BCCI New Rules List: టీమిండియా కోసం 10 రూల్స్ సిద్ధం చేసిన బీసీసీఐ – పాటించకుంటే టీమ్ నుంచి అవుట్!

bcci 10 rules

BCCI New Rules List: వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియాలో క్రమశిక్షణ లోపించిందని ఆరోపణలు చెక్‌ పెట్టేలా పది కఠినమైన రూల్స్ రూపొందించింది. అవి పాటించే వాళ్లు మాత్రమే జట్టులో ఉంటాలని స్పష్టమైన సంకేతాలు పంపించింది.

ఆటగాడు కానీ టీమ్ సిబ్బంది కానీ ఈ రూల్స్ అతిక్రమిస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరికలు పంపించింది. దేశవాళీ క్రికెట్ ఆడడాన్ని తప్పనిసరి చేసిన బీసీసీఐ అక్కడ చేసిన ప్రదర్శన ఆధారంగానే తుది జట్టును ఎంపిక చేయబోతోంది. అలాంటి 10 రూల్స్‌ను తీసుకొచ్చింది.

1. దేశవాళీ క్రికెట్ ఆడటం తప్పనిసరి
భారత ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌లో కచ్చితంగా ఆడాల్సినంటూ బీసీసీఐ తేల్చి చెప్పింది. దేశవాళీ క్రికెట్‌లో చూపించిన ప్రతిభ ఆధారంగానే భారత జట్టును ఎంపిక చేస్తామంటూ స్పష్టం చేసింది. దీని వల్ల సీనియర్, జూనియర్ ఆటగాళ్ల మధ్య రిలేషన్ బాగుంటుందని అదే టైంలో జట్టు, టీమిండియా వాతావరణాన్ని మెరుగు పడుతుందని అంటున్నారు.
బీసీసీఐ, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అనుమతితో సరైన కారణాలతో దేశవాళి క్రికెట్ ఆడకుండా ఉండొచ్చు. దేశవాళీ క్రికెట్‌తోపాటు ఫిట్‌నెస్‌ను కూడా కాపాడుకోవాల్సి బాధ్యత అటగాళ్లకు ఉంది.

2. టూర్‌లో నో ఫ్యామిలీ
ఇకపై విదేశీ, స్వదేశీ టూర్లలో ప్లేయర్లు జట్టుతోనే ట్రావెల్ చేయాలి. కుటుంబాలతో కలిసి వెళ్లడానికి లేదు. దీన్ని అతిక్రమిసేత మాత్రం కఠిన చర్యలు తీసుకుంటారు. అలా చేయాల్సి వస్తే ప్రధాన కోచ్, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ నుంచి అనుమతి తీసుకోవాలి.

3. ఎక్కువ లగేజీని తీసుకెళ్లలేరు
ప్రయాణ సమయంలో ఏ ఆటగాడు ఎక్కువ లగేజీని తీసుకెళ్లడానికి లేదు. మీరు తీసుకెళ్లే లగేజీ ఎక్కువ బరువు ఉంటే దానికి అయ్యే ఖర్చును చెల్లించుకోవాల్సి ఉంటుంది. దీని కోసం బీసీసీఐ ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించింది.

సుదీర్ఘ పర్యటనలు అంటే 30 రోజుల కంటే ఎక్కువ ఉంటే టూర్‌లలో
ఆటగాళ్ళు – 5 పీస్‌లు(3 సూట్‌కేసులు + 2 కిట్ బ్యాగ్‌లు) లేదా 150 కిలోల వరకు లగేజీ తీసుకెళ్ల వచ్చు. సహాయక సిబ్బంది అయితే 2 పీస్‌లు (2 పెద్ద + 1 చిన్న సూట్‌కేస్) లేదా 80 కిలోల వరకు లగేజీ తీసుకెళ్ల వచ్చు.

30 రోజుల కంటే తక్కువ ఉంటే చిన్న పర్యటనలకు ఆటగాళ్ళు 4 పీస్‌లు (2 సూట్‌కేసులు + 2 కిట్ బ్యాగ్‌లు) లేదా 120 కిలోల వరకు లగేజీ తీసుకెళ్ల వచ్చు. సహాయక సిబ్బంది – 2 పీస్‌లు (2 సూట్‌కేసులు) లేదా 60 కిలోలతో ట్రావెల్ చేయవచ్చు.

దేశీయ సిరీస్‌ల కోసం ఆటగాళ్ళు 4 పీస్‌లు (2 సూట్‌కేసులు + 2 కిట్ బ్యాగ్‌లు) లేదా 120 కిలోలతో పర్యటించాలి. సహాయక సిబ్బంది – 2 పీస్‌లు (2 సూట్‌కేసులు) లేదా 60 కిలోల వరకు లగేజీ తీసుకెళ్ల వచ్చు.

