలిసిందే. కొంతమంది వేర్వేరు నమ్మకాలతో కూడా పేర్లు పెట్టుకుంటారు. అయితే, ఒకసారి వారు ఆ అక్షరంతో మొదలయ్యే పేరు పెట్టుకున్నాక.. జాతకంలో చాలా మార్పులు జరుగుతాయట. అంతేకాదు వారి స్వభావం, కెరీర్, లైఫ్.. చివరికి వారికి వచ్చే రోగాలు కూడా ఆ పేరు మీదే ఆధారపడి ఉంటాయట.
అయితే, S అక్షరాన్ని మన పెద్దలు చాలా పవర్‌ఫుల్‌గా భావిస్తారు మన పెద్దలు. ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల వ్యక్తిత్వం కూడా మంచిదనే అభిప్రాయం ఉంది. ఒక వేళ మీ పేరు లేదా మీ స్నేహితులు, తోబుట్టువులు, బంధువుల పేర్లు ‘ఎస్’తో మొదలవుతున్నట్లయితే.. వారు ఎలాంటి వారో తెలుసుకోడానికి ఇది చదవండి. కానీ, ఒక్క విషయం అందరూ ఇందులో చెప్పినట్లే ఉంటారని మాత్రం గుడ్డిగా నమ్మొద్దు. ఎందుకంటే.. కొందరి వ్యక్తిత్వం లైఫ్ అనేది వారు ఉండే సమాజం, వాతావరణం, పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. వీటిలో కొన్ని మాత్రమే వారికి దగ్గరగా ఉండవచ్చు లేదా భిన్నంగా ఉండవచ్చు.
ఆకర్షణీయంగా ఉంటారు.. ఇతరులకు నచ్చేస్తారు: S అక్షరం వ్యక్తులు చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటారు. ఇతరులకు ఇట్టే నచ్చేస్తారు. కానీ, వీరిలో ఒక మైనస్ పాయింట్ కోపం. ఆగ్రహంతో ఒక్కోసారి నిగ్రహాన్ని కోల్పోతారు. దానివల్ల దగ్గరవారు దూరమయ్యే ప్రమాదం ఉంది. కానీ, ఆ కోపం తర్వాత వెంటనే పశ్చాతాపానికి గురవ్వుతారు. వీలైతే సారీ చెప్పడానికి కూడా వెనకాడరు. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవారు వీరు. అందుకే, వీరు ఒక్కోసారి ఎవరికీ అర్థం కారు.
నిశబ్దంగా కనిపిస్తారు, కానీ..: ‘ఎస్’ అక్షరంతో కనిపించే వ్యక్తులు నిశబ్దంగా, అమాయకులుగా కనిపిస్తారు. కానీ, వారు ఎత్తులు వేస్తే ఎంతటివారైనా చిత్తు కావల్సిందే. ఎంత సహనంతో ఉంటారో.. అంత కోపం ఎక్కువ. వీరికి ట్రింగరింగ్ పాయింట్ అనేది ఉంటుంది. ప్రతిసారి కోపంగించకోరు.. చాలా సరదాగా అందరితో కలిసిపోతారు. ఎవరైనా రెచ్చగొడితే సంయమనం పాటిస్తారు. తేడా వస్తే ఇచ్చిపడేస్తారు. అంతకాదు, వీరిలో క్షమాగుణం కూడా ఎక్కువే. కోపాన్ని ప్రదర్శించిన తర్వాత.. అరే మనం అలా చెయ్యకుండా ఉండాల్సిందేనని తమలో తాము మదన పడతారు.
పుట్టకతోనే లీడర్స్: ఔనండి, ‘S’ అక్షరం చాలా పవర్‌ఫుల్ అని ఇప్పటికే చెప్పుకున్నాం. ఈ అక్షరంతో మొదలయ్యే పేర్లు గల వ్యక్తులు పుట్టకతోనే లీడర్స్ అంటారు. వీరు ఏ రంగంలో అడుగు పెట్టినా చక్కగా రాణిస్తారు. తాము ముందుండి.. టీమ్‌ను నడిపిస్తారు. అంతేకాదు వీరు చాలా విశ్వాసంగా, నమ్మకంగా ఉంటారు. ఎక్కువ శాతం నిజాయతీతో.. ముక్కుసూటిగా ఉంటారు.
