Pawan Kalyan Matavinali: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘హరి హర వీరమల్లు’ తొలి పాట వచ్చేసింది. స్వయంగా పవన్ కల్యాణ్ పాడిన పాట ఇప్పుడు సంచలనంగా మారుతోంది. మాట వినాలంటూ హెచ్చరిస్తూ ఆలపించిన గీతం ఆకట్టుకుంటోంది. మొన్నటి వరకు క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఇప్పుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
‘హరి హర వీరమల్లు’ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం ‘హరిహర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో మార్చి 28న విడుదల చేయనున్నారు. కీరవాణి సంగీతం అందించిన మాటవినాలి పాట పూర్తి లిరిక్స్ ఇక్కడ చూసేయండి
ఏమ్రో గుల్ఫమ్… ఏం గురాయించి చూస్తన్నావ్. భయపెట్టనీకా…! నారాజున్నావ్!
ఓహో… సాలా మందిని చూసినంలే బిడ్డా
ఏం ముని మాణిక్యం సూచినావా! ఓ గురాయించి సూస్తున్నాడు బిడ్డా, మన లెక్క తెల్వద్.
ఆహా! వినాలి,… వీరమల్లు మాట చెబితే వినాలి!
అబ్బన్నా సుబ్బన్నా,…. కొట్టో…
మాట వినాలీ గురుడా…. మాట వినాలీ..
మాట వినాలీ మంచి మాట వినాలీ…
ఉత్తదిగాదు మాట తత్తరపడకా… చిత్తములోన చిన్న ఒద్దికుండాలీ….
మాట వినాలీ గురుడా…. మాట వినాలీ..
మాట వినాలీ మంచి మాట వినాలీ…
ఈత మాను ఇల్లు కాదు తాటి మాను తోవ కాదూ…
ఈత మాను ఇల్లు కాదు తాటి మాను తోవ కాదూ…
తగిలినోడు మొగుడు కాదు, తగరం బంగారం కాదూ…
అందుకే…
మాట వినాలీ గురుడా…. మాట వినాలీ..
మాట వినాలీ మంచి మాట వినాలీ…
ఆకులేని అడవిలోనా… అరెరే మేకలన్నీ మేయావచ్చూ…
సద్దులేని కోనలోనా… కొండచరియా కూల వచ్చూ…
మాట దాటిపోతే….
మర్మం తెలియకపోతే….
మాట దాటిపోతే…. మర్మం తెలియకపోతే….
పొగరుబోతు తగురుపోయి కొండను తాకీనట్టు….
మాట వినాలీ గురుడా…. మాట వినాలీ..
మాట వినాలీ మంచి మాట వినాలీ…