Producer Nagavamshis Sensational Comments: అఖండ, వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి లాంటి వరుస హిట్స్ తో ఊపుమీదున్న బాలయ్య… చిరంజీవితో వాల్తేరు వీరయ్య చేసిన డైరెక్టర్ బాబీతో ‘డాకు మహారాజ్’ అనే మూవీ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో తో పాటు, లిరికల్ వీడియో సాంగ్ ఆల్రెడీ రిలీజ్ చేశారు.
జనవరి 12 న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలకానున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీ గురించి నిర్మాత సూర్య దేవర నాగవంశీ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు.. ఈ మీట్ లో ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. ప్రమోషనల్ ఈవెంట్స్ గురించి ముందుగా మాట్లాడిన నాగవంశీ..అమెరికాలో జనవరి 4న ఈవెంట్ నిర్వహిస్తామని..మరో ఈవెంట్ విజయవాడలో చేస్తామన్నారు.
సినిమా ప్రమోషన్లో భాహంగా..ఔట్ పుట్ ఎలా వచ్చిందని అడిగిన ప్రశ్నకు నాగవంశీ ఇచ్చిన రియాక్షన్ వైరల్ అవుతోంది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది..ఇంకా చెప్పాలంటే డైరెక్టర్ బాబీ గత చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మీకు తెలుసు.. ఆ సినిమా కన్నా బాలకృష్ణతో ‘డాకు మహారాజ్’ బాగా తీశాడు. ఇలా మాట్లాడినందుకు నన్ను చిరంజీవి గారి ఫ్యాన్స్ తిట్టుకున్నా పర్వాలేదకు..కానీ ఇదే నిజం అని మరోసారి అన్నారు.
ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఎవ్వరి అంచనాలకు అందవని..ఇప్పటికే డైరెక్టర్ బాబీ చెప్పారు. సినిమా చాలా బాగా వచ్చిందని..బ్యూటిఫుల్ ఎమోషన్ తో పాటూ ఎంటర్టైన్మెంట్ ఉంటుందన్నారు.
గతేడాది సంక్రాంతి కానుకగా వచ్చిన వాల్తేరు వీరయ్య వసూళ్ల సునామీ క్రియేట్ చేసింది. సుమారు 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. మెగాస్టార్ చిరంజీవి లోని కామెడీ టైమింగ్, సెంటిమెంట్ యాంగిల్ లాంగ్ గ్యాప్ తర్వాత బయటకుతీసిన మూవీ ఇది. అందుకే ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు. అలా భారీ హిట్ తో ఫామ్ లో ఉన్న బాబీ..హ్యాట్రిక్ హిట్స్ తో దూసుకెళుతున్న బాలయ్య కాంబోలో వచ్చిన మూవీ డాకూమహారాజ్. అందుకే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.
బాలయ్య – బాబీ మాత్రమే కాదు.. నిర్మాత నాగవంశీ కూడా వరుస హిట్స్ తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. 2024 ఆరంభంలో టిల్లు స్క్వేర్ తో హిట్ అందుకున్న నాగవంశీ..సెప్టెంబర్ నెలలో దేవరతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇలా డాకూ మహారాజ్ టీమ్ మొత్తం జోష్ లోనే ఉన్నారు. అందుకే ఇది మరో బ్లాక్ బస్టర్ అవుతుందనే అంచనాలున్నాయి.
డాకు మహారాజ్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకొచ్చాయ్. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతోన్న ఈ మూవీ ఎలాంటి హిట్ అందుకుంటుందో వెయిట్ అండ్ సీ..
Pavitra lokesh: పవిత్ర మాటలను అపవిత్రం చేసేశారు.. మరీ ఇంత అరాచకంగా ఉన్నారేంట్రా బాబూ!