ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, భారత్‌ ఆటగాళ్లు లేని ఐసీసీ వన్డే జట్టు- టెస్టు టీంలో ముగ్గురి టీమిండియా ప్లేయర్లకు చోటు

jasprit bumrah

ICC Team Of the Year: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 2024 సంవత్సరానికి గానూ పురుషుల వన్డే జట్టును ఎంపిక చేసింది. 11 మంది సభ్యులతో కూడిన ఈ ఐసీసీ జట్టులో ఒక్క భారత ఆటగాడికి కూడా చోటు దక్కలేదు. పాకిస్థాన్‌, అఫ్ఘానిస్థాన్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లకు చోటు దక్కింది. శ్రీలంక నుంచి గరిష్టంగా నలుగురు ఆటగాళ్లు ఉన్నారు. వెస్టిండీస్‌కు చెందిన ఒక ఆటగాడు ఈ జాబితాలో ఉన్నాడు.

11 మంది సభ్యుల జట్టులో పాక్ ఆటగాళ్లలో సామ్ అయూబ్, షాహీన్ షా ఆఫ్రిది, హరీస్ రౌఫ్ పేర్లు ఉన్నాయి. శ్రీలంక ఆటగాడు చరిత్ అసలంక జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. భారత్‌తోపాటు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వంటి దేశాల ఆటగాళ్లకి కూడా ఐసీసీ జట్టులో చోటు లేదు.

గతేడాది వన్డే క్రికెట్‌లో ఆటగాళ్లు, జట్ల ప్రదర్శనే సెలెక్షన్‌కు ప్రమాణం అని తెలుస్తోంది. భారత జట్టు గతేడాది శ్రీలంకతో ఆడిన మూడు వన్డే మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఒకటి టై అయ్యింది. అందుకే ఐసీసీ జట్టులో టీమిండియా ఆటగాళ్లకు చోటు లభించలేదు.
గతేడాది వన్డేల్లో ఆఫ్ఘనిస్తాన్ అద్భుత ప్రదర్శన చేసి 14 మ్యాచ్‌ల్లో 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. పాకిస్థాన్ జట్టు కూడా 2024లో మొత్తం 9 వన్డేలు ఆడి ఏడింటిలో విజయం సాధించింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన వన్డే సిరీస్‌లో పాక్ జట్టు చారిత్రాత్మక విజయాలు సొంతం చేసుకుంది. ఓపెనర్ సామ్ అయూబ్‌తోపాటు, ఫాస్ట్ బౌలర్లు హరీస్ రవూఫ్, షాహీన్ షా ఆఫ్రిది అద్భుతంగా రాణించారు. 2024లో శ్రీలంక జట్టు 18 వన్డేల్లో 12 విజయాలు సాధించింది.

Image

ICC పురుషుల ODI టీమ్ ఇదే :
1.సామ్ అయూబ్, పాకిస్తాన్
2. రహ్మానుల్లా గుర్బాజ్, ఆఫ్ఘనిస్తాన్
3. పాతుమ్ నిస్సాంక, శ్రీలంక
4. కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), శ్రీలంక
5. చరిత్ అసలంక (కెప్టెన్), శ్రీలంక
6. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, వెస్టిండీస్
7. అజ్మతుల్లా ఒమర్జాయ్, ఆఫ్ఘనిస్తాన్
8. వానిందు హసరంగా, శ్రీలంక
9. షాహీన్ షా ఆఫ్రిది, పాకిస్థాన్
10. హరీస్ రౌఫ్, పాకిస్తాన్
11. అల్లా ఘజన్‌ఫర్, ఆఫ్ఘనిస్తాన్

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) 2024 సంవత్సరానికి సంబంధించిన పురుషుల టెస్టు జట్టును కూడా ప్రకటించింది. ఈ జట్టుకు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (BGT) 2024-25లో కమిన్స్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా 3-1తో భారత్‌పై గెలిచింది.

ఇంగ్లాండ్ నుంచి గరిష్టంగా 4 మంది ఆటగాళ్లు ఉన్నారు. 11 మంది సభ్యుల జట్టులో భారత్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు ఉన్నారు. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు చోటు లభించింది. ఈ టీమ్‌లో న్యూజిలాండ్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు, శ్రీలంక, ఆస్ట్రేలియా నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.

జస్ప్రీత్ బుమ్రా 2024లో టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టాడు. బుమ్రా 2024లో మొత్తం 13 టెస్టు మ్యాచ్‌ల్లో 14.92 సగటుతో 71 వికెట్లు తీశాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో 32 వికెట్లతో బుమ్రా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు. యశస్వి జైస్వాల్‌కి కూడా 2024 బాగా కలిసి వచ్చింది. 15 టెస్టు మ్యాచ్‌ల్లో 54.74 సగటుతో 1478 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు 9 అర్ధ సెంచరీలు ఉన్నాయి. .

స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గతేడాది టెస్టు క్రికెట్‌లో అద్భుత రాించాడు. జడేజా 12 టెస్టు మ్యాచ్‌ల్లో 42.78 సగటుతో 984 పరుగులు చేశాడు, ఇందులో రెండు సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌్లో జడేజా గత ఏడాది టెస్టులో 24.29 సగటుతో 48 వికెట్లు తీశాడు.

Image

ICC టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024:
1. యశస్వి జైస్వాల్, భారత్‌
2. బెన్ డకెట్, ఇంగ్లాండ్
3. కేన్ విలియమ్సన్, న్యూజిలాండ్
4. జో రూట్, ఇంగ్లాండ్
5. హ్యారీ బ్రూక్, ఇంగ్లాండ్
6. కమిందు మెండిస్, శ్రీలంక
7. జామీ స్మిత్ (వికెట్ కీపర్), ఇంగ్లాండ్
8. రవీంద్ర జడేజా, భారత్‌
9. పాట్ కమిన్స్ (కెప్టెన్), ఆస్ట్రేలియా
10. మాట్ హెన్రీ, న్యూజిలాండ్
11. జస్ప్రీత్ బుమ్రా, భారత్‌

Image

తరవాత కథనం