4. బెంగళూరుకు ప్రత్యేక షిప్పింగ్
బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు లగేజీ పంపేందుకు ప్రతి క్రీడాకారుడు జట్టు మేనేజ్‌మెంట్‌ను సంప్రదించాలి. ఒక వస్తువును వేరే మార్గాల్లో పంపితే, అదనపు ఖర్చును ప్లేయర్ భరించాలి.

5. వ్యక్తిగత సిబ్బందిపై నిషేధం
ఏదైనా పర్యటన లేదా సిరీస్‌లో వ్యక్తిగత సిబ్బందిపై అంటే వ్యక్తిగత నిర్వాహకులు, చెఫ్‌లు, సహాయకులు, సెక్యూరిటీని నిషేధించింది. బీసీసీఐ నుంచి అనుమతి తీసుకుంటే ఫర్వాలేదు.

6. ప్రాక్టీస్ సెషన్లకు తప్పనిసరిగా హాజరు కావాలి
ప్రాక్టీస్ సెషన్‌లో ప్రతి ఆటగాడు తప్పనిసరిగా హాజరుకావాలని బీసీసీఐ తేల్చి చెప్పింది. ఏ ఆటగాడు ప్రాక్టీస్ సెషన్‌ పూర్తి కాకుండానే గ్రౌండ్ వీడటానికి లేదు. సిరీస్ లేదా టోర్నమెంట్ సమయంలో, జట్టుతో కలిసి ఒక వేదిక నుంచి మరొక వేదికకు వెళ్లాలి.

7. ప్రకటనలపై ఆంక్షలు
సిరీస్, వ్యక్తిగత పర్యటనల సమయంలో ఆటగాళ్లు ఇకపై వ్యక్తిగత షూట్‌లు చేయడానికి అనుమతి లేదు. ఈ కాలంలో ఎలాంటి యాడ్స్‌ చేయలేరు. వారి ఏకాగ్రత దెబ్బతినకుండా దీన్ని ఫ్రేమ్ చేశారు.

8. ఫారిన్ టూర్‌లో కుటుంబంతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేరు.
ఒక ఆటగాడు 45 రోజుల పాటు విదేశీ పర్యటనలో ఉంటే, అతని భార్య, 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు రెండు వారాలు ఉండవచ్చు. ఈ కాలంలో వారి బస ఖర్చులను BCCI భరిస్తుంది, అయితే మిగిలిన ఖర్చులను ఆటగాడు భరించాలి. ఎవరైనా కోచ్, కెప్టెన్‌తో చర్చించిన తర్వాత మాత్రమే చివరి తేదీకి ఆటగాడి వద్దకు రావచ్చు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే, కోచ్, కెప్టెన్, GM దీనికి బాధ్యత వహిస్తారు. గడువు ముగిసిన తర్వాత ఆటగాడు స్వయంగా ఖర్చులను భరిస్తాడు.

9. అధికారిక షూట్‌లలో పాల్గొనవలసి ఉంటుంది
BCCI అధికారిక షూట్‌లు, ప్రమోషన్లు, ఏదైనా ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు ప్రతి ఆటగాడు పాల్గొనవలసి ఉంటుంది. క్రీడలను ప్రోత్సహించడానికి, స్పోన్సర్స్‌ ప్రయోజనం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.

10. సిరీస్ ముగిసిన త్వరగా ఇంటికి తిరిగి రావడానికి లేదు.
టూర్ ముగిసే వరకు ప్రతి ఆటగాడు జట్టుతోనే ఉండాల్సి ఉంటుంది. సిరీస్ ముందుగానే ముగిసినప్పటికీ ఆటగాడు జట్టుతో ఉండవలసి ఉంటుంది. ప్రతి క్రీడాకారుడు నిర్ణీత తేదీన జట్టుతో తిరిగి వస్తాడు. ఈ కాలంలో, ఏ ఆటగాడు త్వరగా ఇంటికి రాలేరు.

ఐపీఎల్‌లో ఆడటానికి అభ్యంతరం 
మార్గదర్శకాల ముగింపులో, ఆటగాళ్లందరూ పై మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని భావిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఒక ఆటగాడు వీటిలో దేనినైనా అనుసరించలేకపోతే, అతను సెలక్షన్ కమిటీ ఛైర్మన్, ప్రధాన కోచ్ నుంచి అనుమతి తీసుకోవాలి. ఎవరైనా ఆటగాడు తప్పు చేసి పట్టుబడితే క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చు.నిబంధనలను సరిగ్గా పాటించకపోతే టోర్నీలు, సిరీస్‌లు, ఐపిఎల్‌లో ఆడటానికి బోర్డు అనుమతించదు. ఇది కాకుండా, బోర్డు ఆటగాళ్ల జీతాలు, ఒప్పందాలు రద్దు చేస్తుంది.

తరవాత కథనం