Sathyaraj Daughter Divya Joined in DMK: తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాలుగా సినీతారలే రాజకీయాల్ని ఏలారు. ఈ మధ్య కమల్ హాసన్, రజనీకాంత్ లాంటివారు అడుగు వెనక్కు వేశారు కానీ MGR, కరుణానిథి, జయలలిత…వీళ్లంతా రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించారు. విజయ్ కాంత్ కూడా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. ప్రస్తుతం యంగ్ హీరో ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. లేటెస్ట్ గా సత్యరాజ్ కుమార్తె దివ్య తమిళ రాజకీయాల్లో అడుగుపెట్టారు.
బాహుబలి సినిమాలో కట్టప్పగా ప్రేక్షకులకు చేరువైన సత్యరాజ్ కుమార్తె దివ్య DMK లో చేరారు. తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ సమక్షంలో ఆమె DMK తీర్థం పుచ్చుకున్నారు. పోషకాహార నిపుణురాలైన దివ్య సత్యరాజ్ డీఎంకేలో చేరిన విషయాన్ని ఆ పార్టీ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఎంకే ఎంపీ టీఆర్ బాలు, పార్టీ నేతలుు కేఎన్ నెహ్రూ, పీకే శేఖర్‌బాబు సహా ఇతర పార్టీ నిపుణులు పాల్గొన్నారు.
2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆమె స్టాలిన్‌ను కలిసినప్పుడే DMK లో చేరుతారనే భారీ డిస్కషన్ జరిగింది. అప్పట్లో అది కేవలం మర్యాదపూర్వక భేటీయేనని, ఇరు కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అప్పట్లో వివరణ ఇచ్చారు. తాజాగా DMK లో చేరిన తర్వాత మాట్లాడిన దివ్య..ప్రజలకు సేవ చేయాలనేది తన కల అని..చిన్నప్పటి నుంచీ DMK విధానాలను ఇష్టపడినట్టు చెప్పారు. తాను ఆ పార్టీలో చేరేందుకు ఎన్నో కారణాలున్నాయన్నారు. తానొక పోషకాహార నిపుణురాలినని DMK ఆరోగ్యానికి ప్రాధాన్యమిచ్చే పార్టీ అని..అందుకే రాష్ట్రంలో అల్పాహార కార్యక్రమాన్ని సైతం ప్రారంభించిందని తెలిపారు. మహిళలను, అన్ని మతాలను గౌరవించే పార్టీ DMK అని దివ్య కొనియాడారు.
పార్టీలో చేరిన సమయంలో ఆమె డీఎంకే పార్టీ జెండాలో ఉన్న నలుపు-ఎరుపు రంగులను ప్రతిబింబించేలా చీర కట్టుకోవడం స్పెషల్ అట్రాక్షన్ అయింది. సత్యరాజ్ మొదటి నుంచీ DMKకు అనుకూలంగా ఉన్నారు. ఆ పార్టీ సానుభూతిపరుడిగా ఆయనకు తమిళరాజకీయాల్లో మంచి గుర్తింపు ఉంది. ద్రవిడ సిద్ధాంతాలను అనుసరించడంలో కట్టప్ప చాలా సిన్సియర్ గా ఉంటారు. పెరియార్ సూక్తులు, విధానాలకూ సత్యరాజ్ మద్దతుదారుగా వ్యవహరిస్తుంటారు . 2007లో పెరియార్ బయోపిక్‌లోనూ సత్యరాజ్ కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో దివ్య ప్రత్యక్షరాజకీయాల్లో అడుగుపెట్టారు.
కట్టప్పగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన సత్యరాజ్ భార్య పేరు మహేశ్వరి, కొడుకు శిబిరాజ్. శిబిరాజ్ కూడా తండ్రికి వారసుడిగా తమిళ సినిమాల్లో హీరోగా ఆఫర్లు అందుకున్నాడు. దివ్య సత్యరాజ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చారు..ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. త్వరలో దివ్య రాజకీయాల్లోకి వస్తోందంటూ ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది…ఇప్పటికి వాస్తవం అయింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజనాన్ని అందించే అక్షయ పాత్ర ఫౌండేషన్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా దివ్య వ్యవహరిస్తున్నారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు పౌష్టికాహారం అందించే ఓ NGOను కూడా ప్రారంభించారు.
Pavitra lokesh: పవిత్ర మాటలను అపవిత్రం చేసేశారు.. మరీ ఇంత అరాచకంగా ఉన్నారేంట్రా బాబూ!