Prabhas Hanu Raghavapudi Fauji: ప్రభాస్-హనురాఘవపూడి కాంబినేషన్లో వస్తోన్న ఫౌజీ మూవీకి సంబంధించి షూటింగ్ జరుగుతూనే ఉంది కానీ ఇప్పటివరకూ మేజర్ షెడ్యూల్ మొదలుకాలేదు. సినిమా ప్రారంభమైన నాటి నుంచి గ్యాప్ లేకుండా హను అండ్ కో షూటింగ్ లో బిజీగానే ఉంది. లొకేషన్లు సెలెక్ట్ చేసుకుని కొన్ని సన్నివేశాల షూటింగ్ కంప్లీట్ చేశారు. అయితే ఇప్పటివరకూ ప్రభాస్ రంగంలోకి దిగలేదు.
కల్కి 2898 AD తర్వాత రాజాసాబ్ తో బిజీగా ఉండడంతో టైమ్ దొరకలేదు. ఇప్పుడు రాజాసాబ్ చివరికొచ్చేసింది..సమ్మర్ కానుకగా రిలీజ్ కాబోతోంది. ఆ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యేలోగా దొరికిన గ్యాప్ లో ఫౌజీకోసం టైమ్ ఇచ్చేశాడు ప్రభాస్. దొరికించే ఛాన్స్ అన్నట్టు హను రాఘవపూడి భారీ షెడ్యూల్ ప్లాన్ చేశాడు.
వచ్చే వారం నుంచి హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. ఇందులో కీలకమైన యాక్షన్ సీన్స్ తో పాటూ కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా షూట్ చేయబోతున్నారట. లాంగ్ షెడ్యూల్ కావడం, ప్రభాస్ టైమ్ కేటాయించడంతో..సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నవారంతా కూడా షూట్ కి జాయిన్ అవుతున్నారు. ఈ షెడ్యూల్ లోనే కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తిచేసేస్తాడట హను రాఘవపూడి.
ఫౌజీ స్టోరీలో భాగంగా వచ్చే ట్విస్ట్ లు ఓ రేంజ్ లో ఉంటాయని మూవీ యూనిట్ చాలాసార్లు చెప్పుకొచ్చింది. స్వాతంత్ర్యానికి పూర్వం 1940 బ్యాక్ డ్రాప్ లో సాగే కథ కావడంతో అప్పటి వాతావరణాన్ని ప్రతిబంబించేలా సెట్స్ వేస్తున్నారు. మరోవైపు..ఈ మూవీలో హను స్టైల్లో సాగే లవ్ స్టోరీతో పాటూ బలమైన డ్రామా, భారీ యాక్షన్ సీన్స్ కూడా ఉండబోతున్నాయి. దేశభక్తి కూడా ఉంటుందండోయ్.
ఓవరాల్ గా ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లాలా ఫౌజీ ఉండబోతోందని బలంగా చెబుతున్నారు. అల్యూమినియం ఫ్యాక్టరీతో పాటూ రామోజీ ఫిలిం సిటీలోనూ భారీ సెట్స్ వేస్తున్నారట. సీతారామం స్టోరీలా ఫౌజీకి కూడా ఏదైనా స్ఫూర్తి ఉందేమో చూడాలి. ఈ మూవీలో ప్రభాస్ కి జోడీగా కొత్త పిల్ల ఇమాన్వీ ఇస్మాయిల్ నటిస్తోంది.
ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉన్న రాజాసాబ్ ఏప్రిల్ 10 న థియేటర్లలో సందడి చేయబోతోంది. అంటే కనీసం నెల ముందు నుంచి మార్చి నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు ఈ సమ్మర్లో కల్కి 2898 AD సీక్వెల్ షూటింగ్ ప్రారంభం కాబోతోందని నిర్మాత అశ్వినీదత్ హింట్ ఇచ్చారు. అంటే రాజాసాబ్ రీలీజ్ తర్వాత డార్లింగ్ కల్కి సీక్వెల్ పై కాన్సన్ ట్రేట్ చేసే అవకాశం ఉంది. ఈ లోగా దొరికిన కాస్త టైమ్ ని ఫౌజీకి కేటాయించేశాడు ప్రభాస్.
జనవరి ఆఖరివారంలో మొదలయ్యే ఈ లాంగ్ షెడ్యూల్ లోనే ఫౌజీ మూవీకి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తికానుందని టాక్. ఫౌజీ లాంగ్ షెడ్యూల్, రాజాసాబ్ ప్రమోషన్…ఆ తర్వాత కల్కి సీక్వెల్ షూటింగ్…ఇవన్నీ ఓ కొలిక్కి వచ్చేస్తే ప్రశాంత్ నీల్ తో సలార్ సీక్వెల్ శౌర్యాంగపర్వం… సందీప్ రెడ్డి వంగ తో స్పిరిట్ పెండింగ్..ఓవరాల్ గా వరుస ప్రాజెక్ట్స్ తో డార్లింగ్ కి క్షణం కూడా తీరికలేనట్టే మరి…
Pavitra lokesh: పవిత్ర మాటలను అపవిత్రం చేసేశారు.. మరీ ఇంత అరాచకంగా ఉన్నారేంట్రా బాబూ!