కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నాం. 2024లో హైలెట్స్ ఇవే అంటూ మీడియాలో వరుస కథనాలొస్తున్నాయ్. జరిగిందేదో జరిగిపోయింది మరి ఫ్యూచరేంటి? అది కదా ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఏం కావాలన్నా క్షణాల్లో సమాచారం ఇచ్చేస్తోన్న AI టూల్స్, చాట్ బోట్లను అడిగితే ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాయ్.
నూతన సంవత్సరం 2025లో తెలుగు రాష్ట్రాల్లో ఏం జరగబోతోంది?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయ్?
ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి సమస్యలు తీరుతాయా?
సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండబోతోంది?
OTTల హవా పెరుగుతుందా – తగ్గుతుందా…ఎలాంటి కెంటెంట్ ఉండబోతోంది?
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పిన చాట్ జీపీటీ…చాలావరకూ నిజమే అనిపించే సమాధానాలు చెప్పింది..మరికొన్ని ఆన్సర్స్ మాత్రం ఆశ్చర్యపోయేలా ఉన్నాయ్.
ఏపీలో 2025 లో ఏం జరగబోతోంది?
@ ఏపీలో మార్పుల గురించి చాట్ జీపీటీ చెప్పిన విషయాలు చాలావరకూ వాస్తవానికి దగ్గరగా ఉన్నాయంటున్నారు నెటిజన్లు.
@ 2025లో అమరావతిని బాగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతాయి
@ ఏపీ రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు ఎవ్వరూ ఊహించంత జోరుగా జరిగిపోతాయ్
@ ప్రాంతాల మధ్య ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు విశాఖను ఐటీ హబ్ గా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయ్
@ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నట్టు ప్రజలకు అర్థమవుతోంది..ఇలాంటి టైమ్ లో జగన్ ..రాజధాని గురించి మాట్లాడేందుకు సాహసం చేయరు
@ అధికారపార్టీని నిలదీసేందుకు తగ్గాల్సి రావడమే కాదు పార్టీని నిలబెట్టుకునేందుకు వైసీపీ అధినేత జగన్ విశ్వప్రయత్నాలు చేయాల్సి వస్తుంది
@ జనం మధ్య ఆదరణ కోల్పోకుండా ఉండేందుకు జగన్ మళ్లీ భారీ ర్యాలీలు, సమావేశాలతో జనం మధ్య తిరిగే అవకాశం ఉంది
@ కూటమి బంధం బాగా బలపడుతుంది కానీ జనసేన వచ్చే ఎన్నికల్లో కూటమితో వెళ్లాలా ఒంటరిగా వెళ్లాలా అని ఆలోచిస్తుంది
@ తమ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందన్న ఆవేదన, ఆందోళన రాయలసీమ ప్రజల్లో పెరుగుతుంది
తెలంగాణలో 2025 లో ఏం జరగబోతోంది?
@ తెలంగాణలో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది.. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారుతుంది
@ రాష్ట్రంలో నిరుద్యోగుల ఆందోళనలు పెరుగుతాయి..విద్యార్థి సంఘాలు ఉద్యమిస్తాయి
@ రాష్ట్రంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు BRS అన్ని ప్రయత్నాలు చేస్తుంది
@ సొంత పార్టీలో సరైన ఆదరణ లేదన్న బాధతో..BRS నుంచి చాలా మంది నేతలు కాంగ్రెస్ లో చేరుతారు
@ హైదరాబాద్ లో ఐటీ రంగం మరింత విస్తరిస్తుంది..సేమ్ టైమ్.. టైర్-2 నగరాలైన వరంగల్, నిజామాబాద్‌లలో టెక్ పార్కులు ఏర్పాటవుతాయి
@ సాగర్ జలాల వివాదం కొనసాగుతూనే ఉంటుంది.. కేంద్ర జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది
ఇండస్ట్రీలో వచ్చే మార్పులివే
@ చంద్రబాబు బయోపిక్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయ్..
@ తెలుగు హీరోలు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీస్ పై ఆసక్తి చూపిస్తారు..ఆ తరహా కథనాలు పెరుగుతాయ్
@ ఓటీటీల రేంజ్ మరింత పెరుగుతుంది..బోల్డ్ కంటెంట్ విపరీతంగా వైరల్ అవుతుంది
ఇవన్నీ చాట్ జీపీటీ అంచనా ప్రిడిక్షన్స్ మాత్రమే..వీటిలో ఎన్ని జరుగుతాయో జరగవో అన్నది వాస్తవంగా ధృవీకరించలేం…
Pavitra lokesh: పవిత్ర మాటలను అపవిత్రం చేసేశారు.. మరీ ఇంత అరాచకంగా ఉన్నారేంట్రా బాబూ!