బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆడుతున్న బాక్సింగ్‌డే టెస్టులో మొదటి రెండు రోజులు ఆస్ట్రేలియా దుమ్మురేపింది. మూడు రోజు ఆస్ట్రేలియాకు తెలుగు కుర్రాడు చుక్కలు చూపించాడు. టెస్టుల్లో తన మొదటి సెంచరీ చేసుకున్న నితీష్‌కుమార్ రెడ్డి ఆసిస్ బౌలర్లకు ఏమాత్రం దొరక్కుండా జాగ్రత్తగా ఆడుతూ టఫ్ బ్యాటర్‌గా మారాడు. ఫాలో ఆన్ తప్పదేమో అనుకుంటున్నటైంలో అడ్డుగోడలా నిలబడటమే కాకుండా మంచి టీమిండియాను రేస్‌లో ఉంచాడు.
నాల్గో రోజు ఆదిలోనే టీమిండియా ఆఖరి వికెట్ తీసేసిన ఆస్ట్రేలియా ఆనందాన్ని బుమ్రా ఆవిరి చేశాడు. ఆస్ట్రరేలియాను చావు దెబ్బతీయడమే కాకుండా కొత్త రికార్డు సృష్టించాడు. ట్రావిస్ హెడ్ వికెట్ తీసి 200 టెస్టు వికెట్లు తీసుకున్న బౌలర్‌గా రికార్టు నెలకొల్పాడు. 44వ టెస్టులో ఈ ఘనత సాధించాడు.
ఈ వికెట్‌తో అనేక రికార్డులను నెలకొల్పాడు బుమ్రా. టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ సగటుతో 200 వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్‌గా కొత్త చరిత్ర లిఖించాడు. ఇప్పటి వరకు ఆ క్లబ్‌లో వెస్టిండీస్ బౌలర్ మాల్కమ్ మార్షల్, జోయెల్ గార్నర్, ఆంబ్రోస్ తోపాటు గ్లడ్ బౌలర్ ఫ్రెడ్ ట్రూమెన్ ఉన్నారు. వారిని కూడా బుమ్రా వెనక్కి నెట్టేశాడు.
తక్కువ పరుగులు ఇచ్చి 200 వికెట్లు తీయడమే కాకుండా స్ట్రైక్ రేటు పరంగా కూడా అందరి కంటే మెరుగ్గా ఉన్నారు. టాప్‌లో ఉంది మాత్రం సౌతాఫిర్కాకు చెందిన కగిసో రబాడా. జస్‌ప్రీస్ బుమ్రా – 19.38 యావ్‌రేజ్ ఉంటే… మాల్కమ్ మార్షల్ – 20.94, జోయెల్ గార్నర్ – 20.97, ఆంబ్రోస్ – 20.99, ఫ్రెడ్ ట్రూమెన్ – 21.57 యావ్‌రేజ్ ఉంది.
తక్కువ మ్యాచ్‌లు ఆడి రెండు వందలు వికెట్లు తీసిన భారత్ బౌలర్లలో అశ్విన్ టాప్‌లో ఉన్నాడు. అతను 37 టెస్టుల్లో ఈ ఘనత సాధిస్తే బుమ్రా 44 టెస్టులు ఆడాడు. అతనితోపాటు జడేజా కూడా 44 టెస్టులుల ఆడాడు. మాల్కమ్ మార్షల్ 81 మ్యాచ్‌లు ఆడితే.. జోయెల్ గార్నర్ 58, ఆంబ్రోస్ 98 టెస్టులలు ఆడి రెండు వందల వికెట్లు తీసుకున్నారు. ప్రపంచ టెస్టు క్రికెట్ చరిత్రలో పాక్ బౌలర్ యాసిర్ షా 33 మ్యాచుల్లోనే 200 వికెట్లు తీసిన రికార్డు కూడా ఉంది.
ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన వన్డేలో 2016 జనవరిలో బుమ్రా కెరీర్ స్టార్ చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో 2018 జనవరి 5న బుమ్రా ఎంట్రీ ఇచ్చాడు. 44 బుమ్రా 12 సార్లు 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు. ఇంగ్లండ్‌తో 2022లో ఓవల్‌లో జరిగిన వన్డే మ్యాచ్‌లో బుమ్రా మొదటి పది ఓవర్లలో కేవలం 9 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు.
మూడో రోజు బాక్సింగ్ డే టెస్టులో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి – సెంచరీతో సత్తా చాటాడు. అవతలి ఎండ్‌లో వికెట్లు పడుతున్నప్పటికీ ధాటిగా సెంచరీ చేశాడు. ఈ టోర్నీతోనే టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చిన నితీష్ తొలి టెస్టు నుంచి కూడా ఆకట్టుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన నితీశ్ కుమార్ రెడ్డి 2023 సీజన్‌తో ఐపీఎల్‌లో అడుగు పెట్టాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 13 మ్యాచ్‌లాడిన నితీశ్ 303 పరుగులు చేసి 3 వికెట్లు తీశాడు. జనవరిలో రంజీ ట్రోఫీలో ముంబయితో జరిగిన మ్యాచ్‌లో నితీశ్ కుమార్ ఐదు వికెట్లు తీశాడు.