ట్రైన్‌ టికెట్ బుక్ చేసుకున్నప్పుడే ఇష్టమైన టీ కాఫీని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు!

Vande Bharat

ప్రయాణం సమయంలో చాలా మంది రైల్వే ప్రయాణికులు టీ కాఫీ విషంలో ఇబ్బంది పడుతుంటారు. అక్కడ లభించే టీ కాఫీలు తాగలేక, తాగకుండా ఉండలేక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి టైంలోనే నచ్చిన కాఫీయో టీయో దొరికితే బాగున్ను అనిపిస్తుంది. మన భారతీయ ట్రైన్‌లో అలాంటి అవకాశం ఉందని తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు.

నిత్యం ట్రైన్స్‌లో కోట్ల మంది ప్రయాణిస్తుంటారు. వారి కోసం రైల్వే శాఖ చాలా సౌకర్యలు కల్పిస్తూ ఉంటుంది. అలాంటి వాటిలో టిక్కెట్లతోపాటు టీ, కాఫీలను బుక్ చేసుకునే సదుపాయం కల్పించడం ప్రారంభించింది. దీంతోపాటు మరికొన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తోంది. టిక్కెట్‌లు బుక్ చేసేటప్పుడు ఏ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయో చూద్దాం. టిక్కెట్‌ను బుక్ చేసుకునే సమయంలో ఈ సౌకర్యాలు ఎంపిక చేసుకోవడంతో ప్రయాణంలో ఫుడ్‌, టిఫిన్‌ కూడా ఆస్వాదించవచ్చు.

భారత దేశంలో హైస్పీడ్ ట్రైన్ అయిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఇలా టికెట్ బుక్ చేసుకునేటప్పుడు టీ, కాఫీ, ఫుడ్, టిఫిన్‌ను బుక్ చేసుకోవచ్చు. టికెట్ బుకింగ్ సమయంలో ఫుడ్ ఎంచుకోవచ్చు. అది వెజ్‌ లేదా నాన్‌వెజ్‌ లేకుంటే ఎలాంటి ఫుడ్ వద్దా అని కూడా టిక్ చేయవచ్చు. టీకాఫీ అలావటు ఉంటే కూడా ఎంచుకోవచ్చు.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణించేటప్పుడు భోజనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకదు. వారు ఎంపిక చేసిన టైంలోనే భోజనం ఇస్తారు. భోజనం, టిఫిన్ కాలమ్‌లో టిక్ చేస్తే మాత్రం మీ ప్రయాణ టైంలో ఏదో టైంలో వచ్చి ఇచ్చి వెళ్తారు. తక్కువ దూరం ప్రయాణిస్తుంటే ఈ రెండూ ఇస్తారా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. రైల్వే నిబంధనల ప్రకారం మీరు ఎంత దూరం ప్రయాణించారనే జర్నేతో సంబధం లేకుండా ఫుడ్ ఇస్తారు. కానీ టిఫిన్‌ ఇచ్చే టైంలో జర్నీలో ఉంటే టిఫిన్ ఇస్తారు. భోజనం సమయంలో జర్నీ చేస్తుంటే ఫుడ్ సప్లై చేస్తారు. టికెట్ బుకింగ్ సమయంలో బుక్ చేసుకున్న వాళ్లకు మాత్రమే ఫుడ్ సప్లై చేస్తారు.

మీరు వందే భారత్ ద్వారా ప్రయాణిస్తే ప్రధానంగా రెండు విషయాలు మీకు ఉచితంగా లభిస్తాయి. అందులో 500ml తాగే నీరు. ఆ బాటిల్‌ సప్లై చేస్తారు. రైలులో ఆన్‌బోర్డ్ వై-ఫై సదుపాయం ఉంటుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో మార్నింగ్‌ టీ, కాఫీతోపాటు, పోహా, ఉప్మా, ఆలూ వడ, బిస్కెట్లు, జ్యూస్ మొదలైన శాఖాహార అల్పాహారం అందిస్తారు. ఆమ్లెట్, బిస్కెట్లు, బ్రెడ్ బటర్ మొదలైనవి ఇస్తారు. మధ్యాహ్నం, రాత్రి శాకాహారం తీసుకునే వాళ్లకు కూరగాయలు, పనీర్, పరాటా, రోటీ, పప్పు, అన్నం, పెరుగు, స్వీట్ మొదలైనవి ఉంటాయి. నాన్ వెజ్ ఫుడ్‌లో చికెన్, చికెన్ మసాలా, కడాయి చికెన్, రోటీ, పప్పు, అన్నం మొదలైనవి పెడతారు.

దేశంలోని ప్రతి మూలకు కనెక్ట్ చేసే వందేభారత్ రైలు ద్వారా ప్రజలు తమ గమ్యాన్ని సులభంగా, వీలైనంత త్వరగా చేరుకుంటున్నారు. ఈ రైలు డోర్లు ఆటోమేటింగ్‌ తెరుచుకుంటాయి. మూసుకుంటాయి. రైలులో జీపీఎస్ సిస్టమ్‌తోపాటు ఫైర్ సెన్సార్ కూడా ఉంది. ఆహార పదార్థాలను ఉంచడానికి డీప్ ఫ్రీజర్ కూడా ఉంటుంది.

తరవాత కథనం