Mad Square: మ్యాడ్ బ్లాక్‌బస్టర్ తర్వాత ప్రేక్షకులను మళ్లీ నవ్వించేందుకు సిద్ధమవుతోంది మ్యాడ్ స్కేర్. ఫస్ట్ పార్ట్ కి ఊహించని రేంజ్ క్రేజ్ రావడంతో సెకెండ్ పార్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయ్. ఈ సినిమా ఎలాంటి టీజర్ లేకుండానే సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పటికే విడుదలైన ‘లడ్డూ గాని పెళ్లి’ ‘స్వాతి రెడ్డి’ సాంగ్స్ కూడా టాప్ ట్రెండింగ్ లిస్టులో మోత మోగించేస్తున్నాయ్. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించారు. లేటెస్ట్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
మార్చి 29న మ్యాడ్ స్కేర్
మార్చి 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు మ్యాడ్ స్కేర్ మేకర్స్. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ కూడా అదిరిపోయింది . “మరింత ఫన్ మీ కోసం, మరింత మాడ్‌నెస్ మీ ఊహలకు మించినది” అంటూ మేకర్స్ పెట్టిన పోస్ట్ సినిమాపై అంచనాలు మరింత పెంచాయ్. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీతో వస్తోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూర్చాడు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఈ సినిమాకు ఎడిటర్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ ఇది. సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రానికి సమర్పకులు.
అప్పుడు కాలేజ్..ఇప్పుడు పర్సనల్ లైఫ్
2023లో విడుదలైన మాడ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్ లో క్లిక్కైంది. అందుకే జెట్ స్పీడ్ తో మ్యాడ్ స్కేర్ తెరకెక్కించారు. ఫస్ట్ పార్ట్ మొత్తం కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిస్తే..సెకెండ్ పార్ట్ లో వారి వ్యక్తిగత లైఫ్ స్టైల్ చూపించబోతున్నారని టాక్. ఫస్ట్ పార్ట్ ని మించిన కామెడీతో నింపేశారట.
మ్యాడ్ గ్యాంగ్‌ను సరికొత్తగా పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. ట్రెడిషనల్ డ్రెస్సులో ముగ్గురు స్నేహితులు పిచ్చెక్కించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ కూడా కుమ్మేస్తున్నాయ్. భారీ అంచనాల మధ్య సమ్మర్ ఆరంభంలో వచ్చేస్తోంది మ్యాడ్ స్కేర్.
కాలేజి క్యాంపస్‌లో చదువు, స్టూడేంట్స్ మనస్తత్వం, పోటీ ప్రపంచంలో విద్యార్థుల ఇబ్బందిపడే తీరు..ఇవన్నీ ఎప్పటికీ ట్రెండింగ్ లో ఉండే కథా వస్తువులే. ఈ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన కథలన్నీ హిట్టే. హ్యాపీడేస్ , కేరింత, 3 ఇడియట్స్ ఇవన్నీ ఈ బ్యాక్ డ్రాప్ లో వచ్చి హిట్ కొట్టినవే. మ్యాడ్ కూడా అలాంటి మూవీనే. పైగా ఆద్యంతం నవ్వులే నవ్వులు…పూర్తిస్థాయిలో ప్రతి ఫ్రేమ్, ప్రతిడైలాగ్ ని ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు. మ్యాడ్ విషయంలో వచ్చిన రియాక్షన్ చూశాకే మ్యాడ్ స్కేర్ ప్లాన్ చేశారు మేకర్స్. అప్పుడు కాలేజ్ డేస్ అయితే ఇప్పుడు పర్సనల్ లైఫ్ అన్నమాట. పైగా లడ్డుగాని పెళ్లినే సాంగ్ రిలీజ్ చేశారు కదా.. అంటేమ్యాడ్ స్కేర్ లో పెళ్లిళ్లు అయిపోతాయి.
వాస్తవంగా చెప్పాలంటే సమ్మర్ కి మ్యాడ్ స్కేర్ శుభారంభం అవుతుందంటున్నారు మేకర్స్ . మరి అందరి అంచనాలను మ్యాడ్ స్కేర్ అందుకుంటుందా.. దీనికి కంటిన్యూగా మ్యాడ్ క్యూబ్ కూడా వస్తుందా? వెయిట్ అండ్ వాచ్..
Pavitra lokesh: పవిత్ర మాటలను అపవిత్రం చేసేశారు.. మరీ ఇంత అరాచకంగా ఉన్నారేంట్రా బాబూ!