ప్రేమిస్తే.. ప్రాణాలు ఇస్తారు: ‘S’ అక్షరంతో పేరు మొదలైన వ్యక్తులను సెంటిమెంటల్ ఫూల్స్ అని చెప్పవచ్చు. వీరిని మోసం చెయ్యడం కూడా చాలా ఈజీ. ఎందుకంటే.. వీరు ఎవరినైనా ప్రేమిస్తే.. చచ్చేవరకు ప్రేమిస్తూనే ఉంటారు. ప్రేమించిన వాళ్లకు ప్రాణాలు ఇవ్వమన్నా ఇచ్చేస్తారు. వీరిని వదిలించుకోవడం అంత ఈజీ కాదు. కుటుంబ సభ్యులైనా, స్నేహితులైనా కష్టాల్లో ఉంటే చూడలేరు. వారికి అండగా ఉంటారు. వీలైతే తమకు తోచిన సాయం చేస్తారు. ఇతరుల కష్టాలు చూసి కన్నీళ్లు పెట్టుకొనే స్వభావం వీరిది. ఒంటరితనం ఇష్టం ఉండదు. అలా ఉండాల్సి వస్తే డిప్రెషన్‌కు గురవ్వుతారు. చాలా విషయాలను బయటకు చెప్పుకోలేరు. తమలోనే దాచేసుకుంటారు. ఇతరులను బాధపెట్టే ఉద్దేశం ఉండదు. కానీ, తమ జోలికి వస్తే మాత్రం.. తగిన బుద్ధి చెబుతారు.
ఒక లక్ష్యంతో పనిచేస్తారు: మహేష్ బాబు నటించిన ‘అతడు’ మూవీలో ఓ డైలాగు ఉంటుంది. వీడేంటురా.. ‘‘మొక్కకు అంటు కడుతున్నట్లు చాలా పద్ధతిగా కొడుతున్నాడు’’ అని. ‘ఎస్’ అక్షరం వ్యక్తులు కూడా అదే టైప్. వారికి ఏదైనా పని అప్పగిస్తే చాలా పద్ధతిగా పూర్తి చేస్తారు. ఆ పని పూర్తి చేసేవరకు నిద్రపోరు. జీవితంలో ఎదిగేందుకు ఏదో ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకుంటారు. వీళ్లకు మోసం చేసి ఎదగడం చేతకాదు. అందుకే, వీలైనంతవరకు మంచి మార్గాల్లోనే సంపాదనకు ప్రయత్నిస్తారు. మాటలతో బూర్లు అమ్మడం వీరికి రాదు. గుర్తింపు కోరుకోరు.. కానీ గొడ్డు చాకిరీ చేస్తారు. అందుకే, వెంటనే కాకున్నా.. ఏదో ఒక సమయానికి పేరు, డబ్బు, పరపతిని సాధిస్తారు.
క్రియేటివ్‌గా ఆలోచిస్తారు: S అక్షరం వ్యక్తులు చాలా క్రియేటివ్‌గా ఆలోచిస్తుంటారు. కొత్తవి చేయడానికి పరితపిస్తుంటారు. రిస్క్ చేసి చేతులు కాల్చుకొనేవారూ ఉంటారు. సక్సెస్ సాధించి.. ముందుకెళ్లేవాళ్లూ ఉంటారు. అయితే, ఇదంతా వారు పనిచేసే ఫీల్డ్‌పై ఆధారపడి ఉంటుంది. వీరు ఏపని అయినా సరే.. ఒక్కసారి చూసి నేర్చేసుకుంటారట. కానీ, ఈ అక్షరం కలిగిన అబ్బాయిలు.. త్వరగా మోసానికి గురవ్వుతారట. అతిగా నమ్మి రోడ్డున పడతారట. వీరు ఎక్కువగా స్కిన్ అలర్జీ, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడతారట. సో.. మీది S అక్షరమైతే.. జాగ్రత్తగా ఉండండి. అలాగే.. పాజిటివ్ విషయాలను తెలుసుకుని సానుకూలంగా ఉండండి. నెగటివ్ విషయాలకు దూరంగా ఉంటూ మీ పేరును నిలబెట్టుకోండి.