Game Changer Trailer: పొలిటీషియన్స్ తో పవర్ ఫుల్ గేమ్.. ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్లో ఇవి గమనించారా!

image credit: X

Game Changer Trailer Review: రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. సంక్రాంతి కానుకగా జనవరి 10 గ్రాండ్ గా విడుదల కాబోతోంది. దిల్ రాజు నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయ్. గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు.

ట్రైలర్ వైబ్రేషన్స్

జనవరి 02 సాయంత్రం గేమ్ ఛేంజర్ ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ మొదట్నుంచి చివరి ఫ్రేమ్ వరకూ శంకర్ మార్క్ కనిపించింది. టీజర్ ద్వారా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన డైరెక్టర్ శంకర్..ఇప్పుడు ట్రైలర్ తో అంచనాలు అంబరాన్నంటేలా చేశాడు. సినిమా మొత్తం రామ్ చరణ్ వన్ మ్యాన్ షో అనిపించేలా ఉంది ట్రైలర్. సేమ్ టైమ్ ఎస్ జే సూర్య క్యారెక్టర్ కూడా అద్భుతంగా తీర్చిదిద్దాడు శంకర్.

మెసెజ్ కమ్ కమర్షియల్ ఎలిమెంట్స్

శంకర్ మూవీలో మంచి మెసేజ్ తో పాటూ కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయ్. గేమ్ ఛేంజర్ చూస్తుంటే అలానే ఉంది. అపరిచితుడు, జెంటిల్మెన్, ఒకే ఒక్కడు మూవీస్ ని గుర్తుచేస్తోంది. ఈ సినిమాతో శంకర్ ఈజ్ బ్యాక్ అనుకోవచ్చేమో..

ఈ డైలాగ్స్ అదిరిపోయాయ్

ట్రైలర్ మొదట్లో..’కడుపునిండా వంద ముద్దలు తినే ఏనుగు, ఒక్క ముద్ద వదిలిపెడితే దానికి వచ్చే నష్టమేమీ లేదు. కానీ అది లక్ష చీమలకు ఆహారం అవుతుందని చరణ్ చెప్పే డైలాగ్ ఆలోచింపజేసేలా ఉంది. కలెక్టర్ ఓ ముద్ద అడుకుంటున్నాడురా అని సెటైర్ పేలుతుంది..ఆ తర్వాత వచ్చిన ప్రతి ఫ్రేమ్ లో చరణ్ ని ఇరగదీసేశాడు. మరోవైపు అప్పన్న క్యారెక్టర్లో కనిపించిన చరణ్ మా పార్టీ సేవ చేయడానికే కానీ సంపాదించడానికి కాదు అనే డైలాగ్ బాగా పేలింది. అన్నిటి కీ మించి రా కి రా..సర్ కి సర్ అంటూ ఓ సీఎం తో కలెక్టర్ చెప్పే డైలాగ్ ట్రైలర్ కే హైలెట్ గా నిలిచింది. అప్పన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగా వచ్చిందని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్, సాంగ్స్ మరింత బూస్ట్ ఇచ్చేలా ఉన్నాయ్.

‘రోబో’, రోబో ‘2.0’ లాంటి సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ ఫిలిమ్స్ కాకుండా శంకర్ పక్కా మాస్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో గేమ్ ఛేంజర్ తో ట్రైలర్ తో చెప్పేశాడు. ఈ సినిమాలో యంగ్ రామ్ చరణ్ కి జోడీగా కియారా అద్వాని, తండ్రి రామ్ చరణ్ కి జోడీగా అంజలి నటించారు. ఈ సినిమాలో కియారా సాంగ్స్ కే పరిమితం అయినా..అంజలి క్యారెక్టర్ పవర్ పుల్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు మేకర్స్. ఈ సినిమాతో రామ్ చరణ్, అంజలికి నేషనల్ అవార్డ్ పక్కా అంటున్నారు.

రీసెంట్ గా విజయవాడలో రామ్ చరణ్ భారీ కటౌట్ లాంచ్ చేశారు. జనవరి 02న హైదరాబాద్ లో రాజమౌళి చేతులమీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు. జనవరి 04 న రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అంతంకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోతున్న గేమ్ ఛేంజర్ థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఏ మేరకు మెప్పిస్తుందో వెయిట్ అండ్ సీ…

గేమ్ ఛేంజర్ ట్రైలర్ ఇక్కడ చూడండి

తరవాత కథనం