Game Changer Review : అసలైన గేమ్ ఛేంజర్ అంజలి..చరణ్ విశ్వరూపం- గేమ్ ఛేంజర్ రివ్యూ!

image credit:X

Game Changer Review : రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్లో వస్తోన్న గేమ్ ఛేంజర్ మూవీపై బజ్ క్రియేట్ అయింది. శంకర్ దర్శకుడు అనగానే సినిమా ఎలా ఉంటుందో అనే టెన్షన్ రామ్ చరణ్ ఫ్యాన్స్ లో ఉంది. సుకుమార్ రివ్యూ ఇచ్చినప్పటి నుంచీ వరుస రివ్యూస్ బయటకొస్తున్నాయ్. సినిమాలో హైలెట్స్ ఇవే అంటూ పెద్ద హడావుడి జరుగుతోంది. దిల్‌ రాజు బ్యానర్‌లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో హయ్యెస్ట్ బడ్జెట్‌ సినిమాగా వస్తోంది గేమ్ చేంజర్. డైరెక్టర్ శంకర్ లేటెస్ట్ మూవీస్ లా కాదు..గత చిత్రాలను గుర్తుచేసేలా గేమ్ ఛేంజర్ ఉండబోతోందని నమ్మకంగా చెబుతున్నారు యూనిట్ సభ్యులంతా.

రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ లో నటిస్తోన్నాడు. తండ్రి కొడుకుగా మొదటిసారి చరణ్ నటిస్తున్న మూవీ ఇది. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా.. RRR తో చరణ్ క్రియేట్ చేసుకున్న క్రేజ్ మరింత పెరిగేలా సినిమా తెరకెక్కించాడట శంకర్. ఈ సినిమాలో చరణ్ కి జోడీగా ఇద్దరు ముద్దుగుమ్మలు నటించారు. తండ్రి చరణ్ కి జోడీగా అంజలి, కొడుకుచరణ్ కి జోడీగా మరోసారి కియారా అద్వాని నటించారు. ఈ జంటలు చూడముచ్చటగా ఉంటాయని టాక్.

ఈ సినిమాలో నిజమైన గేమ్ ఛేంజర్ అంటే అంజలి అని షాకిచ్చారు యూనిట్ సభ్యులు. అంజలి ఈ సినిమాలో అత్యంత కీలక పాత్రలో నటిస్తోందని సెకండ్‌ హాఫ్‌లో వచ్చే సన్నివేశాల్లో అంజలి క్యారెక్టర్ కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమాలో అసలైన గేమ్ ఛేంజర్ అంజలి అని…ఆమె వల్లే సినిమా టర్న్ అవుతుందన్నది లేటెస్ట్ టాక్. ఆమె క్యారెక్టర్ కొద్దిసేపే ఉంటుంది కానీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందట.ఈ మధ్య ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటిస్తూ వస్తోంది అంజలి.. చాలా కాలం తర్వాత స్టార్‌ హీరోకు జోడీగా నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఈ మూవీతో అంజలి ఈజ్ బ్యాక్ అనిపించుకోవడం ఖాయం అంటున్నారు మూవీ టీమ్…

కియారా అద్వానీ గతంలో చరణ్ తో కలసి వినయ విధేయ రామలో నటించింది. ఆ మూవీలో ఆన్ స్క్రీన్ పై జోడీ బావుంది అనిపించింది కానీ హిట్ పడలేదు. గేమ్ ఛేంజర్లో చరణ్ కాలేజీ స్నేహితురాలిగా కనిపిస్తోంది. కియారా పాత్ర సరదాగా సాగిపోతోంది…పాటలకే పరిమితమవుతుందని టాక్. అంజలి క్యారెక్టర్ మాత్రం ఆమె కెరీన్ ను మార్చేస్తుంది.

ఒక్కో క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ సినిమాపై హైప్ పెంచుకుంటూ వెళుతున్నారు మూవీ టీమ్. జనవరి 1న ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ పది రోజుల్లో వరసుగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సాంగ్స్ టీజర్లతో ప్రమోషన్ హోరెత్తించనున్నారు.

ఇప్పటికే బెజవాడలో గేమ్ ఛేంజర్ ఫీవర్ ఓ రేంజ్ లో ఉంది. విజయవాడలో మెగా పవర్ స్టార్ 256 అడుగుల కటౌట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన దిల్ రాజు మాట్లాడుతూ సినిమాపై రివ్యూ ఇచ్చేశాడు. ‘ఈ సంక్రాంతికి మామూలుగా కొట్టడం లేదని అభిమానులకు చెప్పండి. మెగా పవర్ స్టార్‌ లో ‘మెగా’ని, ‘పవర్‌’ని కూడా గేమ్ చేంజెర్ లో చూస్తారని ఇప్పటికే చిరంజీవి చెప్పారని దిల్ రాజు మరింత హైప్ పెంచేశారు. జనవరి 10న చరణ్ నట విశ్వరూపం చూసేందుకు సిద్ధంగా ఉండండని భరోసా ఇచ్చారు దిల్ రాజు..

తరవాత కథనం