మీ భాగస్వామి లేదా ప్రియురాలితో ఏకాంతంగా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారా? హోటల్‌లో రూమ్ తీసుకోవడం.. ఆ నాలుగు గోడల మధ్యే అన్నీ చేసుకోవడం చాలా బోరింగ్ విషయం. అదే మీరు ఒక ద్వీపాన్ని అద్దెకు తీసుకున్నారంటే.. ఎక్కడ పడితే అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఔనా.. నిజమా.. అని నోరు తెరిచి మరీ ఆశ్చర్యపోతున్నారా? ఔనండి.. నిజమే. మీరు మీ హాలీడేస్‌లో చక్కగా ఒక ఐలాండ్‌ను అద్దెకు తీసుకుని సరదాగా గడిపి వచ్చేయండి. 2024లో మీరు అనుకున్నవి జరిగి ఉండకపోవచ్చు. అయితే, 2025లోని మీ కోరికల జాబితాలో దీన్ని కూడా చేర్చుకోండి.
పర్యాటక ప్రాంతాలకు వెళ్లడం.. అక్కడ ఖరీదైన హోటళ్లలో బస చేయడం సాధారణమే. అయితే, ఐలాండ్స్‌ను అద్దెకు తీసుకోవడం కొత్తగా నడుస్తున్న ట్రెండ్. ప్రకృతి ఒడిలో, పూర్తిగా ప్రత్యేకమైన ప్రైవసీతో విస్తారమైన విలాసవంతమైన సౌకర్యాలు ఉండే ఈ ద్వీపాల్లో ఉండటం ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. అది సరే.. అసలు మనకు అద్దెకు దొరికే ఐలాండ్స్ ఏమున్నాయనేగా మీ సందేహం. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని ప్రైవేట్ ద్వీపాలు మీరు అద్దెకు తీసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. అవి.. ఇవే..
నెక్కర్ ఐలాండ్ (బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్)
నెక్కర్ ఐలాండ్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో ఉన్న ఈ అద్భుతమైన ద్వీపం రిచర్డ్ బ్రాన్సన్ అనే ప్రముఖ వ్యాపారిది. ఈ ద్వీపంలో 8-బెడ్‌రూమ్ విల్లా ఉంది. అందులో నుంచి చూస్తే.. చూట్టూ సముద్రం భలే అందంగా కనిపిస్తుంది. అంతేకాదు.. ఇక్కడ ఎంజాయ్ చేయడానికి కొన్ని వాటర్ స్పోర్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దీని ఒక రోజు అద్దె రూ.75 వేల డాలర్లు. భారత కరెన్సీలో సుమారు రూ.65 లక్షలు.
ఫ్రిగేట్ ఐలాండ్ (సెయ్షెల్స్)
సెయ్షెల్స్‌లోని ఈ ద్వీపం ప్రకృతిపరంగా భలే అందంగా ఉంటుంది. అద్భుతమైన విల్లాలు, పచ్చికబయళ్లు.. ప్రైవేట్ బీచ్‌లు ఈ ద్వీపం ప్రత్యేకం. దీని ఒక్క రోజు అద్దె 6,000 డాలర్లు నుంచి 12,000 డాలర్లు వరకు ఉంటుంది. భారత కరెన్సీలో రూ.5.20 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉంటుంది.
పామలికన్ ఐలాండ్ (ఫిలిప్పిన్స్)
అమన్‌పులో రిసార్ట్‌లో భాగమైన ఈ ఐలాండ్, 29 విలాసవంతమైన విల్లాలతో.. అందమైన ప్రైవేట్ బీచ్‌లతో చాలా అద్భుతంగా ఉంటుంది. వాటర్ స్పోర్ట్స్‌ను ఎంజాయ్ చేయాలనుకుంటే.. ఇదే కరెక్ట్ ప్లేస్. దీని ఒక రోజు అద్దె విలువ 3,000 డాలర్లు నుంచి 5,000 డాలర్లు వరకు ఉంటుంది. అంటే.. భారత కరెన్సీలో సుమారు రూ.2.5 లక్షల నుంచి రూ.4.5 లక్షలు .
ముషా కే (బహామాస్)
డేవిడ్ కాపర్‌ఫీల్డ్ అనే వ్యాపారవేత్తకు చెందిన ఈ ద్వీపంలోని విల్లాలను చూస్తే.. మతిపోతుంది. ఇక్కడ స్టే చెయ్యాలంటే రోజుకు 37 వేల డాలర్లను చెల్లించాలి. భారత కరెన్సీలో సుమారు రూ.32 లక్షలు.
కోకో ప్రివే (మాల్దీవ్స్)
మాల్దీవ్స్‌లోని ఈ ప్రైవేట్ ఐలాండ్ ప్రకృతి ఒడిలో విలాసమైన విల్లాలతో నిండి ఉంటుంది. స్విమ్మింగ్, డైవింగ్ అందుబాటులో ఉంటాయి. ఒక్క బస చేయాలంటే రోజుకు 45 వేల డాలర్లు చెల్లించాలి. భారత కరెన్సీ ప్రకారం.. దీని విలువ సుమారు రూ.39 లక్షలు.
లిటిల్ పామ్ ఐలాండ్ (ఫ్లోరిడా కీస్, USA)
మీరు మీ ప్రియురాలితో ఏకాంతంగా గడపాలి అనుకుంటున్నా.. లేదా హనీమూన్ ప్లాన్ చేసుకుంటున్నా ఈ ద్వీపాన్ని ట్రై చెయ్యండి. ఇక్కడ ప్రైవసీకి తిరుగే ఉండదు. ఇక్కడ బస చేయాలంటే ఒక రోజుకు 3 వేలు నుంచి 5 వేల డార్లు చెల్లించాలి. భారత కరెన్సీ ప్రకారం దీని విలువ రూ.2.5 లక్షల నుంచి రూ.4.5 లక్షలు.
ది బ్రాండో (తైహిటి, ఫ్రెంచ్ పోలినేషియా)
టియరోఐలో ఈ ప్రైవేట్ ఐలాండ్ ఉంది. సహజ వనరుల సంరక్షణ కోసం ఈ ద్వీపాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ద్వీపం పర్యాటకులకు విలాసవంతమైన అనుభవం అందిస్తుంది. ఇక్కడ ఒక రోజు బస చెయ్యాలంటే 3,000 డాలర్లు నుంచి 10,000 డాలర్లు వరకు చెల్లించాలి. భారత కరెన్సీ ప్రకారం.. రూ.2.5 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు ఉంటుంది.
బ్రీజెస్ రిసార్ట్ & స్పా (బహామాస్)
ఈ ప్రైవేట్ ఐలాండ్‌లోని అందమైన బీచ్‌లు, వాటర్ స్పోర్ట్స్ ఆహ్లాదాన్ని అందిస్తాయి. ఇక్కడ ఒక రోజు బస చెయ్యాలంటే 1,200 డాలర్లు నుంచి 3,000 డాలర్లు వరకు చెల్లించాలి.