Tollywood Persons Meet CM : సీఎం రేవంత్‌తో జరిగిన సినీ ప్రముఖల భేటీకి అగ్రనటులు దూరం- కారణం ఏంటంటే?

Tollywood

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వర్సెస్‌ సినిమా ఇండస్ట్రీ అన్నట్టు సాగుతున్న వివాదానికి శుభంకార్డు పడినట్టే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశమై తమ కష్టనష్టాలు చెప్పుకున్నారు. పుష్ప-2 బెనిఫిట్‌ షో రోజు జరిగిన ఘటనపై వివరణ ఇచ్చుకున్నారు. బాధిక కుటుంబానికి అండగా ఉండేందుకు సినిమా పరిశ్రమ అంగీకరించింది. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని కూడా మాట ఇచ్చినట్టు సమాచారం. అదే టైంలో బెనిఫిట్‌షోలు, టికెట్ల రేట్లపై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఒప్పించే ప్రయత్నం చేశారు.

సీఎంతో భేటీకి మెగాస్టార్ సహా అగ్రనటులు దూరం
సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశానికి కీలకమైన నటులు దూరంగా ఉన్నారు. మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్‌తేజ్‌ ఒక్కరే హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నందున హాజరుకాలేకపోతున్నట్టు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో ఆయన మాట్లాడారని తెలుస్తోంది. అందుకే నేరుగా ఈ సమావేశానికి హాజరుకావడం లేదని చెప్పుకుంటున్నారు. రామ్‌చరణ్‌ కూడా తన గేమ్‌ఛేంజర్ ప్రమోషన్ బిజీల్లో ఉన్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్, ప్రభాస్‌, మహేష్‌బాబు వీళ్లంతా షూటింగ్స్‌లో విదేశాల్లో ఉన్నారు. మరో నటుడు బాలకృష్ణ తన సినిమా పోస్ట్ ప్రొడెక్షన్‌లో బిజీగా ఉన్నారు. అందుకే ఆయన కూడా రాలేదని చెబుతున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా ఉన్నారు. వస్తే లేనిపోని ఇష్యూస్ వస్తాయని కూడా ఆలోచించి ఉండొచ్చని మరో ప్రచారం ఉంది.

సీఎం రేవంత్‌రెడ్డితో సమావేసమైన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే
నిర్మాతలు:- అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, ఏషియన్ సునీల్ నారంగ్, నిర్మాత సుప్రియ యార్లగడ్డ, నిర్మాత చినబాబు, నిర్మాత నాగవంశీ, పుష్ప నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్, సుధాకర్ రెడ్డి, స్రవంతి రవి కిషోర్, కె ఎల్ నారాయణ, యూవీ క్రియేషన్స్ వంశీ, భోగవల్లి ప్రసాద్

నటులు:- వెంకటేష్, నితిన్, వరుణ్ తేజ్, కిరణ్ అబ్బవరం, శివ బాలాజీ దర్శకులు:- వీర శంకర్, సాయి రాజేష్, వశిష్ట , త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, బాబీ, వంశీ పైడిపల్లి, ప్రశాంత్ వర్మ. తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, సెక్రటరీ దామోదర్ ప్రసాద్ హాజరయ్యారు.

Image

Image

పుష్ప-2 సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగింది. ఇది సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. అల్లు అర్జున్ అరెస్టుతో పీక్స్‌కు చేరింది. పరిస్థితి మరింత దారుణంగా మారుతున్న టైంలో ఎఫ్‌డిసి ఛైర్మన్ దిల్ రాజు లీడ్ తీసుకొని వివాదాన్ని కొలిక్కి తెచ్చారు. దీంతో చర్చలకు ప్రభుత్వ పెద్దలు, సినిమా ప్రముఖులు అంగీకరించారు. అందులో భాగంగా ఇవాళ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెంగళూరు వెళ్లాల్సి ఉన్నందున కేవలం గంట గంటన్నర టైం మాత్రమే ఇచ్చారని టాక్ నడుస్తోంది. ఈ సమావేశంలో గద్దర్ అవార్డ్స్, సంధ్య థియేటర్ ఘటన, బెనిఫిట్ షో‌ల రద్దు, చిన్న మధ్య స్థాయి సినిమాలకు థియేటర్స్ కేటాయింపు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేసే సినిమాల ప్రోత్సాహకాల వియంపై సీఎంతో చర్చించారని అంటున్నారు.

తరవాత కథనం