Jaya lalitha – Trisha: జయలలిత బాటలో త్రిష.. అదే టార్గెట్ అని తేల్చి చెప్పేసింది!

image credit:Instagram

Trisha: తమిళనాడు పవర్ ఫుల్ సీఎం అనగానే ఠక్కున అందరినోటా వినిపించే మాట జయలలిత. హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించి స్టార్ స్టేటస్ ను ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత ప్రేమ వ్యవహారాలతో పాపులర్ అయింది. MGR సహాయంతో పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చి పవర్ ఫుల్ గా మారింది. హీరోయిన్ నుంచి తమిళనాడు సీఎం అయ్యేవరకూ జయలలిత ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంది. అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటూ సీఎంగా నిలిచింది. ప్రజల మనసు గెలిచింది.

అడుగడుగునా సంచలనమే..

జయలలిత వ్యక్తిగత జీవితం, రాజకీయ జీవితంలో అడుగడుగునా సంచలనాలే. ఆమెకు ముందు అయినా తర్వాత అయినా తమిళనాడు రాజకీయాల్లో అంత పవర్ ఫుల్ మహిళ కనిపించలేదు. త్వరలో తానున్నానంటూ మనసులో మాట బయటపెట్టింది చెన్నై చంద్రం త్రిష.

సీఎం అవుతానంటోన్న త్రిష

రాజకీయాలంటే తనకు చాలా ఇష్టమని.. తమిళనాడుకు సీఎం కావాలన్నదని తన కల అని అనౌన్స్ చేసింది త్రిష. దీంతో తమిళనాట పొలిటికల్ ఎంట్రీపై త్రిష గురించి భారీ చర్చే జరుగుతోంది. రెండు దశాబ్ధాలుగా తన స్టార్ డమ్ కాపాడుకుంటూ వస్తోంది త్రిష. నాలుగు పదుల వయసులోనూ స్టార్ హీరోస్, యంగ్ హీరోస్ తో ఆఫర్లు అందుకుంటూ కెరీర్లో దూసుకెళ్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ లో బిజీగా ఉన్న త్రిష.. తెలుగులో విశ్వంభరలో నటిస్తోంది. అప్పుడెప్పుడో చిరంజీవితో కలసి స్టాలిన్ లో నటించిన త్రిష..విశ్వంభర కోసం మరోసారి జోడీ కట్టింది. ఈ మూవీ సక్సెస్ అయితే టాలీవుడ్ లో బిజీ అయిపోతుంది.

చెన్నై చంద్రం మెస్మరైజింగ్ లుక్

త్రిష కెరీర్ అయిపోయినట్టే అనుకున్న టైమ్ లో మణిరత్నం పొన్నియన్ సెల్వన్ మూవీతో ఎవ్వరూ ఊహించని విధంగా దూసుకొచ్చింది త్రిష. ఆ మూవీలో ఐశ్వర్యారాయ్ ని మించిన అందంతో మెరిసిపోయింది. పొన్నియన్ సెల్వన్ మూవీ ఎవరికి బాగా కలిసొచ్చిందని చెప్పుకుంటే ఫస్ట్ పేరు త్రిషదే. ఆ మూవీలో చెన్నై చంద్రం మెస్మరైజింగ్ లుక్ చూసి ఆఫర్లు క్యూ కట్టేశాయ్.

విజయ్ బాటలో

మరోవైపు త్రిష..విజయ్ తో ప్రేమాయణం వార్తల్లోనూ నిత్యం వైరల్ అవుతూనే ఉంది. ఆ మధ్య కీర్తి సురేష్ పెళ్లికి ఇద్దరూ కలసి వెళుతూ మీడియా కంటపడ్డారు. తమ రిలేషన్ గురించి ఓపెన్ అవలేదు కానీ ఇద్దరి మధ్యా సమ్ థింగ్ సమ్ థింగ్ అని రూమర్స్ కొనసాగుతూనే ఉన్నాయ్. ప్రస్తుతం విజయ్ రాజకీయాల్లో బిజీ అవుతున్నాడు. ఇలాంటి టైమ్ లో త్రిష కూడా రాజకీయాల గురించి మాట్లాడడంతో ఏదో గట్టిప్లానే ఉందనే టాక్ వినిపిస్తోంది.

లైట్ కాదు సీరియస్

త్రిష లాంటి స్టార్ డమ్ ఉన్న హీరోయిన్ ఇలాంటి కామెంట్స్ చేస్తే అవి లైట్ తీసుకునేందుకు లేదంటున్నారు సినీ రాజకీయ విశ్లేషకులు. పైగా తమిళనాట రాజకీయాలు, సినిమాలకు విడదీయరాని సంబంధం ఉంటుంది. విజయ్ రాజకీయాల్లో బిజీ అవుతున్న టైమ్ లో తనకు కూడా రాజకీయాల్లోకి రావాలని ఉందని ముఖ్యమంత్రి అవ్వాలనుందన్న కామెంట్స్ పెద్ద దుమారమే రేపుతున్నాయ్. చూస్తుంటే ఎన్నికల టైమ్ కి విజయ్ పార్టీ నుంచి త్రిష పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

తరవాత కథనం