Thandel Story: అక్కినేని నాగచైతన్య కెరీర్లో హయ్యెస్ట్ బడ్జెట్‌తో వస్తున్న మూవీ తండేల్. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయ్. అయితే ఇప్పటివరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే ఇది మణిరత్నం కల్ట్ క్లాసిక్ మూవీ కథలానే అనిపిస్తోందంటున్నారు ప్రేక్షకులు.. ఇంతకీ ఏంటా సినిమా..
ఓల్డ్ స్టోరిని నమ్ముకుని తండేల్ కోసం భారీ బడ్జెట్ పెట్టారా? ఇండస్ట్రీలో ఇప్పుడిదే హాట్ టాపిక్. అక్కినేని ఇంటి వారసుడు అనే మార్క్ తప్ప నాగచైతన్య కెరీర్లో చెప్పుకునేందుకు భారీ హిట్ ఏమీ లేదు. అలాగని అఖిల్ తో పోలిస్తే నాగచైతన్య వెయ్యిరెట్లు బెటర్. కథల ఎంపికలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ హిట్స్ అందుకుంటూ కెరీర్ ని బాగానే లాక్కొస్తున్నాడు. కొంతకాలంగా చైతూకి హిట్ పడడం లేదు. అందుకే తండేల్ కోసం చాలా కష్టపడ్డాడు. ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. పైగా తనకు కలిసొచ్చిన సాయిపల్లవి హీరోయిన్ కావడంతో హిట్ పక్కా అనే నమ్మకంతో ఉన్నాడు. ఇప్పటివరకూ వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్…బుజ్జితల్లి సాంగ్ , శివుడి సాంగ్ ఇవన్నీ మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. భారీ బడ్జెట్‌తో వచ్చే కల్ట్ లవ్ స్టోరీ తండేల్ అని మేకర్స్ ఇప్పటికే హైప్ ఇచ్చారు. తండేల్ రాజు – బుజ్జమ్మ అందమైన ప్రేమకథగా చెబుతున్నారు. అద్భుతమైన డెప్త్ ఉన్నట్టు కనిపిస్తోన్న ఈ ప్రేమకథ..పాతకథే అనే డిస్కషన్ నడుస్తోంది.
ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం…ఒకప్పటి కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ రోజాను పోలి ఉంటుందట తండేల్ స్టోరీ. మణిరత్నం దర్శకత్వంలో అరవిందస్వామి, మదుబాల నటించిన రోజా మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఓ వైపు కథ, మరోవైపు పాటలు సినిమాకు ప్లస్ అయ్యాయి. అరవిందస్వామి, మదుబాల నటనకు నూటికి నూరు మార్కులు పడ్డాయ్. ఈ మూవీలో హీరోని ఉగ్రవాదులు కిడ్నాప్ చేయడం, విడిపించుకునేందుకు మదుబాల చేసే ప్రయత్నాలు, భర్తకోసం ఎదురుచూపులు ప్రేక్షకుల కంట కన్నీళ్లుపెట్టిస్తాయి. ఇప్పుడు తండేల్ స్టోరీ కూడా సేమ్ టు సేమ్ ఉండబోతోందని టాక్. తీర ప్రాంతంలో చేపలు పడూతూ… బుజ్జమ్మే జీవితం అంటూ బతికే తండేల్ రాజును వేటకు వెళ్లినప్పుడు తీవ్రవాదులు కిడ్నాప్ చేస్తారు. రాజు ప్రాణాలతో రావాలని సాయిపల్లవి ఎదురుచూస్తూ మరోవైపు ఒంటరి పోరాటం చేస్తుందట. సాయిపల్లవి ప్రయాణం హార్ట్ టచింగ్ గా ఉండబోతోందని టాక్.
ఈ ప్రచారంలో నిజం ఎంతో తెలియదు కానీ ఇంచుమించు రోజా స్టోరీనే అంటున్నారంతా. ప్రచారం జరుగుతున్నట్టు ఇదే కథ అయితే నాగచైత్యన్య ప్రేక్షకుల అంచనాలు అందుకోవడం కష్టమే. అయితే తండేల్ రాజు క్యారెక్టర్ కోసం నాగచైతన్య పడిన కష్టం, సాయిపల్లవి నటన ప్రేక్షకులను ఫిదా చేయడం ఖాయం అంటున్నారు మేకర్స్. ఫిబ్రవరి 7న థియేటర్లలోకి రాబోతున్న తండేల్ మూవీకి సంబంధించి ప్రమోషన్ జోరందుకుంది. లేటెస్ట్ గా మరో పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్…కట్టెల పొయ్యిపై మట్టి కుండలో వంట చేస్తూ కనిపించాడు నాగచైతన్య. మరి ప్రచారం జరుగుతున్నట్టు సేమ్ టు సేమ్ రోజా కథే అయితే ప్రేక్షకుల నుంచి కొంత వ్యతిరేకత రావొచ్చు కానీ…కథలో కొత్తదనం ఉంటే మాత్రం బ్లాక్ బస్టర్ పక్కా.
Pavitra lokesh: పవిత్ర మాటలను అపవిత్రం చేసేశారు.. మరీ ఇంత అరాచకంగా ఉన్నారేంట్రా బాబూ!