Retro Pooja Hegde: పాపం.. పూజా హెగ్డే కన్నా జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్ బెటరట!

image credit: Instagram

Retro Pooja Hegde: నీ కాళ్లను పట్టుకువదలనన్నవి చూడే నా కళ్లు అన్నారు..బుట్టబొమ్మ అని ముద్దుగా పేరు పెట్టేశారు.. పొడుగు కాళ్లు చూసి రెప్పవేయడం మర్చిపోయారు..అలాంటి అభిమానులకు రెట్రో మూవీలో లుక్ తో చాచికొట్టింది పూజా హెగ్డే. ఒక్కసారిగా కల లోంచి లేచి కూర్చున్నట్టు అవాక్కై ఒకర్నొకరు గిల్లి చూసుకున్నారు. ఏందిరా మనం చూస్తున్నది పూజా హెగ్డేనేనా? ఆ బుట్ట బొమ్మేనేనా? క్యారెక్టర్ డిమాండ్ చేస్తే లుక్ మార్చుకోవచ్చు కానీ మరీ ఇంతలా మారిపోయిందా? వామ్మో…మా వల్ల కాదు పూజా అంటూ దేవుడికి దండం పెట్టుకుంటున్నారు ఫ్యాన్స్..

సౌత్ ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది పూజా హెగ్డే. కెరీర్ ఆరంభంలో ఐరెన్ లెగ్ అనిపించుకున్నా ఆ తర్వాత ఓ ఊపు ఊపేసిన హీరోయిన్స్‌లో డస్కీ బ్యూటీ పూజా హెగ్డే కూడా చేరింది. బాలీవుడ్ లోనూ సినిమాలు కూడా చేసింది కానీ టాలీవుడ్ లో వచ్చిన బ్రేక్ మాత్రం ఏ ఇండస్ట్రీలో కూడా రాలేదు. అక్కినేని, మెగా హీరోలందరితోనూ నటించేంసింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరో ఈమెతో కలసి నటిస్తే హిట్ పక్కా అనిపించుకుంది.

టాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండే పూజా వెలుగు ఒక్క సారిగా తగ్గిపోయింది. రష్మిక, శ్రీలీల, మీనాక్షి సహా నయా తారలు దూసుకురావడంతో పూజా సైడైంది. అటు ఇతర భాషల్లోనూ పెద్దగా అవకాశాలు రాలేదు. ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతోంది. ఆమెలేటెస్ట్ మూవీ సూర్య – కార్తీక్ సుబ్బరాజ్ కాంబోలో వస్తోన్న రెట్రో. గ్యాంగ్‌స్టర్ లవ్ డ్రామా తెరెకక్కుతోన్న రెట్రో నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో పూజా చాలా నార్మల్ లుక్ లో ఉంది. ఇప్పుడు ఈ లుక్కే ఆమెపై ట్రోల్స్ వెల్లువెత్తేలా చేసింది.

పూజా ఫేస్ లో వచ్చిన మార్పులు..మునుపటి మెరుపు అస్సలు కనిపించడం లేదు..పైగా డీగ్లామర్ లుక్ కి బాప్ లా ఉంది రెట్రోలో పూజా. ఆ ముఖం చూడలేకపోతున్నాం బాబోయ్ అని ట్రోల్స్ స్టార్ట్ చేశారు నెటిజన్లు. మరికొందరైతే జబర్థస్త్ శాంతిస్వరూప్ ఈమెకన్నా బెటర్ అంటున్నారు. ఆ ఒక్క ఫ్రేమ్ ని రీ పోస్టులు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఏదో ‘తేడా’గా ఉందంటూ చెలరేగిపోతున్నారు.

లాంగ్ గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇస్తోన్న పూజాకి ఇలాంటి ట్రోల్స్ జరగడం ఓ రకంగా ప్రచారమే అయినా ఆమె ఫ్యూచర్ ఆఫర్లకు మైనస్ అయ్యే ఛాన్సుంది అంటున్నారు. వాస్తవానికి హీరోయిన్ల డీ గ్లామర్ లుక్ కొత్తేం కాదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలంలో సమంత, పుష్ప సినిమాల్లో రష్మిక మందన్నా ఇలానే ఉన్నారు. దేవరలో జాన్వి కపూర్ కూడా కాస్త అటు ఇటుగా ఇలానే ఉంది. కాకపోతే అంతకుమించి అనేలా పూజాను తయారు చేశాడు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ . అందుకే కాస్త లుక్ మార్చవయ్యా అంటున్నారు నెటిజన్లు.

టాలీవుడ్ లో వరుసగా ఫెయిల్యూర్స్ అందుకున్న పూజ హిందీలో రణ్‌వీర్‌ సింగ్‌తో చేసిన సర్కస్, సల్మాన్ ఖాన్ కిసీ కా భాయ్ కిసీ కి జాన్ కూడా ఫ్లాప్ అయ్యాయి. వరుస డిజాస్టర్స్ లో ఉన్న టైమ్ లో ఇలా సూర్య రెట్రో మూవీతో సౌత్ లో వెలగాలని ఆశపడుతోంది.. మరి పూజా కి లక్ కలిసొస్తుందా? ఈ లుక్ మైనస్ అవుతుందా? వెయిట్ అండ్ సీ..

తరవాత కథనం