జనవరి నుంచి దేశంలో వచ్చే అతి పెద్ద మార్పులు ఇవే- వీటిని తెలుసుకోకుంటే మాత్రం జేబులు చిల్లే

January 2025

జనవరి 1 కొత్త సంవత్సరం ప్రారంభోత్సవంతోనే దేశంలో ఆర్థిక మార్పులు జరగనున్నాయి. వాటిలో కొన్ని భారాన్ని పెంచేవి అయితే మరికొన్ని ప్రయోజనకరంగా ఉండేవి.

ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానం పలికేందుకు సిద్ధమవుతున్నారు. అయితే అదే టైంలో కొత్తగా వచ్చే మార్పులు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే కచ్చితంగా మీరు ఆర్థికంగా నష్ట పోతారు.

దేశంలో ప్రతి నెల అనేక ఆర్థిక మార్పులు కనిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు కొత్త సంవత్సంలో కూడా ప్రధానంగా ఐదు మార్పులు కనిపించనున్నాయి. అందులో మొదటిది ఎల్పీజీ సిలిండర్ ధరలు, ఏటీఎఫ్‌ రేట్లలో మార్పు ఉంటుంది. ప్రతి నెల మొదటి రోజు వీటిని చమురు సంస్థలు మార్పులు చేర్పుులు చేస్తుంటాయి. ఈసారి కూడా ఆ మార్పులు ఉంటాయి. చాలా కాలంగా పంతొమ్మిది కిలోల కమర్షియల్స్ సిలిండర్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇంటికి వినియోగించే గ్యాస్‌ సిలిండర్ ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. వీటిలో ఈసారి కచ్చితంగా మార్పు ఉంటుందని అంటున్నారు.

యూపీఏ పేమెంట్‌ విధానంలో కూడా జనవరి ఒకటి నుంచి మార్పులు చేర్పులు జరగనున్నాయి. ఫీచర్ ఫోన్ ఉన్న వాళ్లు యూపీఐ 123పే విధానంలో ఐదు వేల వరకు మాత్రమే రోజులో చెల్లించే వాళ్లు. ఇప్పుడు దీన్ని జనవరి 1 నుంచి పదివేలకు పెంచబోతున్నారు.

ఈపీఎఫ్‌వో లో భారీ మార్పులు చేశారు. ఇప్పుడు ఈపీఎఫ్‌వో ఖాతాదారులు తన ఖాతా నుంచి కొంత మొత్తాన్ని ఏటీఎం ద్వారానో, బ్యాంకు ద్వారానో తీసుకునే వెసులుబాటు కల్పిస్తోంది కేంద్రం. ఇంతక ముందు ఈపీఎఫ్‌వో నిధులు తీసుకోవాలంటే చాలా ప్రక్రియ ఉండేది.ఇప్పుడు దాన్ని కుదించి నేరుగా ఖాతాదారు డబ్బులు తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఇది జనవరి ఒకటి నుంచి అమల్లోకి రానుంది.

రైతులకు ఎలాంటి హామీ లేకుండా రెండు లక్షల వరకు రుణం ఇచ్చేందుకు ఆర్బీఐ అంగీకరించింది. ఇప్పటి వరకు లక్షన్నర వరకు మాత్రమే హామీ లేకుండా రుణాలు ఇచ్చే వాళ్లు ఇప్పుడు దాన్ని రెండు లక్షలకు పెంచారు.

చదువుకోవడానికి లేదా ఉద్యోగం చేయడానికి అమెరికా వెళ్లే వ్యక్తులు కొత్త వీసా నిబంధనలు కూడా మారుతున్నాయి. భారతదేశంలోని యూఎస్ ఎంబసీలో వీసా అపాయింట్‌మెంట్‌లు ఒకసారే ఇవ్వనున్నారు. అదనపు రుసుము లేకుండా అపాయింట్‌మెంట్‌ని ఒకసారి రీషెడ్యూల్ చేసుకోవచ్చు. రెండోసారి రీషెడ్యూల్ చేసినా మిస్ అయినా కొత్త అపాయింట్‌మెంట్కు రిక్వస్ట్ పెట్టుకోవాల్సింది. అంటే రూ. 15,730 నాన్ రిఫండబుల్ ఫీజు చెల్లించుకోవాలి.

తరవాత కథనం