క్లాస్‌మేట్‌పై అత్యాచారం చేసి చంపాలని సుపారీ ఇచ్చిన విద్యార్థి- స్కూల్‌ మూసివేసేందుకు స్నేహితుడినే హత్య చేసిన మరో స్టూడెంట్‌

Murder Case

శరవేగంగా పెరుగుతూ అందరికీ అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతికత ప్రజలను తప్పుదారి పట్టిస్తుంది. ఇప్పటి వరకు డబ్బుల కోసం, ప్రేమ, పేరు ప్రతిష్టల కోసం హత్యలు చేసిన వారిని చూసే ఉంటాం. ఇప్పుడు చెప్పే రెండు కేసులు పూర్తిగా వైవిధ్యమైనవి. స్కూల్ విద్య కూడా పూర్తి చేయని విద్యార్థులే హత్యలకు పురికొల్పుతున్నారు. చిన్న చిన్న అవసరాల కోసం స్నేహితులను హతమారుస్తున్నారు.

మహారాష్ట్రంలోని దౌండ్ తహసీల్‌లోని సెయింట్ సెబాస్టియన్ ఇంగ్లీషు పాఠశాలలో ఒక విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్య చేయాలని తోటి విద్యార్థికే సుపారీ ఇచ్చాడు మరో విద్యార్థి. ఆ విద్యార్థి తల్లిదండ్రుల సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. ఈ విషయాన్ని గ్రహించిన బాలిక ఉపాధ్యాయులకు సమాచారం చేర వేసింది.
పేరెంట్స్ సంతకం ఫోర్జరీ చేసిన ఘటనపై ఆ విద్యార్థిపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అందరి ముందు అవమాన పడేలా చేసిన బాలికపై సదరు విద్యార్థి కోపం పెంచుకున్నాడు. అందుకే ఆమెపై అత్యాచారం చేసి హత్య చేయాలని ప్లాన్ చేశాడు. దీని కోసం జూనియర్ విద్యార్థిని ఉసిగొల్పాడు. అలా చేసేందుకు ఆ అబ్బాయికి వంద రూపాయల సుపారీ కూడా ఇచ్చారు.

ఈ విషయం విద్యార్థుల ద్వారా మళ్లీ ఉపాధ్యాయులకు తెలిసిపోయింది. వెంటనే ప్రిన్సిపాల్‌ వరకు వెళ్లింది. విద్యార్థిని పిలిచి మందలించారు. అయితే ఈ విషయాన్ని బయటకు రాకుండా చేశారనే ఆరోపణ ఉంది. స్కూల్‌ రిపిటేషన్ పాడవుతుందని స్కూల్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయకుండా ప్రయత్నాలు చేశారు.

కానీ విషయం తెలుసుకున్న పోలీసులు స్కూల్‌లో జరిగిన దానిపై విచారణ చేపట్టారు. స్కూల్‌పై కేసు నమోదు చేశారు. ఇంత పెద్ద విషయాన్ని దాచి నందుకు ఆ విద్యార్థిని మానసికంగా ఇబ్బంది పెట్టినందుకు ప్రిన్సిపాల్‌తోపాటు ఉపాధ్యాయులపై కూడా కేసు నమోదు చేశారు. ఏదీ కూడా అధికారికంగా ఎవరూ చెప్పడం లేదు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇలాంటి దుర్ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. గత నెల ఓ స్కూల్ డైరెక్టర్‌ కారులో విద్యార్థి డెడ్‌బాడీ లభించింది. ఆ హత్య అతనే చేసి ఉంటాడని పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. కుటుంబ సమస్యల్లో ఉన్న ఆ డైరెక్టర్‌ బాలుడిని నరబలి ఇచ్చారేమో అన్న అనుమానం పోలీసులకు వచ్చింది. అయితే నెల రోజులుగా సాగుతున్న విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తోటి స్నేహితులే అతన్ని చంపేసి కారులో డెడ్‌బాడీ పెట్టేసినట్టు గుర్తించారు పోలీసులు. అసలేం జరిగిందని స్కూల్‌లో ఎలా ఉండేవాడని స్నేహితులను ప్రశ్నిస్తే భయంతో వారు ఈ విషయాన్ని పూస గుచ్చినట్టు చెప్పారు.

స్కూల్‌ను పూర్తిగా మూసివేయిస్తే చదువుకునే సమస్య ఉండదని ప్లాన్ చేసిన విద్యార్థులు ఓ వ్యక్తిని చంపేయాలని అది ఆ యాజమాన్యంపై నెట్టేయాలని చూశారు. అనుకున్నట్టుగానే ఓ విద్యార్థిని చంపేశారు. అలా చంపేసిన తర్వాత ఆ డెడ్‌బాడీని కారులో పెట్టారు. దీని వల్ల స్కూల్ పూర్తిగా మూసే వేస్తారని స్కేచ్ వేశారు. కానీ అసలు విషయం తెలియడంతో ఇప్పుడు ఆ విద్యార్థులు నిందితులుగా మారారు.

తరవాత కథనం