Game Changer First Review In Telugu: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది గేమ్ ఛేంజర్. కియారా అద్వాని, అంజలి హీరోయిన్లుగా నటించారు. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మాతగా వ్యవహించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన గేమ్ ఛేంజర్ ట్రైలర్ , టీజర్, సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ట్రైలర్ ఒక్క రోజులో అత్యధిక వ్యూస్ సాధించిన టాలీవుడ్ సినిమాగా రికార్డ్ కొట్టింది. జనవరి 10న సంక్రాంతి కానుకగా…తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్‌గా విడుదలవుతోంది. రిలీజ్ కి టైమ్ దగ్గర పడడంతో ఓవర్సీస్ లో సెన్సార్ పూర్తైనట్టు తెలుస్తోంది.
ఉమైర్ సంధు ట్వీట్
ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్, సౌత్ ఫిల్మ్ క్రిటిక్‌గా చెప్పుకునే ఉమైర్ సంధు లేటెస్ట్ గా కొన్ని పోస్టులు చేశాడు. ఓవర్సీస్ సెన్సార్‌లో సినిమా చూసిన ఉమైర్ సంధు గేమ్ ఛేంజర్ పై ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు…” ఇది అస్సలు వర్కౌట్ కాదు. శంకర్, రామ్ చరణ్ సినిమా అస్సలు చూసేలా లేదు. మెయిన్ లీడ్ యాక్టర్స్ అంతా క్రింజ్, పూర్ పర్ఫామెన్స్ ఇచ్చారు. స్టోరీ ఔట్ డేటెట్.. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ బోర్ కొట్టడం ఖాయం. సింపిల్ గా చెప్పాలంటే గేమ్ ఛేంజర్ ఓ టార్చర్ అంటూ ఉమైర్ ట్వీట్ చేశాడు. పోస్టులో ముఖ్యంగా శంకర్ ని అడ్రస్ చేస్తూ విమర్శలు చేశాడు ఉమైర్. శంకర్ ఇక నువ్వు సినిమాల నుంచి రిటైర్ అయిపోవడం బెటర్. 80, 90 కాలం నాటి చెత్త పొలిటికల్ సినిమాలు చూసి చాలా విసిగిపోయాం. మొదట ఇండియన్ 2. ఇప్పుడు గేమ్ ఛేంజర్. నువ్ జనాలకు టార్చర్ డైరెక్టర్‌వి..ఇకనైనా శంకర్ ని బ్యాన్ చేయడం బెటర్. రామ్ చరణ్ కెరీర్ ని నాశనం చేశావ్ అంటూ ఘాటుగా పోస్టు పెట్టాడు.
నిద్రపోయాను సినిమా చెత్తగా ఉంది
గేమ్ ఛేంజర్ సెన్సార్ స్క్రీనింగ్ టైమ్ లో నేను నిద్రపోయాను..సినిమా చెత్తగా ఉంది. అత్యంత నీచమైన సినిమా..ఔట్ డేటెడ్ స్టోరి అని మరో పోస్ట్ పెట్టాడు. గేమ్ ఛేంజర్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ డిజాస్టర్…ఓవర్సీస్లో అతిపెద్ద మార్కెట్ అయిన USA లో అడ్వాన్స్ బుకింగ్స్ లేవు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్టార్‌డమ్‌ను చూడండి అంటూ కామెడీగా ఎమోజీలు షేర్ చేశాడు ఉమైర్ సంధు.
ఉమైర్ ఫ్లాప్ అంటే హిట్..హిట్ అంటే ఫ్లాప్
వాస్తవానికి ఉమైర్ సంధు రివ్యూలు వైరల్ అవుతుంటాయ్ కానీ వాటిని జనం కామెడీగా తీసుకుంటారు. ఉమైర్ సినిమా బాలేదని చెబితే సూపర్ హిట్ అవుతుందని.. అద్భుతంగా ఉందని చెబితే అట్టర్ ఫ్లాప్ ఖాయం అని ఫిక్సవుతారు ప్రేక్షకులు. ఇప్పుడు గేమ్ చేంజర్ విషయంలోనూ అదే జరుగుతుందని అంటున్నారు. కేవలం ఫన్ కోసమే ఉమైర్ ఇలాంటి రివ్యూస్ ఇస్తాడని కామెంట్స్ చేస్తున్నారు.
Pavitra lokesh: పవిత్ర మాటలను అపవిత్రం చేసేశారు.. మరీ ఇంత అరాచకంగా ఉన్నారేంట్రా బాబూ!