అల్లు అర్జున్‌కు దండం పెట్టిన హిందీ పుష్పరాజ్‌- క్లైమాక్స్ సీన్‌కు గొంతు పోయిందని వెల్లడి

actor shreyas talpade

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన ‘పుష్ప 2′(Pushpa-2) చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. అభిమానుల ఆదరణతో సినిమాకు రికార్డు స్థాయి కలెక్షన్లు వచ్చాయి. ఇప్పటికీ సినిమాకు ప్రజాదరణ తగ్గలేదు. నార్త్‌లో ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది. సినిమాలో అల్లు అర్జున్ నటన ప్రేక్షకులకు మెస్మరైజ్ చేసింది. నార్త్‌లో సినీ అభిమానులను ఈ సినిమా ఇంతగా ఆకట్టుకోవడానికి అల్లు అర్జున్ యాక్షన్‌తోపాటు దానికి తగ్గట్టుగా డబ్బింగ్ కూడా సెట్ అయింది. ఎక్కడ కూడా డబ్బింగ్ చెప్పించారనే ఆలోచన రాకుండా గ్రౌండ్ వర్క్ చేశారు. అంతలా అల్లు అర్జున్‌కు హిందీ వాయిస్ ఇచ్చి మెప్పించిన నటుడు నటుడు శ్రేయాస్ తల్పాడే(Shreyas Talpade).

శ్రేయాస్ పడిన శ్రమకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో సినిమా డబ్బింగ్ కోసం శ్రేయాస్‌ పడిన శ్రమ గురించి చెప్పాడు. ఆ టైంలో పడిన ఇబ్బందులు, ప్రేక్షలు అంచనాలు అందుకోవడానికి పడిన శ్రమను వివరించాడు. పుష్ప 1, 2 రెండు సినిమాలకు ఆయనే డబ్బింగి చెప్పినప్పటికీ చాలా తేడా ఉందన్నారు. మొదటి పార్ట్‌కు డబ్బింగ్ చెప్పినప్పుడు ఇంత హైప్ లేనందున తనపై కూడా ఎలాంటి ఒత్తిడి లేదని వివరించాడు. సరదాగా సాగిపపోయిందని తెలిపాడు. రెండు పార్ట్ కోసం మాత్రం హోం వర్క్ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.

పుష్ప పార్ట్ 1 క్లైమాక్స్ కష్టంగా ఉందన్నాడు
పుష్ప 1 సినిమా విచిత్రంగా ముగిసిందని చెప్పుకొచ్చాడు. అప్పటి వరకు యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఫుల్‌ ప్యాక్‌లా ఉన్న పుష్ప సినిమా క్లైమాక్స్ కేవలం హీరో, విలన్ కూర్చొని మాట్లాడుకునే చోటనే ముగుస్తుంది. హీరో తన కోపాన్ని విలన్‌పై వెళ్లగక్కాడు, అతనికి ఛాలెంజ్ చేసి వెళ్లిపోతాడు. ఆ సీన్‌లో భావోద్వేగాలను మాత్రమే వ్యక్తపరచాలి. అరవాలి. పుష్ప బట్టలు లేకుండా బయటికి వెళ్తే చాలా మంది గుర్తుపడతారని అడుగుతారని, అదే నువ్వు బట్టలు లేకుండా వెళ్తే నీ ఇంటి కుక్క కూడా గుర్తు పట్టదని విలన్‌తో హీరో డైలాగ్ చెప్తాడు. చూడటానికి చిన్న సీన్‌లాగానే ఉన్నా చాలా భావోద్వేగం ఉంటుందన్నాడు. డబ్బింగ్‌లో అది పండించడానికి ఒకరోజు టైం తీసుోకవాల్సి వచ్చిందన్నాడు.

‘పుష్ప 2’కి డబ్బింగ్ కష్టాలు
‘పుష్ప 2’ చిత్రంలో డబ్బింగ్ గురించి శ్రేయాస్ తల్పాడే మాట్లాడుతూ… పుష్పా చిత్రం మొత్తంలో పాన్‌ను నోటిలో ఉంచుకొని మాట్లాడుతుంటాడు. అందుకు తాను కూడా నోటిలో తమలపాకు పెట్టుకుని డబ్బింగ్ చెప్పేందుకు ప్రయత్నించానని వివరించాడు. దీంతో గొంతులో ఇబ్బంది వచ్చిందని శ్రేయాస్ చెప్పాడు. అప్పుడు నోటిలో దూదిని పెట్టి పుష్ప పాత్రకు వాయిస్‌ ఇవ్వాల్సి వచ్చిందన్నారు. ఇది ప్రేక్షకులు మంచి అనుభూతిని కలిగిస్తోందని ఆనందం వ్యక్తం చేశాడు.

తరవాత కథనం