సుధీర్ గాజువాకలో ఉద్యోగం చేస్తున్నాడు. రోజూ ఉదయాన్నే 9 గంటలకు మధురవాడలో బయల్దేరడం గాజువాకలో దిగడడం కామన్. ఆయన టికెట్ 30 రూపాయలే. అందుకే చాలా సార్ల కండక్టర్‌కు ఐదు వందలు, వంద ఇచ్చి టికెట్ తీసుకుంటా ఉంటాడు. కొన్నిసార్లు కండక్టర్ చిల్లర ఇస్తుంటాడు… మరికొన్ని సార్లు టికెట్ వెనకాల రాస్తుంటాడు. సుధీర్ బస్ ఎక్కినప్పుడు ఖాళీగానే ఉంటుంది. కాసేపు ఆగిన తర్వాత బస్ ఫుల్ రష్ అవుతుంది. సుధీర్ దిగే సరికి కండక్టర్ ముందు ఉండటమో మధ్యలో ఉండటం వల్లనో లేకుంటే హడవుడిగా దిగిపోవడమో చేస్తుంటాడు. దీని కారణంగా కండక్టర్ వద్ద డబ్బులు ఉండిపోతున్నాయి.
నెలలో రెండు మూడు సార్లు ఇదే సమస్యను సుధీర్ ఫేస్ చేశాడు. టికెట్ కాస్ట్ కంటే ఎక్కువగానే వదులుకోవాల్సి ఉంటుంది.
ఈ సమస్య ఒక్క సుధీర్‌దే కాదు.దీన్ని చాలా మంది ఫేస్ చేస్తుంటారు. ఇలా కండక్టర్‌కు నోట్లు ఇచ్చి చిల్లర మర్చిపోవడం కామన్. కొందరు నిద్రపోయి సడెన్‌గా లేచి బస్ దిగేస్తారు. మరికొందరు మొబైల్ చూసుకొని మర్చిపోయి దిగేస్తుంటారు. అయితే కొందరు ఐదు రూపాయలే కదా పది రూపాయలేకదా అని అనుకుంటారు. అదే ఐదు రూపాయలు లేకుంటే కండక్టర్ మీకు బస్ ఎక్కిస్తాడా. అందుకే పైసా అయినా ఎందుకు వదులుకోవాలి. అందుకే ఈ చిన్న ట్రిక్ పాటిస్తే డబ్బులు మీకు వస్తాయి.
ఇలాంటి వారి కోసమే ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఓ ఆన్లైన్ ఫెసిలిటీ కల్పించింది. నేరుగా ఫోన్ చేసి డబ్బులు తెప్పించుకునే సౌకర్యం ఉంది. 08662570005 లేదా 08662570149 నెంబర్‌కు ఫోన్ చేస్తే చాలు మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి.
ముందుగా ఈ నెంబర్‌కు ఫోన్ చేస్తే ఏం జరిగిందో అడుగుతారు. వెంటనే ఆ టికెట్‌పై ఉన్న కండక్టర్ కోడ్ నంబర్ అడుగుతారు. ఆ నెంబర్ చెబితే సాయంత్రానికి మీ డబ్బులు ఈ అకౌంట్లో పడతాయి. ఆర్టీసీ వాళ్లు మీరు చెప్పిన COND కోడ్‌తో సదరు కండక్టర్‌కు ఫోన్ చేస్తారు. ఆయన వద్ద ఉన్న వివరాలు తెలుసుకుంటారు. నిజమో కాదో నిర్దారించుకుంటారు. ఓకే అన్ని సరిపోయిన తర్వాత కండక్టర్ ఫోన్ నెంబర్ మీకు ఇస్తారు. మీరు కాల్ చేసి మాట్లాడి మీ అకౌంటర్ వివరాలు, లేదా యూపీఐ వివరాలు చెబితే డబ్బులు వేయమని చెప్పాలి. అలా వేయకపోతే మరోసారి ఫిర్యాదు చేయవచ్చు.
తెలంగాణలో కూడా ఇలాంటి సౌకర్యం ఉంది. అక్కడ కూాడా ఓ ఫోన్ చేస్తే మీ డబ్బులు మీకు వస్తాయి. ప్రక్రియ మాత్రం పైన చెప్పినట్టే చేయాల్సి ఉంటుంది. ఆ నెంబర్ కాకుండా వేరే నెంబర్‌కు ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోన్ చేయాల్సిన నెంబర్ 040-69440000. దీనికి ఫోన్ చేసి పైన చెప్పిన ప్రొసీజర్ ఫాలో అయితే మీ డబ్బులు మీకు వెంటనే వస్తాయి. లేకుంటే సమీపంలో ఉన్న ఆర్టీసీ డిపోకు వెళ్లి కూడా ఫిర్యాదు చేయవచ్చు. మీకు కండక్టర్ రాసిన టికెట్ మాత్రం జాగ్రత్తగా దాచుకోవాలి. లేకుంటే మాత్రం కచ్చితంగా మీ డబ్బులు పోయినట్టే