SIM card new rules: సైబర్ నేరాలు, మోసాలను అరికట్టడానికి ప్రభుత్వం కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. తాజాగా, కొత్త SIM కార్డులు కొనుగోలు చేయడానికి ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ వేరిఫికేషన్ తప్పనిసరి చేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ (DoT) ఆదేశాలు జారీ చేసింది. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) సూచనల మేరకు తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా, SIM కార్డు కొనుగోలు చేసిన వ్యక్తి ఆధార్ బయోమెట్రిక్ ధ్రువీకరణ ద్వారా తమ ఐడెంటీని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం, సైబర్ నేరాలు, మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో తీసుకున్న ఒక కీలకమైన చర్యగా అభివర్ణించవచ్చు.
కొత్త వేరిఫికేషన్ ప్రక్రియలో వచ్చిన మార్పులివే
గతంలో SIM కార్డు కొనడం చాలా సులభంగా, తేలికగా ఉండేది. వినియోగదారులు ఆధార్ కార్డు, పాస్పోర్ట్ లేదా ఓటర్ ఐడీ వంటి ప్రభుత్వ పత్రాలను సమర్పించి SIM కార్డ్ పొందేవారు. కానీ తాజా నియమాల ప్రకారం, SIM కార్డుల యాక్టివేషన్ కోసం ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ వేరిఫికేషన్ అవసరం. ఈ ప్రక్రియ ద్వారా వినియోగదారుల గుర్తింపు పూర్తిగా ధ్రువీకరించబడుతుంది. నకిలీ పత్రాలతో SIM కార్డులు పొందడం కష్టతరం అవుతుంది.
రిటైలర్లు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధ్రువీకరణ లేకుండా SIM కార్డులు అమ్మడానికి అనుమతించబడవు. ఈ నియమాన్ని ఉల్లంఘించిన రిటైలర్లపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ నిర్ణయం, మోసాలు మరియు ఇతర నేరాల నుండి రక్షణ అందించే లక్ష్యంతో తీసుకోవడమైనది.
ఫేక్ SIM కార్డులపై ప్రభుత్వం చర్యలు
ఇటీవల టెలికాం శాఖ (DoT) నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అనేక SIM కార్డులు ఒకే పేరులో ఉండటం వల్ల సైబర్ నేరాలు పెరిగినట్లు అధికారులు గుర్తించారు. వాటికి అడ్డుకట్ట వేసేందుకు సిమ్ కార్డుల విక్రయాలపై కఠిన చర్యలు తప్పనిసరి. ఈ SIM కార్డుల ద్వారా ఫిషింగ్, ఐడెంటిటీ థెఫ్ వంటి సైబర్ స్కామ్స్ జరుగుతున్నాయి. వాటి ద్వారా నేరస్తులను గుర్తించడం కష్టంగా మారుతోంది.
ఇప్పుడు, ఆధార్ ఆధారిత ధ్రువీకరణ ద్వారా SIM కార్డులు వ్యక్తిగత ఆధారాలను కాపాడగలవని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విధానం, టెలికాం కంపెనీలు, చట్టవ్యవస్థలు సైబర్ నేరాలను అరికట్టడానికి మరింత సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం కల్పిస్తుంది.
ఇలా అడ్డుకట్ట వేస్తారు
ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ వేరిఫికేషన్ అమలు చేయడం.. సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న మరొక కీలకమైన చర్య. SIM కార్డులు ఒక వ్యక్తి ఆధార్ వివరాలతో అనుసంధానించబడ్డాయి, దీంతో నేరస్తులను త్వరగా గుర్తించి చర్యలు తీసుకోవడం సులభం అవుతుంది. టెలికాం సంస్థలు మరియు చట్టసేవా సంస్థలు సంయుక్తంగా పనిచేసే విధానం కూడా సైబర్ నేరాలను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఈ పోర్టల్తోనూ.. సైబర్ నేరాలకు అడ్డుకట్ట..
సైబర్ నేరాల అరికట్టేందుకు మరో ముఖ్యమైన టూల్ సంచార్ సాథి పోర్టల్. ఈ పోర్టల్ ద్వారా వినియోగదారులు సైబర్ మోసాలు, ఫోన్ల కొన్నీ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలను నివేదించవచ్చు. పోర్టల్ ద్వారా తీసుకున్న ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడం త్వరగా జరుగుతుంది. అదే విధంగా, ఫోన్ పోయినపుడు దాన్ని బ్లాక్ చేయడం కూడా ఈ పోర్టల్ ద్వారా సాధ్యమవుతుంది.
కొత్త SIM కార్డ్ కొనుగోలు కోసం ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ వేరిఫికేషన్ ని తప్పనిసరి చేయడం, సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయంగా చెప్పవచ్చు. ఇది ఆధార్ ఆధారంగా వ్యక్తిగత వివరాలు ధ్రువీకరించడం ద్వారా నకిలీ SIM కార్డుల వినియోగాన్ని నివారిస్తుంది. కొంతమేర కష్టతరమైన ప్రక్రియ అయినా, ఇది సురక్షితమైన టెలికాం వ్యవస్థను నిర్మించేందుకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.