Rohit Sharma: రోహిత్ భాయ్‌ ఇక చాలు- చెప్పేసిన సెలెక్టర్లు- ముగిసిన హిట్‌మ్యాన్ శకం!

Rohit Sharma

Rohit Sharma retirement: సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మను ఎంపిక చేయలేదు. ఆయనకు విశ్రాంతి ఇచ్చారు. నాల్గో టెస్టు ఓటమి తర్వాత సిడ్నీ టెస్టులో భారత్ విజయం సాధిస్తుందా లేదా అనే చర్చ కంటే అసలు రోహిత్‌ ఆఖరి టెస్టులో ఉంటాడా లేదా అనేదే ఎక్కువ డిబేట్ పాయింట్ అయింది. తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో గంభీర్ వార్నింగ్ ఇచ్చారనే లీకులతో రోహిత్‌పై వేటు ఖాయమనే నిర్ణయానికి చాలా మంది క్రికెట్‌ అభిమానులు వచ్చేశారు.

గత కొంతకాలంగా ఫామ్‌ లేకుండా ఇబ్బంది పడుతున్న రోహిత్‌ శర్మపై వేటు వేయడం ఎవర్నీ ఆశ్చర్యపరచలేదు. అయితే ఆయన ఫ్యూచర్ ఏంటనే చర్చ మొదలైంది. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం రోహిత్ శర్మ తన ఆఖరి టెస్టును ఆడేశాడని అంటున్నారు. ఇప్పటికే సెలెక్టర్లు కూడా ఆయనకు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఇది హిట్‌మ్యాన్ అభిమానులకు నచ్చకపోవచ్చు కానీ ఇదే నిజమని అంటున్నారు.

అందుకే సిడ్నీ టెస్టులో టాస్ సమయంలో జస్ప్రీత్ బుమ్రా ఆసీస్ కెప్టెన్‌తో కలిసి గ్రౌండ్‌లోకి వచ్చాడు. కీలకమైన సిడ్నీ టెస్ట్ నుంచి విశ్రాంతి తీసుకోవాలని రోహిత్ నిర్ణయించుకున్నాడని అతను చెప్పాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను సమం చేయడానికి ఇది చాలా అవసరం. అని పేర్కొన్నారు.

రోహిత్ శర్మ భారత్ తరపున తన చివరి టెస్టు ఆడినట్టేనని తెలుస్తోంది. మరో సీనియర్ ప్లేయర్‌ విరాట్ కోహ్లికి ఇంకా ఛాన్స్ ఇవ్వడానికి నిర్ణయించిన సెలక్టర్లు రోహిత్ శర్మకు మాత్రం సమాచారం చేరవేశారని అంటున్నారు. టెస్టుల్లో పరుగుల కోసం తంటాలు పడుతున్న రోహిత్‌ మాత్రం మరో ఛాన్స్ ఇవ్వడానికి సెలక్టర్లు ఆసక్తి చూపించడం లేదు. ఈ విషయాన్ని ఆయనకు క్లియర్‌గా అర్థమైనట్టు చెప్పేశారని టాక్.

జూన్ 2025లో లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్ అర్హత సాధించినా రోహిత్‌కు ఛాన్స్ ఉండబోదని తెలుస్తోంది. టెస్టు క్రికెట్ జట్టులో ఇక రోహిత్‌ శకం ముగిసిందని అంటున్నారు. అందులో భాగంగానే సిడ్నీ టెస్టులో రోహిత్ శర్మను ప్లేయింగ్ ఎలెవన్‌లో తీసుకోకూడదని మెయిన్ కోచ్‌ గౌతమ్ గంభీర్, సెలెక్టర్ల ఛైర్మన్ అజిత్ అగార్కర్ నిర్ణయించారు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు. 3,6,10,3, 9 స్కోర్‌లను మాత్రమే నమోదు చేశాడు. దీంతో ఆయనపై వేటు ఖాయమని అంతా ముందే ఓ నిర్ణయానికి వచ్చారు. సిడ్నీలో టాస్ సమయంలో, భారత స్టాండ్-ఇన్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా మాట్లాడుతూ, ” మా కెప్టెన్ (రోహిత్) తన నాయకత్వాన్ని ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతానికి ఈ గేమ్‌లో విశ్రాంతి తీసుకున్నాడు. జట్టులో ఎలాంటి విభేదాలు లేవు ఐక్యత ఉంది. మా టీమ్‌లో ఎవరికీ ఎలాంటి స్వార్థం లేదని ఈ నిర్ణయంతో స్పష్టమైంది. అని అన్నాడు.

ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి టీమ్‌ సెలక్షన్ విషయంలో కూడా కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు మేనేజ్‌మెంట్‌ సిద్ధమైందని. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ముగిసి జట్టు మొత్తం భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత ఈ సమావేశం జరుగుతుందని భావిస్తున్నారు.

విరాట్ కోహ్లితో సెలక్టర్లు కూర్చోనున్నారు
కుడిచేతి వాటం బ్యాటర్ విరాట్ కోహ్లి ఆఫ్ స్టంప్ వెలుపల వెళ్లే బంతులను జ్ చేయడంతో పదే పదే అవుటవుతున్నాడు. సిడ్నీ టెస్టులో కూడా కేవలం 17 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. పెర్త్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసినప్పటికీ, కోహ్లి తన పాత స్వభావాన్ని వీడలేకపోతున్నాడు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లి ఏడుసార్లు కూడా ఒకేలా అవుట్ అయ్యాడు. వైడ్ డెలివరీలను ఛేజింగ్ చేయడం ద్వారా బోల్తా పడుతున్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ ముగిసిన తర్వాత దీనిపై కూడా సెలక్టర్లు విరాట్ కోహ్లీతో చర్చించనున్నారని తెలుస్తోంది. జట్టులోని మరొక సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజాకు ప్రస్తుతానికి వచ్చిన ప్రమాదం లేదని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఒకే సారి ముగ్గురు సీనియర్లను తప్పిస్తే ఇబ్బందని గ్రహించి అతని మరిన్ని ఛాన్స్‌లు ఇవ్వాలని నిర్ణయించారట.

తరవాత కథనం