Hari Hara Veera Mallu First Song: డిసెంబర్ 31 అర్థరాత్రి…కొత్త ఏడాదికి స్వాగతం పలికే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూ మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు పవర్ స్టార్. గడిచిన ఎన్నికల్లో తన పార్టీ జనసేన తరపున బరిలోకి దిగిన అందర్నీ గెలిపించుకుని రాజకీయాల్లోనూ పవర్ స్టార్ అనిపించుకున్నారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ప్రజా సేవలో బిజీగా ఉన్నారు. దీంతో షూటింగ్స్ కి చిన్న బ్రేక్ తీసుకున్నారు. అందుకే 2024లో పవన్ సినిమా ఒక్కటీ రిలీజ్ కాలేదు. ప్రస్తుతం హరిహరవీరమల్లు, ఓజీ సెట్స్ పై ఉన్నాయ్. ఈ రెండు సినిమాలు 2025 సమ్మర్లో బ్యాక్ టు బ్యాక్ సందడి చేయనున్నాయ్. ఇప్పటికే హరిహరవీరమల్లు మూవీ రిలీజ్ కి 2025 మార్చి 28 డేట్ ఫిక్స్ చేశారు. ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే OG కూడా రాబోతోంది. ఇంతకీ పవర్ స్టార్ కొత్త ఏడాది సందర్భంగా ఇస్తోన్న ట్రీట్ ఏంటంటే.. హరిహరవీరమల్లు నుంచి ఫస్ట్ సాంగ్..అది కూడా పవన్ పాడినది..
పాట పాడిన పవన్
హరిహరవీరమల్లు నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్ అదుర్స్ అనిపించాయ్. ఆ మధ్య దసరా టైమ్ లో ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఆ మూవీ నుంచి పెద్దగా అప్ డేట్స్ లేవు. అందుకే 2024 మొత్తం సిల్వర్ స్క్రీన్ పై కనిపించని పవన్..2025 ఆరంభంలోనే అభిమానులను అలరించాలని ప్లాన్ చేసుకున్నారు. అందుకే హరిహరవీమల్లులో తాను పాడిన పాట న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మొదలయ్యే టైమ్ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే హరిహరవీమరల్లు షూటింగ్ దాదాపు పూర్తైంది. ఈ సినిమా నుంచి మొదటి పాటను డిసెంబర్ 31 అర్థరాత్రి 12 గంటలకు న్యూ ఇయర్ కి వెల్కమ్ చెబుతున్న టైమ్ లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. దీనిపై ఇంకా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది
అన్నీ సూపర్ హిట్ సాంగ్స్
పవన్ కళ్యాణ్ తన మూవీస్ లో సాంగ్స్ పాడడం ఇదేం ఫస్ట్ టైమ్ కాదు.గతంలో ఖుషి, తమ్ముడు, అత్తారింటికి దారేది సహా తన మూవీస్ లో సాంగ్స్ తో పాటూ తన మూవీస్ లో చిన్న చిన్న బిట్ సాంగ్స్ కూడా ట్రై చేశాడు..ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించాడు. పైగా పవన్ పాడిన సాంగ్స్ అన్నీ సూపర్ హిట్‌గా నిలువడమే కాదు.. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమాలు హైప్ క్రియేట్ చేశాయి.
హరిహరవీరమల్లు మూవీలో హైలెట్స్ ఇవే
షూటింగ్ దాదాపు పూర్తైన ఈ మూవీలో హైలెట్ సీన్స్ అంటే.. క్లైమాక్స్ లో వచ్చే రెడ్ డ్రెస్ ఫైట్. ఈ ఒక్క ఫైట్ కోసం 42 రోజుల పాటూ కేటాయించారట. ఇంకా ఇంట్రో సాంగ్, టైగర్ ఫైట్, మహల్ యాక్షన్ పార్ట్, కుస్తీ ఫైట్ సీన్, చార్మినార్ యాక్షన్ సీన్స్, క్లైమాక్స్ సీన్స్ థియేటర్లో మోత మోగిపోతాయ్ అంటున్నారు.
హరిహరవీరమల్లుకి ఫస్ట్ క్రిష్ డైరెక్టర్ గా ఉన్నారు..ఆ తర్వాత ఆ ప్లేస్ లో… నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. మరి 2025 ఆరంభంలో పవన్ ఇస్తోన్న ట్రీట్ ఎలా ఉండబోతోందో తెలియాలంటే న్యూ ఇయర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ చేయాల్సిందే..
Pavitra lokesh: పవిత్ర మాటలను అపవిత్రం చేసేశారు.. మరీ ఇంత అరాచకంగా ఉన్నారేంట్రా బాబూ!