Ram Charan: మహేష్ రికార్డును చరణ్ బ్రేక్ చేస్తాడా!

image credit:Instagram

Ram Charan Game changer: ఇండస్ట్రీకి సంక్రాంతి అతి పెద్ద పండుగ. ఎక్కడెక్కడి సినిమాలు సంక్రాంతి బరిలో దిగేందుకు పోటీ పడతాయి. సంక్రాంతికి రిలీజైన మూవీస్ ఓ మోస్తరుగా ఉన్నప్పటికీ మినిమం వసూళ్లు గ్యారంటీ . అందుకే సంక్రాంతికి వచ్చేందుకు పోటీ ఓ రేంజ్ లో ఉంటుంది.

ఇక 2025 ఆరంభంలో..సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలవుతోంది గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లు. శ్రీకాంత్ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. ఎస్ జే సూర్య విలన్. ఈ సినిమాపై ఇప్పటివరకూ మాట్లాడిన టీమ్ అంతా సినిమా ఓ రెంజ్ లో వచ్చిందన్నారు.అప్పన్నగా చరణ్ నటన ఓ రేంజ్ లో ఉందని ఆకాశానికెత్తేశారు. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ తో మొదలవుతుందని నమ్మకంగా చెబుతున్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ నిర్మాత దిల్ రాజు గ్రాండ్ గా నిర్మించిన ఈ సినిమా పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింది. ఇప్పటివరకూ రిలీజైన పాటలు, టీజర్, ట్రైలర్ ఓ రేంజ్ లో ఉన్నాయనే టాక్ సొంతం చేసుకున్నాయి. శంకర్ అంటే రీసెంట్ మూవీస్ కాదు ఒకప్పటి శంకర్ ని చూస్తారని చెబుతున్నారంతా. అందుకు తగ్గట్టే ఉంది ట్రైలర్.

పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానున్న గేమ్ ఛేంజర్ ఓపెనింగ్స్ గురించే మెయిన్ డిస్కషన్ జరుగుతోంది. తొలిరోజు దాదాపు రూ.42 – రూ.47 కోట్ల వసూళ్లు ఖాయం అంటున్నారు. రూ.50 కోట్ల మార్క్ టచ్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు కూడా. ఈ లెక్క పక్కగా వచ్చేస్తే మహేష్ బాబు రికార్డ్ ను చరణ్ బ్రేక్ చేయడం ఖాయం అంటున్నారు సినీ వర్గాలు.

ఇప్పటి వరకు టాలీవుడ్ లో బిగ్గెస్ట్ సంక్రాంతి ఓపెనింగ్స్ అందుకున్న మూవీ అంటే మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు. 2020 సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా రూ.45.7 కోట్ల ఓపెనింగ్స్ సాధించి బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది. ఈ సినిమా స్టార్టించి ఎండింగ్ వరకూ నవ్వులే నవ్వులు. అదే టైమ్ లో ఓ మెసేజ్ కూడా ఇవ్వడంలో సక్సెస్ అయ్యాడు అనిల్ రావిపూడి.అందుకే కూల్ గా కలెక్షన్లు కుమ్మేసింది సరిలేరు నీకెవ్వరు. ఇప్పుడు ఈ రికార్డును గేమ్ ఛేంజర్ కొట్టేయడం ఖాయం అని ఫిక్సైపోయారు మెగా అభిమానులు. టాక్ యావరేజ్ వస్తేనే ఈ రేంజ్ లో వసూళ్లు వచ్చేస్తాయ్..ఇక హిట్ టాక్ వస్తే మాత్రం రామ్ చరణ్ దూకుడు మామూలుగా ఉండదు. పైగా రాజమౌళి సినిమాలో నటిస్తే ఆ తర్వాత హీరోకి ఫ్లాపులు తప్పవు అనే సెంటిమెంట్ ను చరణ్ బ్రేక్ చేస్తాడు అంటున్నారు. ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ…

తరవాత కథనం