Sukanya Samriddhi Yojana: ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని పెద్దలు ఊరికే అనలేదు. నేటి కాలంలో ఇల్లు కట్టాలన్నా పెళ్లి చేయాలన్నా చాలా కష్టంగా మారింది. ముఖ్యంగా ఆడపిల్ల పెళ్లి చేయడం అంటే మామూలు విషయం కాదు. కట్నాలు కానుకలు, ఖర్చులు. చాలానే ఉంటాయి. ఒకస్థాయి వ్యక్తులే ఆడపిల్ల పెళ్లి చేయడానికి అల్లాడిపోతారు. ఇలాంటి ఆడపిల్ల పెళ్లికి ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది అంటే చాలా మందికి అర్థం కాదు. లక్షా రెండు లక్షలో కాదు. ఏకంగా 50 లక్షలు ఇస్తుంది అంటే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. నిజమే కచ్చితంగా 50కిపైగానే మీ అమ్మాయి పెళ్లికి ప్రభుత్వం నుంచి రానుంది.
పిల్లల్ని చదివించడం ఎంత కష్టమో వారిని ఓ పెళ్లి చేయడం అంతే కష్టం. అందుకే ప్రభుత్వం ఓ స్కీమ్ ప్రవేశ పెట్టింది. మీ స్థోమతకు తగ్గట్టు చదివించుకోండి… పెళ్లి బాధ్యత మేం చూసుకుంటామని చెబుతోంది. కానీ మీరు నెలకు ఎంతో కొంత పొదుపు చేస్తే చాలని చెబుతుంది. ఇలాంటివి చాలా చూశామని ఇక్కడితే ఆపేసిన వాళ్లు రేపు కుమార్తె పెళ్లికి ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే చివరి వరకు చదివిన తర్వాత మీరు కూడా కచ్చితంగా ఇది మంచి స్కీమ్ అని పది మందికి షేర్ చేస్తారు.
దీని కోసం మీరు భారీగా మీ ఖర్చును తగ్గించుకోవాల్సిన పని లేదు. మీరు నెలలో ఒకసారి హోటల్ బిల్లు పెడితే చాలు ఊహించని తీరుగా మీ కూతురి పెళ్లి చేయవచ్చు. అవును నిజమే. ప్రతి ఏటా 250 రూపాయల నుంచి లక్షా యాభై వేల రూపాయల వరకు మీరు పొదుపు చేయవచ్చు. దీనికి ప్రభుత్వం ఏటా 8.2 శాతం వడ్డీ చెల్లిస్తుంది. మీరు సాధారణంగా చేసే పొదుపు కంటే ఎక్కువన్నమాట.
ఈ పథకం పేరు సుకన్య సమృద్ధి యోజన. ఇంతకు ముందే చాలా మంది మీకు పథకం గురించి చెప్పి ఉంటారు కానీ. ఇంత వివరంగా ఎవరూ చెప్పి ఉండరు. ఒకసారి మొత్తం చదివిన తర్వాత మీరు మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. ఈ స్కీమ్‌లో మీరు నెల నెల డబ్బులు పొదుపు చేసినా ఫర్వాలేదు. లేకుంటా ఏడాదికోసారి పొదుపు చేసినా ఫర్వాలేదు. అది మీ ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు.
ఇలా నెలల లేదా ఏడాదికోసారి చేసే పొదుపు మీ అమ్మాయి 21ఏళ్లు వచ్చిన తర్వాత మెచ్యూర్ అవుతుంది. అప్పుడు మీరు ఊహించని భారీ మొత్తంలో చేతికి అందుతుంది.. అప్పటికి ఆ సొమ్ముతో పెళ్లైనా చేయవచ్చు. అప్పటి వరకు ఈ సొమ్ము పెరుగుతూనే ఉంటుంది.
మీరు 2025 జనవరి నుంచి మీ పాప పేరు మీద సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరిచి డబ్బులు డిపాజిట్ చేయడం స్టార్ట్ చేస్తే ఎంత వస్తుందో ఓసారి చూద్దాం. మీరు నెలకు కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే డిపాజిట్ చేస్తే 2046 అంటే మీ పాపకు 21 ఏళ్లు వచ్చేసరికి 2,87,285 రూపాయలు వస్తుంది. అది కూడా మీరు ఈ నెలకు ఐదు వందల రూపాయలు 15 ఏళ్లు కడితే సరిపోతుంది.
అదే మీరు ఏడాదికి 12000 డిపాజిట్ చేస్తే దాదాపు 5,74,569 వేల రూపాయలు వస్తుంది. అలా మీరు పెంచుకున్న నగదును బట్టి మీకు డబ్బులు పెరుగుతూ ఉంటాయి. అదే నెలకు 12000 జమ చేస్తే అన్నీ కలుపుకొని మీకు దాదాపు 70 లక్షల రూపాయలు మీరు మీ కుమార్తె పెళ్లి కోసం జమ చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి ట్యాక్స్ కూడా ఉందు.
సుకన్య సమృద్ది యోజనలో వచ్చిన డబ్బును మీరు మీ కుమార్తె పెళ్లికైనా వడుకోవచ్చు. లేదా మీరు కుమార్తె చదువు కోసమైనా వాడుకోవచ్చు. మీరు ఎక్కడ పొదుపు చేసినా సరే మీరు ఎంతోకొంత ట్యాక్స్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. 2046 అంటే అప్పుటి పరిస్థితి బట్టి ట్యాక్స్ రేట్‌లు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందుకే మధ్యతరగతి వాళ్లకు ఇది బెస్ట్ ప్లాన్.
ఈ సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరవడం చాలా సులభం. మీకు దగ్గరోలో ఉన్న పోస్టాఫీస్‌కు, లేదా బ్యాంకుకు వెళ్లి అప్లికేషన్ తీసుకుంటే సరిపోతుంది. మీ వివరాలతోపాటు, మీ కుమార్తె వివరాలు అందులో నింపి పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, ఐడీ కార్డు, అడ్రెస్ ప్రూఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. మొదట 250 రూపాయలతో ఖాతా యాక్టివేట్ చేసుకోవాలి. తర్వాత మీరు స్థాయిని బట్టి నగదు పెంచుకోవచ్చు.