KTR Self Goals: ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ సెల్ఫ్ గోల్స్ చేసుకుంటున్నారు. న్యాయపోరాటం పేరుతో తనపై వస్తున్న ఆరోపణలన్నీ నిజమేనని ప్రజలు అనుకునేలా చేసుకుంటున్నారు. అంతా చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని బెదిరిస్తున్నారు. కానీ అలాంటి బెదిరింపులకు రాజకీయాలు లొంగవన్న సంగతిని మాత్రం మరచిపోతున్నారు. తాను దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను మాత్రమే హైకోర్టు కొట్టి వేసిందని ఇంత మాత్రం దానికే .. తాను అవినీతి చేసినట్లుగా నిర్దారణ అయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. తనకు న్యాయపోరాటం చేసే హక్కు ఉందన్నారు. అందుకే సుప్రీంకోర్టుకు వెళ్లానన్నారు. ఈ విషయంలో కేటీఆర్ హక్కుల్ని ఎవరూ కాదనలేరు…కానీ రాజకీయంగా జరిగే ప్రచారాన్ని మాత్రం ఆయన ఆపలేరు. తాను అవినీతి చేశానని ప్రజల్లో బలంగా చర్చ జరిగేలా ఆయన చేసుకుంటున్నారని సులువుగా అర్థమైపోతుంది.
ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్న తెలంగాణ హైకోర్టు
హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టివేయడం అంటే అందులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. ప్రజల్లో ఇదే చర్చ జరుగుతుంది. క్వాష్ పిటిషన్ వేసే ముందు కేటీఆర్ రాజకీయపరంగా ఆలోచించాల్సి ఉంది. కానీ ఆలోచించలేదు. ఆయన నేరుగా క్వాష్ దాఖలు చేశారు. కేసుల్ని క్వాష్ చేసే అధికారం పరిమితంగానే ఉంటుందని హైకోర్టు కూడా తీర్పులో స్పష్టం చేసింది. గవర్నర్ అనుమతి మంజూరు చేసిన ఓ కేసును క్వాష్ చేయడం అంత తేలిక కాదు. న్యాయనిపుణులు కేటీఆర్ కు ఈ విషయంలో సరైన సలహాలు ఇవ్వలేదని అనుకోవచ్చు. అందుకే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
సుప్రీంకోర్టులో తిరస్కరిస్తే అదే పరిస్థితి
కానీ మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇలాంటి కేసుల్లో రిలీఫ్ దొరకడం దాదాపుగా అసాధ్యం. విచారణ చేయకుండా కోర్టులు కేసులు కొట్టివేయవు. పైగా ఇప్పటికే ఏసీబీ, ఈడీ రెండూ దూకుడుగా విచారణ జరుపుతున్నాయి. రూ. 55 కోట్లు ఎలాంటి అధికారిక ప్రక్రియ లేకుండా ఖాతాల్లోంచి వెళ్లిపోయాయి. ఇవి కళ్ల ముందు కనిపిస్తున్న ఆధారాలు. ఇలాంటి సమయంలో కోర్టులు కొట్టివేయవు. అక్కడ ఎదురుదెబ్బ తగిలిదే.. తెలంగాణలో ఖచ్చితంగా కేటీఆర్ ఏదో చేసి ఉంటాయన్న నమ్మకం బలపడుతుంది. అది జరుగుతుందని తెలిసి కూడా న్యాయపోరాటం చేస్తున్నారు. విచారణకు సహకరిస్తానని చెబుతున్నారు కానీ..వాయిదాలు వేస్తూ.. సహకరించడం లేదన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నారు. కేటీఆర్ ఈ విషయంలో మరింత కేర్ ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. న్యాయపరమైన ప్రక్రియ చాలా కాలం సాగుతుంది..కానీ ..కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగిలితే .. మాత్రం ప్రజల్ల. ఇన్ స్టంట్‌గాఓ అభిప్రాయం ఏర్పడుతుంది. అది చాలా డేంజర్.
ధైర్యంగా జైలుకెళ్తే పొలిటికల్ మైలేజీ
కేటీఆర్ తాను అవినీతి చేయలేదని గట్టిగా నమ్ముతున్నారు. అలాంచప్పుడు ఆయన ధైర్యంగా విచారణ ఎదుర్కోవచ్చు. ఇలా ఎదుర్కొంటే.. ఆయన తప్పు లేదని ప్రజలు అనుకుంటారు. ఎన్ని వేధింపులు ఎదురైతే రాజకీయంగా అంత సానుభూతి వస్తుంది. జైల్లో పెడితే ఇక రాజకీయంగా పండగే. కానీ ఈ అవకాశాల్ని కేటీఆర్ వదిలేసుకుని తన ఇమేజ్ గురించి తప్పుడు ప్రచారం జరిగేలా చేసుకుంటున్నారు. సెల్ఫ్ గోల అంటే ఇదే మరి.