Happy New Year 2025 Wishes: నూతన సంవత్సర శుభాకాంక్షలు.. మీ స్నేహితులు, సన్నిహితులకు ఇలా చెప్పేయండి!

image credit: Pixabay

Happy New Year 2025 Wishes in Telugu:  న్యూ ఇయర్ కి స్వాగతం పలికేందుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారంతా. ఇంకెందుకు ఆలస్యం ఇలా శుభాకాంక్షలు చెప్పేయండి

నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. 2024కి గుడ్ బై చెప్పేసి 2025కి స్వాగతం పలికే క్షణాలు అద్భుతంగా ఉండాలని అంతా ఆకాంక్షిస్తారు. అందుకే కొత్త ఏడాదిలో ప్రతి అడుగు ఆనందంగా ఉండాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ కొటేషన్స్ తో శుభాకాంక్షలు చెప్పేయండి.

@ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా…
విఘ్ననాధుడి కరుణ మీపై ఎప్పటికీ ఉండాలి
నూతన సంవత్సర శుభాకాంక్షలు

@ ఈ కొత్త సంవత్సరంలో మీకు అంతా మంచే జరగాలి, మీ కలలన్నీ నిజం కావాలి, సంతోషం, అదృష్టం అన్నీ మీకు దక్కాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు

@ 12 నెలలు సంతోషంగా, 52 వారాలు ఆరోగ్యంగా, 365 రోజులు విజయవంతంగా, 8760 గంటల మస్తీగా, 52600 నిమిషాల ప్రశాంతంగా, 3153600 సెకన్లు మీ జీవితంలో సంతోషం మాత్రమే ఉండాలి… హ్యాపీ న్యూ ఇయర్

@ 2025లో మ కలలన్నీ నెరవేరాలి, మీ భవిష్యత్తు అందంగా వెలిగిపోవాలి… హ్యాపీ న్యూఇయర్ మై ఫ్రెండ్

@ 2024 మీకు అన్ని సంతోషాలు, విజయాలు తీసుకురావాలిని ఆకాంక్షిస్తూ హ్యాపీ న్యూ ఇయర్ 2025

@ చేదు జ్ఞాపకాలను వదిలేయండి..కొత్త ఆశలతో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టండి. నూతన సంవత్సరంలో మన స్నేహం మరింత బలపడాలి

@ కొత్త సంవత్సరంలో మొదటి రోజు మొదటి పేజీలో ఆనందం వెల్లివిరియాలని రాస్తున్నా…మిగిలిన పేజీలన్నీ ఈరోజులానే సాగాలని ఆకాంక్షిస్తూ నూతన సంవత్సవ శభాకాంక్షలు 2025

@ 2025 మీ జీవితంలో కొత్త మార్పు తీసుకురావాలి, కొత్త శక్తిని నింపాలి..సకల సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ హ్యాపీ న్యూ ఇయర్ 2025

@ ఎన్నేళ్లు గడిచినా మన స్నేహం చెక్కుచెదరకూడదు. నువ్వు కోరుకున్నవన్నీ జరగాలి..నీ ఆశలు నెరవేరాలని కోరుకుంటూ నూతన సంవత్స శుభాకాంక్షలు 2025

@ పూలతో నిండిన తోట ఎంద అందంగా ఉంటుందో..మన స్నేహం కూడా అంతే అందంగా ఉండాలి..నూతన సంవత్సర శుభాకాంక్షలు 2025

@ ఈ ఏడాది మీరు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలన కోరుకుంటూ నూతన సంవత్సరం శుభాకాంక్షలు 2025

@ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
రామచంద్రుడి అనుగ్రహం మీపై ఉండాలి
జై శ్రీరామ్…నూతన సంవత్సర శుభాకాంక్షలు 2025

@ మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానర యోధ ముఖ్యం శ్రీ రామదూతం శిరసా నమామి
ఆంజనేయుడి కరుణాకటాక్షాలు మీపై ఉండాలని ప్రార్థిస్తూ
నూతన సంవత్సర శుభాకాంక్షలు 2025

గడిచిపోయిన రోజులను మరిచిపోండి..కొత్త ఏడాదిలో కొత్త రోజుని కొత్తగా ప్రారంభించండి

ఈ క్షణం మీలో వచ్చే మంచి ఆలోచన, మీ ఆనందం ఏడాది మొత్తం కొనసాగేలా ప్లాన్ చేసుకోండి.

మీరు సంతోషంగా ఉండండి…మీ చుట్టూ ఉండేవారి మంచి కోరుకోండి.

2024 ఎలా గడిచిపోయినా వదిలేయండి..2025 ఎలా గడపాలో ప్లాన్ చేసుకోండి.

ఇష్టమైనవారితో ఆనందాన్ని పంచుకోండి.

మీరు బావుండాలని కోరుకునేవారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేండి.

news9pm ప్రేక్షకులకు నూతన సంవత్సరం 2025 శుభాకాంక్షలు..

తరవాత కథనం