Game Changer Review: గేమ్ ఛేంజర్ స్టోరీ చెప్పేసిన డైరెక్టర్ శంకర్..మెగా ఫ్యాన్స్ ఫిక్సైపోండమ్మా!

image credit:X

Game Changer Review: రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్లో వస్తోన్న మూవీ గేమ్ ఛేంజర్. రిలీజ్ టైమ్ దగ్గరపడడంతో ఈవెంట్స్ జోరుగా సాగుతున్నాయి. ప్రమోషన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో జనవరి 4 శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు శంకర్ మాట్లాడుతూ మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 30 ఏళ్ళ కెరీర్లో 14 సినిమాలు చేశానని ఇందులో ఒక్కటికూడా తెలుగు సినిమా లేదు.. అన్నీ తెలుగులో డబ్ అయ్యాయి..అయినప్పటికీ టాలీవుడ్ ఆడియన్స్ ఎంతో ఆదరించారు. అందుకే ఆ అభిమానానికి కృతజ్ఞతగా నేరుగా తెలుగు సినిమా చేయాలి అనుకున్నా. ఎప్పడు అనుకున్నా ఇప్పటికి ఆ కల నెరవేరిందన్నారు శంకర్. ఈ సందర్భంగా రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజుకి థ్యాంక్స్ చెప్పారు శంకర్.

ఇక ఈ సినిమా తెలుగు సంప్రదాయం ఉండాలనే ఉద్దేశంతో అన్నీ తెలుగు లొకేషన్స్ లో ఎక్కువగా తీశామని నటీనటులు కూడా ఎక్కువమంది తెలుగువాళ్లే ఉన్నారన్నారు శంకర్. ఇక గేమ్ ఛేంజర్ స్టోరీ గురించి మాట్లాడుతూ ఒక ఐఏఎస్ ఆఫీసర్ – మినిస్టర్ మధ్య జరిగే వార్ అని చెప్పారు. అయితే అప్పన్న క్యారెక్టర్ వీళ్లిద్దరకీ ఎలా లింక్ కుదిరింది అన్నదే ఇంటస్ట్రింగ్ అని చెప్పుకొచ్చాడు. అప్పన్న క్యారెక్టర్ సినిమాకు ప్లస్ అవుతుందని మరింత హైప్ ఇచ్చాడు. రామ్ చరణ్ ఈ సినిమాలో నటించలేదు జీవించాడు..ప్రతి క్యారెక్టర్లోనూ అద్భుతంగా కనిపిస్తాడని చెర్రీని పొగిడారు. ఇంకా చెప్పాలంటే ఇందులో రామ్ చరణ్ ని చూస్తుంటే స్క్రీన్ పై చూసినట్టు కాదు నిజంగా రియల్ క్యారెక్టర్ చూస్తున్నట్టే అనిపిస్తుందని క్లారిటీ ఇచ్చేశారు.

వాస్తవానికి ఈ సినిమాకు మొదట అనుకున్న హీరో విజయ్. కథ కూడా నచ్చడంతో విజయ్ కూడా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే శంకర్ పెట్టిన ఓ కండిషన్ కారణంగా విజయ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారట. అదేంటంటే సినిమా షూటింగ్ కోసం ఏడాదిన్న‌ర పాటు సమయం అడిగారట .విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తుండడంతో సినిమాకు ఏడాది కన్నా ఎక్కువ సమయం ఇవ్వలేనని చెప్పారట. దీంతో శంకర్ విజయ్ ను కాదని అప్పుడు రామ్ చరణ్ ని సెలెక్ట్ చేసుకున్నట్టు టాక్. ఈ సినిమాలో కియారా అద్వాని, అంజలి హీరోయన్లుగా నటిస్తున్నారు.. శ్రీకాంత్, ఎస్ జే సూర్య , సునీల్, జయరాం, నవీన్ చంద్ర, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. ముఖ్యంగా ఎస్ జే సూర్య నెగెటివ్ రోల్ లో మరోసారి విశ్వరూపం చూపించారని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోందంటున్నారు ఆడియన్స్. ఇక అప్పన్న క్యారెక్టర్ ఏ రేంజ్ లో పేలుతుందో సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు వెయిట్ చేస్తున్నారు అభిమానులు…

శంకర్ వరుస డిజాస్టర్స్ తో ఉన్నారు. అందుకే ఈ సమయంలో హిట్ అవసరం. గేమ్ ఛేంజర్ తో ఆ శంకర్ ఈజ్ బ్యాక్ అనిపించుకోవడం ఖాయం అంటున్నారంతా. మరోవైపు RRR తో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ నటిస్తున్న మూవీ కావడంతో ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో అని వెయిట్ చేస్తున్నారు అభిమానులు.

తరవాత కథనం