Pavitra lokesh: పవిత్ర మాటలను అపవిత్రం చేసేశారు.. మరీ ఇంత అరాచకంగా ఉన్నారేంట్రా బాబూ!

image credit: Instagram

Pavitra lokesh

ఈ ఏజ్ లో నరేష్ ఎనర్జీ మాటల్లేవ్

ముసలాడే కానీ మహానుభావుడు

వయాగ్రాకు బ్రాండ్ అంబాసిడ్

నరేష్ అంత పోటుగాడా?

ఇంకా చెప్పుకుంటే చేంతాడంత లిస్ట్ అవుతుంది…ఇలాంటి టైటిల్స్ తో సోషల్ మీడియాను మోత మోగించేశారు నెటిజన్లు.

ఇంతకీ పవిత్రాలోకేష్ ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నదో తెలుసా?

నరేష్ – పవిత్రా లోకేష్ వీళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇద్దరి మధ్యా ప్రేమ వ్యవహారం పెద్ద రచ్చే జరిగింది. నరేష్ 65వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న పవిత్ర లోకేష్ చేసిన ఓ కామెంట్ వైరల్ అవుతోంది. నరేష్‌ని ఆకాశానికి ఎత్తేసేలా ప్రశంసలు కురిపించింది. తను ఎంతలా కష్టపడతాడో , పనివిషయంలో ఎంత సిన్సియర్ గా వ్యవహరిస్తారో చెప్పేందుకు ప్రయత్నించింది. నరేష్ ఎనర్జీ పదిమందితో సమానం. ఆ రేజ్ ఎనర్జీ ఈ ఏజ్ లో ఎవరికీ సాధ్యం కాదు. రాత్రయితే చాలు నేను అలసిపోతాను కానీ తాను అస్సలు అలసిపోరు. వర్క్ విషయంలో ఆయన చాలా ఎనర్జిటిక్ గా, డెడికేటెడ్ గా ఉంటారని చెప్పుకొచ్చింది. అయితే ఆమె ఏం మాట్లాడిందో వెనుకా-ముందు కట్ చేసేశారు. ఆ మాటల వెనుక ఉద్దేశాన్ని లైట్ తీసుకున్నారు. తమకు నచ్చిన పాయింట్ ని తీసుకుని రచ్చ రచ్చ చేస్తున్నారు. వెకిలి టైటిల్స్ పెట్టి వ్యూస్ కోసం రెచ్చిపోతున్నారు.

పవిత్రా లోకేష్ కన్నడ తార..వాస్తవానికి తెలుగు ఇండస్ట్రీలో, స్మాల్ స్క్రీన్ పైనా కన్నడ కస్తూరీల హవా ఇప్పుడు సాగుతోంది. అందుకే వాళ్లు కూడా తెలుగు భాష నేర్చుకోవడం , మాట్లాడడంపై ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటప్పుడు మాటల్లో కొంత తడబాటు వస్తుందికదా. వాళ్లు నేర్చుకునేందుకు పడే కష్టానికి..మాట్లాడే విధానానికి ప్రశంసలు అందించాలి. కానీ…వాళ్ల మాటలు వక్రీకరించి చెలరేగిపోతున్నారు. తెలిసి తెలియక ఏదైనా తప్పుగా మాట్లాడితే ఆమె ఉద్దేశం ఇది అని చెప్పాల్సింది పోయి.. తెలుగు భాషా పండితులం అని చెప్పుకునేవారంతా కూడా ఆమె మాటల్లో బూతులు వెతికి మరీ టైటిల్స్ పెట్టారు. నరేష్ చాలా కష్టపడతాడు..పది మంది ఎనర్జీతో సమానమైన ఎనర్జీ తనది..తనతో పోటీపడి పనిచేయడం ఎంతో కష్టం అంటూ స్పష్టంగా చెప్పింది ఆమె..కానీ రాత్రైతే నా పనైపోతుందన్నది మాత్రమే కోట్ చేశారు. తమలో ఉండే వికృతత్వాన్ని రకరకాలుగా ప్రదర్శించారు.

వాస్తవానికి పేరుకు ముందు హిజ్ ఎక్సలెన్సీ అని రాసుకునే విజయకృష్ణా నరేష్ తీరు చాలా సందర్భాల్లో అతిగానే ఉంటుంది. పవిత్రా లోకేష్ నరేష్ పబ్లిక్ లో చేసే రచ్చా మామూలుగా ఉండదు. హగ్గులు, ముద్దులు అబ్బో ఓ రేంజ్ లో ఉంటాయ్. అంతమాత్రాన ఆమె మంచిగా మాట్లాడినప్పుడు కూడా ఇలా వక్రీకరించాలా? పైగా నరేష్ అతి అన్నవిషయం పక్కనపెడితే…ఆర్టిస్టుగా నరేష్ నటనకు వంక పెట్టలేం. హీరోగా ఓ వెలుగు వెలిగాడు..ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా చాలా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం నరేష్ చేతిలో 9 సినిమాలున్నాయి. ఇవన్నీ ఉద్దేశించి పవిత్ర తనని పొగిడితే…ఆ కామెంట్స్ ని మిడ్ నైట్ మసాలా కథనంగా మార్చేశారు. ఇట్లున్నారు మరి…ద్యావుడా బుర్రలు కాస్త సరిచేయి…

తరవాత కథనం