Meerpet Murder Case:పోలీసులనే భయపెట్టిన హత్య కేసు- గురుమూర్తి స్కెచ్‌ చూసి షాక్ తిన్న ఖాకీలు

Meerpet Murder Case

Meerpet Murder Case: దేశ వ్యాప్త సంచలనంగా మారిన మీర్‌పేట వెంకట మాధవి హత్య కేసులో భర్త గురుమూర్తి మర్డర్‌ స్కెచ్‌ గురించి తెలిసిన పోలీసులే వణికిపోయారు. ఓ మనిషిని ఇంతలా చంపొచ్చా అని ఆశ్చర్యపోయారరు. ఈ కేసులో అతన్ని అరెస్టు చేసిన తర్వాత మీడియా ముందుకు తీసుకొచ్చిన పోలీసులు వివరాలు వెల్లడించారు. గురుమూర్తి మనిషి కాదని మనిషి రూపంలో ఉన్న నరరూప రాక్షసుడని అభివర్ణించారు. హత్య చేశానన్న పశ్చాతాపం కానీ, మరో ఇతర ఫీలింగ్స్ లేవని రాచకొండ సీపీ సుధీర్‌ బాబు తెలిపారు.

భార్య వెంకటమాధవని క్షణికావేశంలో కాకుండా పక్కా ప్లాన్ ప్రకారమే హతమార్చినట్టు పోలీసులు నిర్దారించారు. చూడటానికి మనిషి బాగున్నప్పటికీ క్రూరుడని వివరించారు. ఈ నెల 15,16 తేదీల్లో భార్యభర్తల మధ్య గొడవ జరిగిందని పేర్కొన్నారు. 16న ఉదయం 8 గంటలకు అనవసరంగానే ఆమెతో గొడవపెట్టుకున్నాడని తెలిపారు. కోపంతో ఆమెను బలంగా నెట్టేశాడని వివరించారు. ఆ ఘర్షణలో ఆమె తల గోడకు తాకింది. దీంతో స్పాట్‌లోనే మాధవి స్పృహతప్పి పడిపోయింది.

స్పృహకోల్పోయి పడి ఉన్న మాధవి గొంతు నులిమి గురుమూర్తి హతమార్చాడు. తర్వాత డెడ్‌బాడీని మాయం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. ఇంట్లో ఉన్న కత్తితో ముందుగా చేతులు కట్ చేశాడు. తర్వాత కాళ్లు తొలగించాడు. అనంతరం బాడీ, తల మరో రెండు భాగాలు చేశాడు. ఇలా డెడ్‌బాడీని నాలుగు భాగాలు చేసి బకెట్‌లో పెట్టాడు. అందులో నీళ్లు వేసి హీటర్‌తో బాగా మరిగించాడు.

హీటర్‌తో నాలుగు శరీర భాగాలను బాగా ఉడికించి మరింత చిన్నవిగా చేశాడు. తర్వాత వాటిని గ్యాస్‌ స్టౌవ్‌పై పెట్టి ఉడికించాడు. ఉడికిన మాంసాన్ని డ్రైనేజీలోకి ప్లష్ చేశాడు. మిగిలిన ఎముకులలను రోకలి బండతో దంచి పొడి చేశాడు. ఆ పొడిని ప్లాస్టిక్‌ బకెట్‌లో తీసుకెళ్లి జిల్లెలగూడ చెరువులో పోసేశాడు.

మొత్తం తలుపులు కిటికీలు అన్నీ మూసివేసి, డెడ్‌బాడీ వాసన బయటకు వెళ్లనీయకుండా జాగ్రత్తపడ్డాడు. సంక్రాంతి సెలవులు కావడంతో ఆ ప్రాంతంలో ఉన్న వారు ఎక్కువ మంది సెలవులకు వెళ్లిపోయారు. ఉన్న కొద్ది మంది ఈ వాసనను పెద్దగా పట్టించుకోలేదు. డెడ్‌బాడీని పూర్తిగా రూపుమాపిన తర్వాత ఇంటికి వచ్చిన గురుమూర్తి ఇంటిని శుభ్రం చేశాడు. అణువణువూ గాలించి ఫినాయిల్, డెటాల్, యాసిడ్‌ అన్నింటీని వేసి ఎక్కడా డెడ్‌బాడీ కోసిన ఆనవాళ్లు లేకుండా జాగ్రత్త పడ్డాడు.

ఆ తర్వాత బంధువుల ఇంటికి వెళ్లి తన పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చాడు. పిల్లలు ఇంటికి వచ్చిన వెంటనే అమ్మ గురించి అడిగారు. తనతో గొడవ పడి అమ్మ ఇంటి నుంచి వెళ్లిపోయిందని కథలు చెప్పాడు. వారు అది నిజమని అనుకొని దిగాలుగా కూర్చున్నారు.

భార్యను హత్య చేసిన తర్వాత డెడ్‌బాడీ కట్ చేసిన రూమ్‌కు తాళం వేశాడు. అయితే మాధవి కనిపించడం లేదని అత్తింటి వారికి తెలిసి రావడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా విచారణ చేసిన పోలీసులను కూడా గురుమూర్తి తప్పుదారి పట్టించాడు.

చివరకు తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. అయినా సరే డెడ్‌బాడీ గురించి అడిగితే రకరకాల స్టోరీలు చెప్పాడు. మున్సిపాలిటీ చెత్తకుప్పలో పడేశానని ఒకసారి తాను హత్య చేయలేదని ఇంకోసారి చెప్పే ప్రయత్నం చేశాడు. మొత్తానికి టెక్నాలజీ ఆధారంగా గురుమూర్తే హత్య చేసినట్టు నిర్దారణకు వచ్చిన తర్వాత అరెస్టు చేసినట్టు వెల్లడించారు. నిందితుడు గురుమూర్తి ఉపయోగించిన 16 రకాల ఆధారాల్ని స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.

తరవాత కథనం